Honor Magic 7 Series Launch : వైర్‌లెస్ ఛార్జింగ్‌తో హానర్ మ్యాజిక్ 7 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు వివరాలివే!

Honor Magic 7 Series Launch : హానర్ మ్యాజిక్ 7 ఫోన్ 5,650mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. అయితే, మ్యాజిక్ 7ప్రో 5,850mAh సెల్‌ను అందిస్తుంది. 100డబ్ల్యూ వైర్డు, 80డబ్ల్యూ వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి.

Honor Magic 7 Series Launch : వైర్‌లెస్ ఛార్జింగ్‌తో హానర్ మ్యాజిక్ 7 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు వివరాలివే!

Honor Magic 7, Magic 7 Pro Launched

Updated On : October 31, 2024 / 9:57 PM IST

Honor Magic 7 Series Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం హానర్ నుంచి సరికొత్త సిరీస్ ఫోన్లు వచ్చేశాయి. హానర్ మ్యాజిక్ 7, హానర్ మ్యాజిక్ 7 ప్రో చైనాలో లాంచ్ అయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు క్వాల్‌కామ్ సరికొత్త ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌ల ద్వారా 16జీబీ వరకు ర్యామ్, టెలిఫొటో షూటర్‌లతో సహా ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌, 50ఎంపీ ఫ్రంట్ కెమెరాలను కలిగి ఉంటాయి.

ఈ హ్యాండ్‌సెట్‌లు దుమ్ము, నీటి నిరోధకతకు ఐపీ68, ఐపీ69 రేటింగ్‌లతో వస్తాయి. హానర్ మ్యాజిక్ 7, మ్యాజిక్ 7ప్రో రెండూ 100డబ్ల్యూ వైర్డు, 80డబ్ల్యూ వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తాయి. ఆండ్రాయిడ్ 15-ఆధారిత మ్యాజిక్ఓఎస్ 9.0 స్కిన్ అవుట్-ఆఫ్-ది-బాక్స్‌పై రన్ అవుతాయి.

హానర్ మ్యాజిక్ 7, మ్యాజిక్ 7 ప్రో ధర, కలర్ ఆప్షన్లు :
చైనాలో హానర్ మ్యాజిక్ 7 12జీబీ + 256జీబీ ఆప్షన్ ధర సీఎన్‌వై 4,499 (సుమారు రూ. 53,100) నుంచి ప్రారంభమవుతుంది. అయితే, 12జీబీ + 512జీబీ వేరియంట్ సీఎన్‌వై 4,799 (సుమారు రూ. 56,700) వద్ద జాబితా అయింది. 16జీబీ + 512జీబీ, 16జీబీ+1జీబీ కాన్ఫిగరేషన్‌లు వరుసగా సీఎన్‌వై 4,999 (దాదాపు రూ. 59వేలు) సీఎన్‌వై 5,499 (దాదాపు రూ. 64,900) వద్ద అందుబాటులో ఉంటాయి.

హానర్ మ్యాజిక్ 7ప్రో 12జీబీ + 256జీబీ ఆప్షన్ ధర సీఎన్‌వై 5,699 (దాదాపు రూ. 67,300) ధరలో అందుబాటులో ఉంది. అయితే, 16జీబీ + 512జీబీ, 16జీబీ + 1టీబీ వెర్షన్‌ల ధర వరుసగా సీఎన్‌వై 6,199 (సుమారు రూ. 32007) సీఎన్‌వై 6,699 (దాదాపు రూ. 79,100)కు అందుబాటులో ఉన్నాయి. బేస్ హానర్ మ్యాజిక్ 7 మోడల్ మార్నింగ్ గ్లో గోల్డ్, మూన్ షాడో గ్రే, స్నో వైట్, స్కై బ్లూ, వెల్వెట్ బ్లాక్ అనే 5 కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఇందులో ప్రో వేరియంట్ మూన్ షాడో గ్రే, స్నో వైట్, స్కై బ్లూ, వెల్వెట్ బ్లాక్ షేడ్స్‌లో వస్తుంది. ఈ ఫోన్‌లు ప్రస్తుతం చైనాలో హానర్ వెబ్‌సైట్ ద్వారా ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉన్నాయి. నవంబర్ 8 నుంచి సేల్ ప్రారంభం అవుతుంది.

హానర్ మ్యాజిక్ 7, మ్యాజిక్ 7 ప్రో స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
హానర్ మ్యాజిక్ 7 6.78-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ (1,264 x 2,800 పిక్సెల్‌లు) ఎల్‌టీపీఓ ఓఎల్ఈడీ స్క్రీన్‌ను 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 1,600నిట్స్ గ్లోబల్ పీక్ బ్రైట్‌నెస్, కంటి రక్షణ కోసం టీయూవీ రైన్‌ల్యాండ్ సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది. అలాగే, హానర్ మ్యాజిక్ 7ప్రో 6.8-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ (1,280 x 2,800 పిక్సెల్‌లు) ఎల్‌టీపీఓ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది.

హానర్ మ్యాజిక్ 7 సిరీస్ ఫోన్‌లు 2 ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌ల ద్వారా 16జీబీ వరకు ర్యామ్, 1టీబీ వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తాయి. ఆండ్రాయిడ్ 15-ఆధారిత మ్యాజిక్OS 9.0 స్కిన్‌తో రన్ అవుతుంది. కెమెరా విషయానికి వస్తే.. హానర్ మ్యాజిక్ 7, హానర్ మ్యాజిక్ 7 ప్రో 1/1.3-అంగుళాల 50ఎంపీ ప్రైమరీ సెన్సార్‌లు, 50ఎంపీ సెకండరీ అల్ట్రా-వైడ్ షూటర్‌లతో అమర్చి ఉన్నాయి. వనిల్లా మోడల్ 3ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో 50ఎంపీ టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. అయితే, హానర్ ప్రో వేరియంట్ 3ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో 200ఎంపీ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లలోని ఫ్రంట్ కెమెరాలు 50ఎంపీ సెన్సార్‌లు ఉంటాయి.

హానర్ మ్యాజిక్ 7 ఫోన్ 5,650mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. అయితే, మ్యాజిక్ 7ప్రో 5,850mAh సెల్‌ను అందిస్తుంది. 100డబ్ల్యూ వైర్డు, 80డబ్ల్యూ వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు దుమ్ము, నీటి నిరోధకతకు ఐపీ68, ఐపీ69 రేటింగ్‌లతో వస్తాయి. భద్రత విషయానికి వస్తే.. ఇన్-డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌లను కలిగి ఉంటాయి. లైనప్ కోసం కనెక్టివిటీ ఆప్షన్లలో డ్యూయల్ 5జీ, డ్యూయల్ 4జీ వోల్ట్, వై-ఫై 7, బ్లూటూత్ 5.4, జీపీఎస్, ఏజీపీఎస్, జీఎల్ఓఎన్ఎస్ఎస్, BeiDou, గెలీలియో, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి.

Read Also : OnePlus 13 Launch : ట్రిపుల్ కెమెరాలతో వన్‌ప్లస్ 13 వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతంటే?