Flipkart Year-End Sale : ఫ్లిప్‌కార్ట్ ఇయర్-ఎండ్ సేల్.. ఈ శాంసంగ్ 5G ఫోన్‌పై అద్భుతమైన డిస్కౌంట్.. ఈ డీల్ మీకోసమే..!
Samsung Galaxy F06 5G : శాంసంగ్ గెలాక్సీ F06 5G ఫోన్ అతి తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. ఈ ఇయర్ ఎండ్ సేల్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌లో రూ.9,999కి అందుబాటులో ఉంది.
Samsung Galaxy F06 5G
Samsung Galaxy F06 5G : కొత్త శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ ఇయర్-ఎండ్ సేల్ సందర్భంగా శాంసంగ్ గెలాక్సీ F06 5G ఫోన్ తగ్గింపు ధరకే కొనుగోలు చేయొచ్చు. ఈ సేల్ సమయంలో మీ బడ్జెట్ రూ. 10వేల లోపు ఉంటే ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఇయర్ ఎండ్ సేల్ ఈరోజు ప్రారంభమై డిసెంబర్ 29 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ సమయంలో మీరు ప్రతి కేటగిరీలోనూ డిస్కౌంట్ ధరకే ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు.
ఈ ఫోన్ 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వెర్షన్ లాంచ్ సమయంలో రూ. 10,999 ధర ఉండగా ఇప్పుడు రూ.1,000 తగ్గింపు తర్వాత ఫ్లిప్‌కార్ట్‌లో రూ.9,999కి అందుబాటులో ఉంది. అలాగే, ఈ ఫోన్‌పై 5శాతం తగ్గింపు కూడా పొందవచ్చు.
మీరు ఈ ఫోన్‌పై ఆకర్షణీయమైన ఎక్స్ఛేంజ్ బోనస్‌తో కొనుగోలు చేయవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో అందించిన అదనపు డిస్కౌంట్ మీ పాత ఫోన్ బ్రాండ్, కండిషన్, కంపెనీ ఎక్స్ఛేంజ్ పాలసీని బట్టి మారుతుంది.
శాంసంగ్ గెలాక్సీ F06 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
ఈ సంస్థ నుంచి వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ 720×1600 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే గరిష్టంగా 800 నిట్స్ బ్రైట్‌నెస్ లెవల్ కలిగి ఉంది. 90Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది.
ఈ ఫోన్ గరిష్టంగా 6GB LPDDR4x ర్యామ్ మరో 6GB వర్చువల్ ర్యామ్ కలిగి ఉంది. మొత్తం 12GB ర్యామ్, 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజీతో ఈ ఫోన్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఫోన్‌లో ఎల్ఈడీ ఫ్లాష్‌తో రెండు కెమెరాలు ఉన్నాయి. ఇందులో 50MP మెయిన్ లెన్స్, 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి.
ఈ ఫోన్‌లో సెల్ఫీలు కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ శాంసంగ్ ఫోన్ 5000mAh బ్యాటరీ 25W ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ కలిగి ఉంటుంది. బయోమెట్రిక్ సెక్యూరిటీ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా వన్ యూఐ 7 ఫోన్‌కు పవర్ అందిస్తుంది.
5G, బ్లూటూత్ 5.3, GPS, Wi-Fi 802.11ac (2.4GHz + 5GHz), USB టైప్-C కనెక్టర్ కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. ఈ శాంసంగ్ ఫోన్‌కు లైట్ వైలెట్, బహామా బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లు ఉన్నాయి.
