iPhone 17 vs iPhone Air : ఐఫోన్ లవర్స్‌కు బిగ్ డీల్.. ఆపిల్ ఐఫోన్ 17, ఐఫోన్ ఎయిర్, 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్.. ఏది కొంటే బెటర్?

iPhone 17 vs iPhone Air : ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్, ఐఫోన్ ఎయిర్ అద్భుతమైన ఫీచర్లతో ఆపిల్ లవర్స్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

iPhone 17 vs iPhone Air : ఐఫోన్ లవర్స్‌కు బిగ్ డీల్.. ఆపిల్ ఐఫోన్ 17, ఐఫోన్ ఎయిర్, 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్.. ఏది కొంటే బెటర్?

iPhone 17 vs iPhone Air

Updated On : October 3, 2025 / 12:33 PM IST

iPhone 17 vs iPhone Air : ఆపిల్ ఐఫోన్ అంటే ఆ క్రేజే వేరబ్బా.. కొంటే లైఫ్‌లో ఒకసారైన ఐఫోన్ కొనాలి. చాలామందికి ఇదే డ్రీమ్ ఉంటుంది. మార్కెట్లోకి కొత్త ఐఫోన్ వచ్చిందంటే ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికైనా వెనకాడారు. అందుకే ఐఫోన్లకు అంత డిమాండ్ ఉంటుంది. మీరు కూడా లేటెస్ట్ ఐఫోన్ 17 సిరీస్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఇది మీకోసమే..

ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్, ఐఫోన్ 17 ఎయిర్ ఇలా (iPhone 17 vs iPhone Air) అనేక కొత్త మోడళ్లు చాలానే ఉన్నాయి. ఇందులో ఏ ఐఫోన్ మోడల్ కొంటే బెటర్ అనేది నిర్ణయించుకోవడం కష్టమే. కానీ, మీ అవసరం, బడ్జెట్ బట్టి ఏ ఐఫోన్ కొనాలో డిసైడ్ చేసుకోవచ్చు. ఫీచర్లు, ధర పరంగా ఐఫోన్ 17 బేస్ మోడల్ దగ్గర నుంచి ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్, ఆపిల్ ఐఫోన్ ఎయిర్ మొత్తం ఐఫోన్ 17 సిరీస్‌లో ఏది కొంటే బెటర్ అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఆపిల్ ఐఫోన్ 17 కొనాలా? :
ఆపిల్ ఐఫోన్ 17 మోడల్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.3-అంగుళాల ఎల్టీపీఓ సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందిస్తుంది. ఆపిల్ A19 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. స్పీడ్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఐఫోన్ 48MP ప్రైమరీ షూటర్, 48MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్‌తో పవర్‌ఫుల్ డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్‌ కలిగి ఉంది.

Read Also : Flipkart Big Billion Days Sale : ఫ్లిప్‌కార్ట్ లాస్ట్ డే సేల్ ఆఫర్లు.. ఈ 10 స్మార్ట్‌ఫోన్లపై ఊహించని డిస్కౌంట్లు.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి..!

అంతేకాదు.. 18MP ఫ్రంట్ స్నాపర్ కూడా ఉంది. తక్కువ ధరలో ఐఫోన్ కొనాలని అనుకుంటే మాత్రం ఐఫోన్ 17 సిరీస్ బేస్ వేరియంట్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే మిగతా వేరియంట్లతో పోలిస్తే ఈ బేస్ మోడల్ ధర రూ. 85వేల లోపు ఉంటుంది. ఇమ్మర్సివ్ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ కెమెరా సిస్టమ్, స్పీడ్ ప్రాసెసర్ వంటి ఫీచర్లు కలిగి ఉంది.

ఆపిల్ ఐఫోన్ ఎయిర్ కొనాలా? వద్దా? :

ఆపిల్ ఐఫోన్ ఎయిర్ విషయానికి వస్తే.. ఈ ఐఫోన్ కన్నా స్టైల్ స్టేట్‌మెంట్ లాంటిది. సూపర్-స్లిమ్ ఛాసిస్‌ కలిగి ఉంది. ఈ ఐఫోన్ 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఆపిల్ A19 ప్రో ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌ కలిగి ఉంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఈ హ్యాండ్‌సెట్‌లో సింగిల్ 48MP బ్యాక్ కెమెరా, ఫ్రంట్ సైడ్ 18MP సెన్సార్ ఉన్నాయి. ఐఫోన్ ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది. లాంగ్ లైఫ్ ఎక్స్ పీరియన్స్ కోరుకునే యూజర్లు అయితే మీరు అత్యంత సన్నని డిజైన్ ఐఫోన్ ఎయిర్‌ ఎంచుకోవచ్చు.

ఐఫోన్ 17 ప్రో లేదా ఐఫోన్ 17 ప్రో మాక్స్ కొంటారా? :
ఆపిల్ ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ అనే రెండు మోడల్స్ ఐఫోన్ A19 ప్రో చిప్‌సెట్, ఆపిల్ 5-కోర్ జీపీయూతో వస్తాయి. ఈ రెండు ఫోన్‌లు 48MP ప్రైమరీ షూటర్, 48MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 48MP పెరిస్కోప్ టెలిఫోటో షూటర్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ కలిగి ఉన్నాయి.

సెల్ఫీలు, వీడియో కాల్‌ల విషయానికొస్తే.. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 18MP ఫ్రంట్ స్నాపర్‌ కలిగి ఉంది. మీకు అల్టిమేట్ ఫ్లాగ్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ కావాలంటే ప్రో వేరియంట్‌ కొనేసుకోవడం బెటర్. ఈ రెండింటిలో డిస్‌ప్లే, బ్యాటరీ సైజు తప్ప అన్ని ఒకే స్పెషిఫికేషన్లు ఉన్నాయి.