Apple MacBook Pro M4 : ఆపిల్ మ్యాక్‌బుక్ ప్రో M4 వెర్షన్ వచ్చేసిందోచ్.. భారత్‌లో ఈ డివైజ్ ధర ఎంతంటే?

Apple MacBook Pro M4 Launch : ఆపిల్ మ్యాక్‌బుక్ ప్రో ఎం4 14-అంగుళాలు, 16-అంగుళాల మోడళ్లలో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ రెండు మోడళ్ల ప్రారంభ ధర వరుసగా రూ. 1,69,900, రూ. 2,49,900కు అందుబాటులో ఉన్నాయి.

Apple MacBook Pro M4 Version Launched

Apple MacBook Pro M4 Launch : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ బిగ్ మ్యాక్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా మ్యాక్‌బుక్ ప్రో సిరీస్ లాంచ్ చేసింది. ఆపిల్ మ్యాక్‌బుక్ ఎం4 చిప్‌సెట్, మొత్తం ఇంటెలిజెన్స్ ఫీచర్లను కలిగి ఉంది. మ్యాక్‌బుక్ ఎం4 మ్యాక్‌బుక్ ప్రో ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉంది. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ఆపిల్ ఎం4 ప్రో, ఎం4 మ్యాక్స్ గత వెర్షన్ల కన్నా వేగవంతమైన పనితీరు, లాంగ్ టైమ్ బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.

భారత్‌లో ఆపిల్ మ్యాక్‌బుక్ ప్రో ఎం4 ధర ఎంతంటే? :
ఆపిల్ మ్యాక్‌బుక్ ప్రో ఎం4 14-అంగుళాలు, 16-అంగుళాల మోడళ్లలో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ రెండు మోడళ్ల ప్రారంభ ధర వరుసగా రూ. 1,69,900, రూ. 2,49,900కు అందుబాటులో ఉన్నాయి. మీ అవసరం, బడ్జెట్‌ను బట్టి ఎం4, ఎం4 ప్రో లేదా ఎం4 మ్యాక్ వేరియంట్‌ల నుంచి మీ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఆపిల్ మ్యాక్‌బుక్ ప్రో ఎం4 ఇప్పటికే ప్రీ-ఆర్డర్‌లో ఉంది. నవంబర్ 8 నుంచి దేశ మార్కెట్లో అందుబాటులో ఉంటుంది.

మ్యాక్‌బుక్ ప్రో ఎమ్4లో కొత్త ఫీచర్లు ఏంటి? :
మ్యాక్‌బుక్ ఎం4 సిరీస్ చిప్‌లతో కూడిన కొత్త మ్యాక్‌బుక్ ప్రో డిఫాల్ట్ ఆప్షన్‌గా 16జీబీ ర్యామ్, 14-అంగుళాల మోడల్‌తో మీరు ఎం4 మ్యాక్స్ వెర్షన్‌తో 64జీబీ వరకు అప్‌గ్రేడ్ చేయవచ్చు. 16-అంగుళాల వేరియంట్ 128జీబీ ర్యామ్, 8టీబీ వరకు స్టోరేజీ ఉంటుంది. మ్యాక్ మునుపటిలాగా లిక్విడ్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. అయితే, నానో-టెక్చర్ డిస్‌ప్లే అందుబాటులో ఉంది. మీకు 1000 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ ఇస్తుంది. 14-అంగుళాల మోడల్ ఎం4 చిప్‌సెట్‌తో సుమారు 1.55 కిలోల బరువు ఉంటుంది. అయితే, 16-అంగుళాల వెర్షన్ పెద్ద పరిమాణం కారణంగా 2.14 కిలోలు ఉంటుంది.

14-అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో థండర్‌బోల్ట్ 4 పోర్ట్‌లను కలిగి ఉంటుంది. అయితే, 16-అంగుళాల వేరియంట్ కొత్త థండర్‌బోల్ట్ 5 స్టాండర్డ్‌తో వస్తుంది. బ్యాటరీ లైఫ్ టైమ్ అద్భుతంగా ఉంటుంది.
ఆపిల్ మ్యాక్‌బుక్ ప్రో ఫ్రంట్ సైడ్‌లో కొత్త 12ఎంపీ సెంటర్‌స్టేజ్ కెమెరాను కూడా కలిగి ఉంది. ఆపిల్ ఇంటెలిజెన్స్ అనేది ఎం4 సిరీస్‌లో అతిపెద్దదిగా చెప్పవచ్చు. కొత్త ఎ-సిరీస్, ఎమ్-సిరీస్ చిప్‌లను నడిపే ఐఫోన్, ఐప్యాడ్ యూజర్లకు అందుబాటులో ఉన్న అన్ని ఏఐ ఫీచర్లను అందిస్తుంది.

Read Also : Honor Magic 7 Series Launch : వైర్‌లెస్ ఛార్జింగ్‌తో హానర్ మ్యాజిక్ 7 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు వివరాలివే!