Apple Festive Offer: భారత్‌లో ఐఫోన్ 13 సిరీస్‌పై భారీ డిస్కౌంట్.. డోంట్ మిస్!

ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ ఫెస్టివ్ ఆఫర్ తీసుకొచ్చింది. భారతీయ ఐఫోన్ కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త iPhone 13 సిరీస్ ఫోన్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.

Apple iPhone 13 Series : ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ ఫెస్టివ్ ఆఫర్ తీసుకొచ్చింది. భారతీయ ఐఫోన్ కస్టమర్ల కోసం ఈ ఆఫర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. కానీ, ఈ ఆఫర్ మాత్రం గత ఏడాదిలో రిలీజ్ అయిన iPhone 12, iPhone 12 mini ఫోన్లకు మాత్రమే వర్తిస్తుంది. ఈ ఫెస్టివ్ సీజన్ సమయంలో iPhone 13 కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? బ్యాంకు కార్డుల నుంచి ఏదైనా డిస్కౌంట్ ఉందా? లేదా ఫ్రీ ఎయిర్ ప్యాడ్స్ ఆఫర్ ఉందాని చూస్తున్నారా? అయితే ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందవచ్చు. ఆపిల్ ప్రమోషన్ లో భాగంగా ఐఫోన్ 13 సిరీస్ పై ట్రేడ్ ఆఫర్ అందిస్తోంది. ఈ కొత్త ఫోన్ రూ.53,200 తక్కువ ధరకే భారతీయ వినియోగదారులకు అందిస్తోంది. ఇందులో భాగంగా ఐఫోన్ వినియోగదారులు తమ పాత ఐఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లపై ఎక్స్ఛేంజ్  ఆఫర్ ద్వారా కొత్త ఐఫోన్ 13 సిరీస్ పై డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.
Airtel CashBack Offer : ఎయిర్‌టెల్ అదిరే ఆఫర్ .. ఆ స్మార్ట్‌ఫోన్స్ కొంటే రూ.6వేలు క్యాష్‌బ్యాక్

ఆపిల్ కంపెనీ అందించే ప్రత్యేకమైన ఆఫర్ iPhone 13పై రూ.53,200 వరకు అందిస్తోంది. ఐఫోన్ 12 ఫోన్ ఎక్సేంజ్ పై ఈ డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. ఈ అరుదైన ఆఫర్ అసలు వదులుకోవద్దని సూచిస్తోంది ఆపిల్.. ఎందుకంటే.. ఐఫోన్ 13 ప్రారంభ ధర రూ. 79,900. గత ఏడాదిలో iPhone 12 Series ఫోన్ కూడా ఇదే ధర పలికింది. కానీ, ఐఫోన్ 13 లాంచ్ తర్వాత ఐఫోన్ 12 ఫోన్ ధరను రూ.65,900కు తగ్గించింది. ఆపిల్ దృష్టిలో ఐఫోన్ 12 ఫోన్ పాత మోడల్.. అందుకే కొత్త ఐఫోన్ 13 ఎక్స్ఛేంజ్ కింద ఆఫర్ చేస్తోంది. ప్రతి ఏడాదిలో చాలామంది ఐఫోన్ యూజర్లు మార్కెట్లోకి వచ్చే కొత్త ఐఫోన్లకు మారిపోతుంటారు. ఆ కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త ఆఫర్ తీసుకొస్తోంది. కొత్త ఐఫోన్ 13 సిరీస్ ఫోన్ ధర తగ్గింపుతో రూ.53,200 అంటే.. దీనిపై డిస్కౌంట్ రూ.26,700 వరకు తగ్గినట్టే.. అప్పుడు మీ పాత ఐఫోన్ 12 ఫోన్ విలువ రూ.26,700 అన్నట్టే.. ఇక్కడే ఆపిల్ ఇదే లాజిక్ అప్లయ్ చేసింది.

ట్రేడింగ్ ఆఫర్ కింద ఐఫోన్ 12 ఎక్సేంజ్ చేస్తే iPhone 13 Series డిస్కౌంట్ ధరకే సొంతం చేసుకోవచ్చు. మరోవైపు ఆపిల్ వెబ్ సైట్లో (Apple Website) ఐఫోన్ 12 ఫోన్ ధర రూ. 65,900కే లభిస్తోంది. అంటే.. ఆపిల్ ఎక్స్ఛేంజ్ ధర కంటే రెండు రెట్లుపైనే ఉంది.. ఫ్లిప్‌కార్ట్  (Flipkart) వంటి షాపింగ్ వెబ్‌సైట్లలో ఐఫోన్ 12 చాలా తక్కువకే వస్తోంది. బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభంలో.. ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 12 ప్రారంభ ధర రూ. 49,999 విక్రయిస్తోంది, అధిక డిమాండ్ కారణంగా ధరలు పెరిగినప్పటికీ, కొత్త ధర ఆపిల్ ఐఫోన్ 12 ధర కంటే చాలా తక్కువని చెప్పాలి. ఐఫోన్ 13 వర్సెస్ ఐఫోన్ 12 ఫీచర్ల విషయానికి వస్తే.. గత ఏడాదిలో ఐఫోన్ 12 మెరుగైన A15 బయోనిక్ చిప్‌సెట్‌ని అమర్చింది. ప్రస్తుతం అత్యంత వేగవంతమైన ఐఫోన్ ప్రాసెసర్ అని ఆపిల్ చెబుతోంది, ఐఫోన్ 12 కంటే స్వల్పంగా పర్ఫార్మానెన్స్ ఉంది. ఐఫోన్ 12 ఇప్పటికీ అత్యంత శక్తివంతమైన ఫోన్‌లలో ఒకటిగా ఉంది. ఐఫోన్ 12, ఐఫోన్ 13 మధ్య పర్ఫార్మాన్స్ ఎలాంటి తేడా లేదు.

ఐఫోన్ 13 డిస్‌ప్లే మారే అవకాశం ఉంది. కాస్మెటిక్ మాత్రమే మారనుంది. ఆపిల్ ఐఫోన్ డిస్‌ప్లే నాచ్ తగ్గించినట్టు కనిపిస్తోంది. కానీ మిగతావన్నీ ఫీచర్లు ఒకేలా ఉండనున్నాయి. ఐఫోన్ 12 డిస్‌ప్లే ఐఫోన్ 13 డిస్‌ప్లే కంటే తక్కువగా ఉండదని అర్థం. ఈ రెండు ఐఫోన్‌లు Dolby విజన్, ట్రూ టోన్ టెక్నాలజీలకు సపోర్ట్ చేస్తాయి. ఐఫోన్ 13 కెమెరాలలో కొన్ని అప్‌గ్రేడ్‌ అయ్యాయి. కెమెరా, డిజైన్ ఇతర ఫీచర్లు దాదాపు ఒకేలా ఉంటాయి. ఐఫోన్ 13 కెమెరాలోని సినిమాటిక్ మోడ్ ఫీచర్ అదనపు ఆకర్షణగా ఉంది. అయితే వీడియోల విషయానికి వస్తే.. సాధారణ యూజర్ల కంటే మూవీ మేకర్‌లకు బాగా ఉపయోగపడుతుంది. మీ ఐఫోన్ 12 ఇప్పటికీ ఒక అద్భుతమైన డివైజ్.. ఐఫోన్ 13 అప్‌గ్రేడ్ కావాలని భావిస్తే మాత్రం.. ఆపిల్ మీకు అందిస్తున్న రూ .26,700 సరైన ధరగా చెప్పవచ్చు.
Reliance Jio : నెట్ వర్క్ సమస్యలు ఎదుర్కొనే యూజర్లకు జియో బంపర్ ఆఫర్..!

ట్రెండింగ్ వార్తలు