Apple iPhone se 4 launching soon list of changes upgrades
Apple iPhone SE 4 Launch : ఆపిల్ ఐఫోన్ లవర్స్‌కు అదిరే న్యూస్.. త్వరలో ఐఫోన్ SE4 ఫోన్ రాబోతుంది. నివేదికల ప్రకారం పరిశీలిస్తే.. వచ్చే ఏడాది ప్రారంభంలో కొత్త ఐఫోన్ SE 4 లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. బ్లూమ్‌బెర్గ్ మార్క్ గుర్మాన్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. ఈ కొత్త ఐఫోన్ ఎస్ఈ 4 సిరీస్ మోడల్‌పై భారీ అంచనాలే నెలకొన్నాయి.
Read Also : Apple iPhone SE 4 Price : గూగుల్ పిక్సెల్ 7aకు పోటీగా.. అత్యంత సరసమైన ధరకే ఆపిల్ ఐఫోన్ SE 4 వస్తోంది..!
ఐఫోన్ అభిమానుల్లో కూడా రాబోయే ఈ కొత్త మోడల్ గురించి తెలుసుకునేందుకు ఎక్కవగా ఆసక్తి చూపిస్తున్నారు. 2022లో ఆపిల్ చివరిసారిగా ఐఫోన్ ఎస్ఈ 3 (iPhone SE 3)ని 5G సపోర్ట్‌తో లాంచ్ చేసింది. కొత్త వెర్షన్ మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో ఐఫోన్ SE4 బెస్ట్ ఆప్షన్‌గా ఉండనుంది. అనేక ఆకర్షణీయమైన అప్‌గ్రేడ్‌లతో రానున్న ఐఫోన్ SE4 గురించి ముఖ్యమైన విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
2025 ప్రారంభంలో లాంచ్ అయ్యే ఛాన్స్ :
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. కొత్త ఐఫోన్ ఎస్ఈ 4, ఐప్యాడ్ ఎయిర్ మోడల్‌లు, మ్యాక్ లైనప్ వచ్చే ఏడాది ప్రారంభంలో లాంచ్ కానున్నాయి. లీక్‌ల ఆధారంగా పరిశీలిస్తే.. 2025 ప్రారంభంలో సరసమైన ధరలో ఐఫోన్ ఎస్ఈ 4 రానుంది. ఈ కొత్త అప్‌గ్రేడ్ ఐఫోన్.. ఐఫోన్ 14 మాదిరిగానే ఫీచర్లతో వస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి. అందుకే సరసమైన ధర ఉంటుందని అంచనా. అంతేకాదు.. కొత్త జనరేషన్ ఎస్ఈ భారీ స్ర్కీన్, మెరుగైన హార్డ్‌వేర్, వేగవంతమైన సాఫ్ట్‌వేర్, ఆపిల్ ఇంటెలిజెన్స్ సపోర్టుతో సహా అనేక ముఖ్యమైన అప్‌గ్రేడ్‌లను అందుకుంటుందని భావిస్తున్నారు.
డిస్‌ప్లే విషయానికి వస్తే.. :
ఐఫోన్ ఎస్ఈ 4 మోడల్ స్మార్ట్‌ఫోన్ 6.1 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. గత వెర్షన్ 4.7 అంగుళాల ఎల్‌సీడీ నుంచి అప్‌గ్రేడ్ పొందనుంది. అందులో 48ఎంపీ బ్యాక్ కెమెరా సెటప్‌తో రానుంది. పాత మోడల్ మాదిరిగా 12ఎంపీ సెన్సార్ కన్నా ఇది పెద్ద అప్‌గ్రేడ్ కానుంది. ఈ ఆపిల్ డివైజ్‌లో ఎ18 చిప్‌సెట్ కూడా ఉండనుంది. ఇప్పటికే ఈ ఫీచర్ బేస్ ఐఫోన్ 16 మోడల్‌లో కూడా అందుబాటులో ఉంది. మరో ఆకర్షణీయమైన అప్‌గ్రేడ్ ఆప్షన్ ఏంటంటే.. భారీ 6.7 అంగుళాల స్ర్కీన్ కలిగి ఉండనుంది. ఇందులో A15 బయోనిక్ చిప్ కూడా ఉండనుంది. ఈ డివైజ్ ఆపిల్ ఇంటెలెజెన్స్ కూడా సపోర్టు అందించనుంది.
ఫేస్ ఐడీతో ఐఫోన్ ఎస్ఈ 4 :
ఐఫోన్ ఎస్ఈ 4 గత మోడల్ మాదిరిగానే టచ్ ఐడీకి బదులుగా ఫేస్ ఐడీని కలిగి ఉంటుందని అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లీక డేటా ప్రకారం.. గత ఐఫోన్ ఎస్ఈ మోడల్‌తో పోలిస్తే.. భారీ బ్యాటరీ యూనిట్ కూడా ఉండే అవకాశం ఉంది. ఐఫోన్ 15 సిరీస్ మాదిరిగా ఇందులో యూఎస్‌బీ టైప్-సి పోర్టుతో వస్తుందని అంచనా. భారత మార్కెట్లో ఐఫోన్ ఎస్ఈ 3 మోడల్ ధర రూ.43,999 వద్ద లాంచ్ అయింది. రాబోయే ఈ కొత్త ఐఫోన్ ఎస్ఈ 4 వెర్షన్ కూడా అదే ధర రేంజులో ఉంటుందని భావిస్తున్నారు.