Apple iPhone 18 Pro Series : ఆపిల్ లవర్స్‌కు పండగే.. ఐఫోన్ 18 ప్రో సిరీస్‌ ప్రీ-ఆర్డర్లు షురూ.. ధరలు, ఆఫర్లు ఇవే!

Apple iPhone 18 Pro Series : ఆపిల్ ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. ధరలు, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ పూర్తి వివరాలివే..

  • Published on- September 12, 2026 / 07:42 PM IST

Apple iPhone 18 Pro Series

  • ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్ ప్రీ-ఆర్డర్లు షురూ
  • ఐఫోన్ 18 ప్రో ప్రో మాక్స్ సాయంత్రం 5:30 గంటల నుంచి అందుబాటులోకి
  • ఈ రెండు ఐఫోన్‌లు సెప్టెంబర్ 18 నుంచి ఫస్ట్ సేల్ ప్రారంభం

Apple iPhone 18 Pro Series : ఆపిల్ అభిమానులకు ఎగిరిగంతేసే వార్త.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్లు భారత మార్కెట్‌లోకి వచ్చేశాయి. కొత్త ప్రో మోడల్స్‌తో పాటు ఆపిల్ ఫస్ట్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ డ్యూయోను కూడా ఆవిష్కరించింది. అయితే, ఇప్పుడు ఐఫోన్ 18 ప్రో సిరీస్ కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి ప్రీ-ఆర్డర్లు రెడీగా ఉన్నాయి. పూర్తి ఆఫర్లు, ధర వివరాలివే..

ప్రీ-ఆర్డర్ ఎప్పటి నుంచంటే? :
భారత మార్కెట్లో ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ప్రీ-ఆర్డర్లు సెప్టెంబర్ 12 సాయంత్రం 5:30 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 18 నుంచి ఈ ఫోన్లు అమ్మకానికి అందుబాటులోకి రానున్నాయి.

ప్రీ-బుక్ ఎలా చేయాలి? :
ఆసక్తిగల కస్టమర్లు ఆపిల్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్, ఆపిల్ రిటైలర్లు, ఇతర ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా ఫోన్లను ప్రీ-బుక్ చేసుకోవచ్చు. ఆపిల్ వెబ్‌సైట్‌లో నచ్చిన మోడల్, కలర్, స్టోరేజ్ వేరియంట్‌ను ఎంచుకుని కొనేసుకోవచ్చు.

Read Also : Vivo Y51 Pro 5G : ఈ వివో 5G ఫోన్‌పై భారీ ఆఫర్.. రూ.54,999 ఫోన్ జస్ట్ రూ.32,999కే..

ధరలు ఎంతంటే? :
భారత్‌లో ఐఫోన్ 18 ప్రో 256GB ధర రూ.1,64,900 నుంచి ప్రారంభమవుతుంది. 512GB ధర రూ.1,89,900, 1TB ధర రూ.2,39,900, 2TB వేరియంట్ ధర రూ.3,14,900గా ఉంది. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ 256GB ధర రూ.1,79,900 నుంచి ప్రారంభమవుతుంది. 512GB ధర రూ.2,04,900 కాగా, 1TB, 2TB మోడళ్ల ధరలు వరుసగా రూ.2,54,900, రూ.3,29,900గా ఉన్నాయి.

అద్భుతమైన ఆఫర్లు :
అమెరికన్ ఎక్స్ ప్రెస్, యాక్సెస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు కార్డులతో కొన్నారంటే రూ.7వేల వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ వస్తుంది. ఆపిల్ పార్టనర్ బ్యాంకుల ద్వారా 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా పొందవచ్చు. ట్రేడ్-ఇన్ ద్వారా పాత డివైస్‌పై రూ.81,500 వరకు ఎక్స్చేంజ్ పొందవచ్చు. అదనంగా 3 నెలల ఆపిల్ మ్యూజిక్, ఆపిల్ టీవీ ప్లస్, ఆపిల్ అర్కేడ్ సబ్‌స్క్రిప్షన్లు ఫ్రీగా లభిస్తాయి.