×
Ad

Apple iPhone 18 Leaks : ఆపిల్ ఐఫోన్ 18 వచ్చేస్తోందోచ్.. లాంచ్ డేట్, ఫుల్ ఫీచర్లు లీక్.. భారత్ ధర ఎంత ఉండొచ్చంటే?

Apple iPhone 18 Leaks : ఆపిల్ ఐఫోన్ 18 లాంచ్ డేట్ ఎప్పుడో తెలిసిందోచ్.. భారత్, ధర, ఫీచర్లు, కెమెరా, డిజైన్ వివరాలు లీక్ అయ్యాయి.. అవేంటో ఓసారి లుక్కేయండి.

Apple iPhone 18 Leaks

Apple iPhone 18 Leaks : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? మీకోసం అదిరిపోయే ఫీచర్ల మరో సరికొత్త ఐఫోన్ రాబోతుంది. కుపెర్టినో టెక్ దిగ్గజం ఇటీవలే ఐఫోన్ 17 సిరీస్‌ను లాంచ్ చేయగా ఇప్పుడు ఐఫోన్ 18 లైనప్‌పై దృష్టి సారించింది. ఈ ఐఫోన్ 18 రాకకు సంబంధించి అనేక లీక్‌లు, నివేదికలు మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి.

2026లో ఆపిల్ ఏయే ప్రొడక్టులను (Apple iPhone 18 Leaks) రిలీజ్ చేస్తుంది అనేదానిపై ఇప్పటినుంచి ఊహాగానాలు మొదలయ్యాయి. ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్, పవర్‌ఫుల్ A20 చిప్ వరకు వచ్చే ఏడాది లైనప్‌లో అతిపెద్ద మార్పులు చేస్తుందని భావిస్తున్నారు. ఐఫోన్ 18 గురించి భారత మార్కెట్లో ధర అంచనా, లాంచ్ తేదీ, స్పెషిఫికేషన్లు, డిజైన్, కెమెరాలపై పూర్తి వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం..

ఆపిల్ ఐఫోన్ 18 డిజైన్, స్పెసిఫికేషన్లు (అంచనా) :
నివేదికల ప్రకారం.. ఆపిల్ ఐఫోన్18 సరికొత్త A20 చిప్‌తో వస్తుంది. 2nm ప్రాసెస్‌పై రన్ అవుతుంది. ఐఫోన్ 17 సిరీస్‌కు పవర్ అందించే A19 చిప్ (3nm) కన్నా మరింత వేగంగా పనిచేస్తుంది. డిస్‌ప్లే ఫ్రంట్ సైడ్ పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఆపిల్ ఐఫోన్ 17లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో అదే 6.3-అంగుళాల ఎల్టీపీఓ సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ ప్యానెల్‌ ఉండే అవకాశం ఉంది.

Read Also : iPhone 17 vs iPhone Air : ఐఫోన్ లవర్స్‌కు బిగ్ డీల్.. ఆపిల్ ఐఫోన్ 17, ఐఫోన్ ఎయిర్, 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్.. ఏది కొంటే బెటర్?

డిజైన్ వారీగా అనేక ఫీచర్లు ఆసక్తికరంగా ఉండవచ్చు. ఆపిల్ డైనమిక్ ఐలాండ్‌ను న్యారో పిల్-ఆకారపు కటౌట్‌తో తీసుకురావచ్చు. ఐఫోన్ 16లో మాదిరిగా కెమెరా కంట్రోల్ బటన్‌లో చిన్నపాటి మార్పు ఉండొచ్చు. హైబ్రిడ్ సెటప్‌కు బదులుగా ఐఫోన్ 18 ప్రెజర్-ఓన్లీ డిటెక్షన్‌కు మారవచ్చు. అదనపు కెపాసిటివ్ లేయర్ లేకుండా ట్యాప్‌లు, ప్రెస్‌లు, స్వైప్‌లను అందించవచ్చు.

భారత్‌లో ఐఫోన్ 18 లాంచ్ తేదీ, ధర (అంచనా) :
ప్రముఖ ఆపిల్ విశ్లేషకుడు మింగ్-చి కువో ప్రకారం.. ఆపిల్ ఐఫోన్ 18 లాంచ్ తేదీపై అనేక ఊహాగానాలు ఉన్నాయి. బేస్ ఐఫోన్ 18, ఐఫోన్ 18e లాంచ్ తరువాత బహుశా 2027 ప్రారంభంలో లాంచ్ కావొచ్చు. ఐఫోన్ 18 ప్రో, ప్రో మాక్స్, ఫోల్డబుల్ ఐఫోన్, ఐఫోన్ ఎయిర్ 2 సెప్టెంబర్ 2026లో లాంచ్ అవుతాయని భావిస్తున్నారు. ధరల విషయానికొస్తే.. ఆపిల్ వచ్చే ఏడాది ధరలను పెంచే అవకాశం లేదు. ఐఫోన్ 17 మాదిరిగానే బేస్ ఐఫోన్ 18 భారత మార్కెట్లో దాదాపు రూ.82,900 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.