Apple iPhone 21 (Image Credit To Original Source)
Apple iPhone 21 : ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఇప్పటివరకూ ఐఫోన్ 17 వరకు మోడల్స్ చూశాం. రాబోయే రోజుల్లో ఐఫోన్ 18 కూడా రావొచ్చు. అంతకన్నా అడ్వాన్స్ ఫీచర్లతో సరికొత్త ఐఫోన్ అందించే దిశగా ఆపిల్ అడుగులు వేస్తోంది. ప్రస్తుత ఐఫోన్లలో లేని కెమెరాతో ఐఫోన్ తీసుకురానుంది.
అందిన సమాచారం ప్రకారం.. ఆపిల్ రాబోయే కొత్త ఐఫోన్లలో 200MP కెమెరాను తీసుకురావాలని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే, దీనికి మరికొన్ని ఏళ్ల సమయం పట్టవచ్చు. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ మోర్గాన్ స్టాన్లీ రీసెర్చర్ల ప్రకారం.. ఈ హై-రిజల్యూషన్ కెమెరాతో ఫస్ట్ ఐఫోన్ 21 మోడల్ 2028 నాటికి గ్లోబల్ మార్కెట్లోకి రావొచ్చు. 200MP కెమెరాతో రాబోయే ఫస్ట్ ఐఫోన్ 21 ఇదే కావచ్చు.
ఐఫోన్ 18లో కెమెరా అప్‌గ్రేడ్ లేనట్టే? :
ఐఫోన్ 18 సిరీస్‌తో ఈ కెమెరా అప్‌గ్రేడ్ వస్తుందని అంచనా వేసినప్పటికీ ఆపిల్ మాత్రం ఇప్పట్లో ఈ కెమెరాలను అందించే అవకాశం కనిపించడం లేదు. 200MP కెమెరా సెన్సార్లను అందించడంలో శాంసంగ్ కీలకంగా వ్యవహరిస్తోంది.
ఒకే సోర్స్‌పై ఆధారపడకుండా అనేక సరఫరాదారులతో పనిచేయడంపైనే ఆపిల్ దృష్టిపెడుతోంది. తద్వారా ఖర్చు ఆదా చేయాలని భావిస్తోంది. ఇదిలా ఉంటే.. కంపెనీ LiDAR సెన్సార్ల సరఫరాదారుల ప్లాంట్ కూడా విస్తరిస్తున్నట్లు సమాచారం.
Apple iPhone 21 (Image Credit To Original Source)
సోనీ ప్రస్తుతం ఈ పార్టులను మాత్రమే అందిస్తుండగా, ఆపిల్ ఇప్పుడు STMicroతో భాగస్వామ్య అవకాశాల గురించి చర్చిస్తున్నట్లు సమాచారం. అయితే, ఫేస్ ఐడీ సెన్సార్లు ప్రస్తుత సింగిల్ LITEతోనే ఉండే అవకాశం ఉంది. ఐఫోన్ 20వ వార్షికోత్సవం సందర్భంగా 2027లో ఆపిల్ అండర్-డిస్‌ప్లే ఫేస్ ఐడీ టెక్నాలజీని ప్రవేశపెట్టవచ్చని అంచనా.
మరోవైపు.. కెమెరాలో అప్‌గ్రేడ్స్ కాంపోనెంట్ ఖర్చులు పెరుగుతున్నప్పటికీ ఆపిల్ ప్రస్తుత ధరలను కొనసాగించే అవకాశం ఉంది. ఆపిల్ యూజర్లపై ధరల భారం పడకుండా పెరిగిన ఖర్చులను కంపెనీ భరించనుంది. ఐఫోన్ 17లో స్టోరేజ్ ఆప్షన్ పెంచినప్పటికీ ధర మాత్రం ఐఫోన్ 16 మాదిరిగానే ఉంచింది.