Samsung Galaxy S26 Ultra : కొంటే ఇలాంటి ఫోన్లు కొనాలి.. శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రాకు పోటీగా 5 కెమెరా ఫోన్లు.. ఏది కొంటారంటే?
Samsung Galaxy S26 Ultra : వచ్చే ఫిబ్రవరిలో శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్ రాబోతుంది. ఈ ఫోన్ లాంచ్ కు ముందే మార్కెట్లో కొనగల కొన్ని 5 కెమెరా ఫోన్లు ఉన్నాయి.. ఓసారి లుక్కేయండి.
Samsung Galaxy S26 Ultra (Image Credit To Original Source)
- ఫిబ్రవరి 25న శాన్ ఫ్రాన్సిస్కోలో గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2026 ఈవెంట్
- శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్ లాంచ్ చేసేందుకు సన్నాహాలు
- 200MP సెన్సార్ పవర్‌ఫుల్ క్వాడ్-కెమెరాలు, 8K వీడియో, డాల్బీ విజన్ HDR
- గెలాక్సీ S26 అల్ట్రాకు పోటీగా 5 కెమెరా ఫోన్లు మార్కెట్లో లభ్యం
Samsung Galaxy S26 Ultra : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? అతి త్వరలో శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా లాంచ్ కానుంది. శాన్ ఫ్రాన్సిస్కోలో ఫిబ్రవరి 25న జరగబోయే గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2026లో గెలాక్సీ S26 అల్ట్రాను లాంచ్ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ముందస్తు లీక్‌ల ప్రకారం.. ఈ అల్ట్రా ఫోన్ 200MP సెన్సార్ పవర్‌ఫుల్ క్వాడ్-కెమెరాతో రానుంది. ఇమేజింగ్ హార్డ్‌వేర్ వీడియో ఫీచర్ ఆకట్టుకునేలా ఉన్నాయి.
రాబోయే ఈ శాంసంగ్ ఫోన్ కన్నా బెటర్ ఫీచర్లతో మార్కెట్లో అనేక స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. అందులో ప్రధానంగా ఐఫోన్ 17 ప్రో, పిక్సెల్ 10 ప్రో నుంచి వివో X300 ప్రో, ఒప్పో ఫైండ్ X9 ప్రో వరకు అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నాయి. ఈ కెమెరా ఫోన్లలో ముఖ్యంగా 200MP సెన్సార్లు, పెరిస్కోప్ జూమ్, 8K వీడియో, డాల్బీ విజన్ HDR, ప్రో-గ్రేడ్ ఫొటోగ్రఫీ ఫీచర్‌లు ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రాతో పోటీపడే 5 కెమెరా ఫోన్లపై ఓసారి లుక్కేయండి.
ఐఫోన్ 17 ప్రో (రూ. 1,24,900) :
ఆపిల్ ఐఫోన్ 17 ప్రో వీడియో క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. ట్రిపుల్ 48MP కెమెరా సెటప్ వైడ్, అల్ట్రావైడ్ 4x పెరిస్కోప్ జూమ్ అందిస్తుంది. LiDAR అసిస్టెన్స్, హై ఫ్రేమ్ రేట్లలో ProRes RAW, డాల్బీ విజన్ HDR స్పేషియల్ వీడియో రికార్డింగ్ సపోర్టు చేస్తుంది. శాంసంగ్ ఫ్లాగ్‌షిప్‌కు పోటీగా ఫస్ట్ కెమెరా ఫోన్లలో ఒకటిగా నిలుస్తుంది.
వివో X300 ప్రో (రూ. 1,09,999) :
ఫొటోగ్రఫీ ప్రియుల కోసం వివో X300 ప్రో ఫోన్ అందిస్తోంది. 50MP OIS మెయిన్ సెన్సార్ 3.7x ఆప్టికల్ జూమ్, మాక్రో సపోర్ట్ అందించే భారీ 200MP పెరిస్కోప్ కెమెరాతో వస్తుంది.
అంతేకాకుండా 50MP అల్ట్రావైడ్ లెన్స్ అందిస్తుంది. జీయిస్ ఆప్టిక్స్, 8K వీడియో, డాల్బీ విజన్ హెచ్‌డీఆర్, 50MP సెల్ఫీ కెమెరాతో శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా కన్నా బెటర్ ఫీచర్లను అందిస్తుంది.

Samsung Galaxy S26 Ultra (Image Credit To Original Source)
ఒప్పో ఫైండ్ X9 ప్రో (రూ. 1,09,999) :
ఒప్పో ఫైండ్ X9 ప్రో కెమెరా సెటప్‌లో 50MP OIS మెయిన్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో భారీ 200MP పెరిస్కోప్ టెలిఫోటో 50MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. హాసెల్‌బ్లాడ్ కలర్ సైన్స్, లేజర్ AF, LOG వీడియో, డాల్బీ విజన్, 50MP 4K సెల్ఫీ కెమెరా ఫొటోగ్రఫీ ఫస్ట్ ఫ్లాగ్‌షిప్ అని చెప్పొచ్చు.
గూగుల్ పిక్సెల్ 10 ప్రో (రూ. 1,09,999) :
గూగుల్ పిక్సెల్ 10 ప్రోలో 50MP మెయిన్ సెన్సార్, 48MP 5x పెరిస్కోప్ టెలిఫోటో, 48MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. ఇందులో 42MP 4K సెల్ఫీ షూటర్ సపోర్టు ఉంది. గూగుల్ ఇమేజ్ ప్రాసెసింగ్‌తో నేచురల్ కలర్స్, డైనమిక్ రేంజ్ ఫీచర్లతో రాబోయే శాంసంగ్ ఫోన్‌కు పోటీగా నిలుస్తుంది.
వన్‌ప్లస్ 15 (రూ. 72,999):
వన్‌ప్లస్ 15 ఫోన్ తక్కువ ధరకే అద్భుతమైన కెమెరా పర్ఫార్మెన్స్ అందిస్తుంది. సోనీ IMX906 సెన్సార్, ట్రిపుల్ 50MP సెటప్, అల్ట్రావైడ్ 3.5x టెలిఫోటో లెన్స్ ఉంది. 8K రికార్డింగ్, డాల్బీ విజన్, HDR, అడ్వాన్స్‌డ్ స్టెబిలైజేషన్ 32MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. శాంసంగ్ అల్ట్రా ఫోన్‌తో పోటీపడేలా అద్భుతమైన కెమెరా ఫోన్‌గా చెప్పవచ్చు.
