Apple iPhone Duo : రూ.3 లక్షల ఐఫోన్.. కొనేవాళ్లు ఉన్నారా? ఆపిల్ ఫస్ట్ ఫోల్డబుల్ ఐఫోన్‌పై భారీ అంచనాలు!
Apple iPhone Duo Pre-Orders : రూ.2,99,900 ధరతో ఆపిల్ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ ఐఫోన్ డ్యుయో భారత్‌లో ప్రీ-ఆర్డర్లకు రెడీ అయింది. శాంసంగ్, గూగుల్, వివో ఫోన్లకు ఎంతవరకు పోటీ ఇస్తుంది? నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
- Sreehari A
- Published on- October 16, 2026 / 05:34 PM IST
Apple iPhone Duo Pre-Orders
- ఆపిల్ తొలి ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోంది.. ధర చూస్తే షాకే!
- శాంసంగ్, గూగుల్‌కు ఆపిల్ సవాల్.. ప్రీ-ఆర్డర్లు ప్రారంభం
- ఐఫోన్ డ్యుయో కోసం రూ.3 లక్షలు ఖర్చు చేస్తారా?
Apple iPhone Duo Pre-Orders : ఆపిల్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ ఐఫోన్ డ్యుయో (iPhone Duo) భారత మార్కెట్లోకి రానుంది. రూ.2,99,900 ధరతో 256GB వేరియంట్ అందుబాటులోకి రానుంది.
ఇక ఈ ఐఫోన్ మోడల్ సంబంధించి ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. అయితే, దాదాపు రూ.3 లక్షలు పెట్టి ఈ ఐఫోన్‌ను కొనుగోలు చేసేందుకు భారతీయులు ఆసక్తి చూపిస్తారా? ఇప్పుడు టెక్ ప్రపంచంలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..
శాంసంగ్, గూగుల్‌కు గట్టి పోటీ :
ఫోల్డబుల్ ఫోన్ సెగ్మెంట్లో ఆపిల్ కొత్తదే అయినా ఇప్పటికే శాంసంగ్, గూగుల్, మోటరోలా, వివో వంటి కంపెనీలు తమ ఫోల్డబుల్ ఫోన్లతో పోటీ పడుతున్నాయి. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ సిరీస్, గూగుల్ పిక్సెల్ ఫోల్డ్, మోటరోలా రేజర్, వివో ఎక్స్ ఫోల్డ్ సిరీస్ ఈ విభాగంలో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఈ బ్రాండ్ల ఫోన్లతో పోలిస్తే ఐఫోన్ డ్యుయో ధర ఎక్కువగా ఉండటం ఆపిల్‌కు సవాలుగా మారొచ్చు.
Read Also : Senior Citizens Alert : ఈ బ్యాంకులో FD ఉందా? 271 రోజులకే అదిరిపోయే వడ్డీ.. సీనియర్ సిటిజన్లకు ఎంత లాభమంటే!
ధర ఎక్కువైనా.. డిమాండ్ ఉంటుందా? :
టెక్ఆర్క్ వ్యవస్థాపకుడు, చీఫ్ అనలిస్ట్ ఫైసల్ కావూసా అభిప్రాయం ప్రకారం.. ఐఫోన్ డ్యుయోపై ఆసక్తి చూపించే ప్రత్యేక వినియోగదారులు ఉన్నారు. పోటీ కంపెనీల ఫోల్డబుల్ ఫోన్ల ధరలను పరిశీలిస్తే, ఆపిల్ ఫోన్ కొందరికి ఆకర్షణీయమైన ఎంపికగా కనిపించవచ్చని ఆయన పేర్కొన్నారు.
అయితే, కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ మాత్రం ఐఫోన్ ఫోల్డబుల్ మోడల్ ధర ఎక్కువగా ఉండటం వల్ల చాలామంది కొనుగోలుకు వెనుకాడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రీ-బుకింగ్స్‌లో ఆసక్తి కనిపించినంత మాత్రాన అవన్నీ అమ్మకాలుగా మారవని స్పష్టం చేశారు.
అసలు పరీక్ష సాఫ్ట్‌వేర్‌తోనే :
ఐఫోన్ డ్యుయో సక్సెస్ కేవలం ఆపిల్ బ్రాండ్ ఇమేజ్‌పై ఆధారపడదు. రెండు స్క్రీన్లపై యాప్స్ పర్ఫార్మెన్స్, మల్టీటాస్కింగ్ సౌకర్యాలు, ఫోన్‌ను మడిచినప్పుడు, ఓపెన్ చేస్తే సాఫ్ట్వేర్ ఎక్స్ పీరియన్స్ ఎలా ఉంటుందనేదే చాలా కీలకం. ఫస్ట్ ఫోల్డబుల్ ఐఫోన్‌తో ఆపిల్ సంచలనంగా మారనుంది.
