Apple iPhone 16 to offer better battery life, bigger display, new leak reveals
Apple iPhone 16 : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ నుంచి మరో కొత్త ఐఫోన్ 16 మోడల్ రాబోతోంది. ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్లో లాంచ్ కావడానికి ముందే అనేక లీక్‌లు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఐఫోన్ 16 ఫీచర్లకు సంబంధించి వివరాలు లీక్ అయ్యాయి. ఐఫోన్ 16 మోడల్ పెద్ద డిస్‌ప్లేలతో రావచ్చని లీక్ డేటా వెల్లడించింది.
ఏది ఏమైనప్పటికీ.. కొత్త ఐఫోన్ బేస్ మోడల్‌లకు మాత్రమే ప్రామాణిక పరిమాణాన్ని కలిగి ఉంటుందని అంచనా. అయితే, ఐఫోన్ 16 ప్రో మోడల్‌లు కొంచెం భారీ ప్యానెల్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది. రాబోయే ఐఫోన్ 16 బ్యాటరీ లైఫ్ గురించి లీక్ డేటా ఏం సూచిస్తుందో ఇప్పుడు చూద్దాం.
దక్షిణ కొరియా నివేదిక ప్రకారం.. ఎల్‌టీపీఎస్ 60హెచ్‌జెడ్ అనే టెక్నాలజీని ఉపయోగించి ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ వరుసగా 6.12 అంగుళాలు, 6.69 అంగుళాల డిస్‌ప్లేలను కలిగి ఉండవచ్చని పలు నివేదికలు సూచిస్తున్నాయి. ఐఫోన్ 16 ఫోన్ సైజు సాధారణ ఐఫోన్ 15 మోడల్‌ల మాదిరిగానే ఉంటాయి. కొన్ని ఫీచర్లలో ఏయే మార్పులు ఉండవచ్చు అనేది ఇంకా స్పష్టత లేదు. అయినప్పటికీ, ప్రో మోడళ్లలో మరింత ముఖ్యమైన మార్పులు ఉండే అవకాశం ఉంది.
Read Also : WhatsApp AI chatbot : వాట్సాప్ యూజర్ల కోసం కొత్త ఏఐ చాట్‌బాట్.. ఇదేలా పనిచేస్తుందంటే?
ఐఫోన్ 16 ప్రో మోడల్ 6.27-అంగుళాల ఎల్‌టీపీఓ డిస్‌ప్లేను కలిగి ఉండవచ్చని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే, ప్రో మాక్స్ (అల్ట్రా) 6.86-అంగుళాల (LTPO) స్క్రీన్‌ను కలిగి ఉండవచ్చు. ఐఫోన్ 15ప్రోతో పోల్చి చూస్తే.. 6.1-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. ఐఫనో్ 15 ప్రో మ్యాక్స్ 6.7-అంగుళాల ప్యానెల్‌ను కలిగి ఉంది. కానీ, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ స్క్రీన్ పరిమాణం అసాధారణంగా పెద్దదిగా కనిపిస్తోంది.
Apple iPhone 16 offer
మరో లీక్ ప్రకారం.. ఐఫోన్ 16 ప్రో బ్యాటరీ ప్రోటోటైప్ ఫొటోలను వెల్లడించింది. ఈ ఫొటోలు తుషార మెటాలిక్ షెల్, బ్యాటరీ పరిమాణాన్ని ముందున్న వెర్షన్ కన్నా సుమారు 2.5 శాతం పెద్దగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ లీక్ కచ్చితమైనది అయితే.. ఐఫోన్ 16 ప్రో మోడల్‌లు బ్యాటరీలలో బ్లాక్ ఫాయిల్ కేసింగ్ మెటల్‌కు మారవచ్చు.
ఈ మార్పుతో డివైజ్ బరువును గణనీయంగా పెంచకుండా థర్మల్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇప్పటికే ఆపిల్ సిరీస్ 7 వంటి ఆపిల్ వాచ్‌లలో ఇలాంటి మార్పు చేసింది. థర్మల్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి, అన్ని ఐఫోన్ 16 మోడల్‌లు గ్రాఫేన్ హీట్ సింక్‌లను కలిగి ఉంటాయని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ హీట్ సింక్‌లు ఉష్ణ వాహకత ఫీచర్లను కలిగి ఉంటాయి. తద్వారా రాబోయే ఐఫోన్లలో హీటింగ్ సమస్యను సాధ్యమైనంతవరకు తగ్గిస్తాయి.
Read Also : Apple iPhone RAM : మీ ఆపిల్ ఐఫోన్ స్లో అయిందా? ర్యామ్ ఎలా క్లియర్ చేయాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్!