OnePlus 13 Launch : ట్రిపుల్ కెమెరాలతో వన్‌ప్లస్ 13 వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతంటే?
OnePlus 13 Launch : వన్‌ప్లస్ 13 ఫోన్ 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీతో బేస్ మోడల్ ధర సీఎన్‌వై 4,499 (దాదాపు రూ. 53,100)గా నిర్ణయించింది. 12జీబీ+512జీబీ మోడల్ ధర సీఎన్‌వై 4,899 (సుమారు రూ. 57,900)తో అందుబాటులో ఉంటుంది.

OnePlus 13 With Snapdragon 8 Elite Chip, 50-Megapixel Triple Rear Camera Setup
OnePlus 13 Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? వన్‌ప్లస్ 13 కంపెనీ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌గా చైనాలో లాంచ్ అయింది. క్వాల్‌కామ్ నుంచి సరికొత్త స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌తో వచ్చిన ఫస్ట్ హ్యాండ్‌సెట్‌లలో ఇదొకటి. గరిష్టంగా 24జీబీ ర్యామ్ 1టీబీ వరకు స్టోరేజీని కలిగి ఉంది. వన్‌ప్లస్ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను 6.82-అంగుళాల అమోల్డ్ స్క్రీన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్‌తో అమర్చింది. హాసెల్‌బ్లాడ్ ద్వారా ట్యూన్ చేసిన 50ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంది. వన్‌ప్లస్ 13 ఆండ్రాయిడ్ 15 ఆధారంగా కలర్‌ఓఎస్ 15పై రన్ అవుతుంది. అయితే, గ్లోబల్ మోడల్ ఆక్సిజన్‌ఓఎస్ 15తో వస్తుంది.
వన్‌ప్లస్ 13 ధర, లభ్యత :
వన్‌ప్లస్ 13 ఫోన్ 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీతో బేస్ మోడల్ ధర సీఎన్‌వై 4,499 (దాదాపు రూ. 53,100)గా నిర్ణయించింది. అయితే,12జీబీ+512జీబీ మోడల్ ధర సీఎన్‌వై 4,899 (సుమారు రూ. 57,900)తో అందుబాటులో ఉంటుంది. 16జీబీ+512జీబీ ధర సీఎన్‌వై 5,299 (దాదాపు రూ. 62,600)గా సెట్ అయింది. అయితే, 24జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజ్‌తో టాప్-ఆఫ్-ది-లైన్ మోడల్ సీఎన్‌వై 5,999 (సుమారు రూ. 70,900)కి అందుబాటులో ఉంటుంది.
చైనాలోని కస్టమర్‌లు కంపెనీ వెబ్‌సైట్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌ను ప్రీ-ఆర్డర్ చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ నవంబర్ 1 నుంచి విక్రయానికి అందుబాటులో ఉంటుంది. బ్లూ (లెదర్), అబ్సిడియన్ (గ్లాస్), వైట్ (గ్లాస్) కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. వన్‌ప్లస్ ఈ స్మార్ట్‌ఫోన్‌ను భారత్ సహా గ్లోబల్ మార్కెట్‌లలో కూడా లాంచ్ చేయనుంది.
వన్‌ప్లస్ 13 స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
డ్యూయల్-సిమ్ (నానో+నానో) వన్‌ప్లస్ 13 ఆండ్రాయిడ్ 15-ఆధారిత కలర్ఓఎస్15పై రన్ అవుతుంది. 6.82-అంగుళాల క్వాడ్-హెచ్‌డీ+ (1440×3168 పిక్సెల్‌లు) ఎల్‌టీపీఓ అమోల్డ్ స్క్రీన్‌ను 1Hz-120Hz మధ్య రిఫ్రెష్ రేట్‌తో బీఓఈ ఉత్పత్తి చేస్తుంది. గరిష్ట ప్రకాశం లెవల్ 4,500 నిట్స్, డాల్బీ విజన్ సపోర్ట్ అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ తక్కువ వెలుతురులో కూడా డిస్‌ప్లే 2,160Hz పల్స్-వెడల్పు మాడ్యులేషన్‌కు కూడా సపోర్టు ఇస్తుంది.
వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్, అడ్రినో 830 జీపీయూ, గరిష్టంగా 24జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ కలిగి ఉంది. మీరు వన్‌ప్లస్ 13లో 1టీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 ఇంటర్నల్ స్టోరేజీని పొందుతారు. స్టోరేజ్ కార్డ్ ద్వారా విస్తరించడం కుదరదని గమనించాలి.
గత వెర్షన్ల మాదిరిగానే వన్‌ప్లస్ 13 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. హాసెల్‌బ్లాడ్ ద్వారా ట్యూన్ అవుతుంది. ఓఐఎస్ ఎఫ్/1.6 ఎపర్చర్‌తో కూడిన 50ఎంపీ ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.2 ఎపర్చర్‌తో కూడిన 50ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 50ఎంపీ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా (3ఎక్స్ ఆప్టికల్, 6ఎక్స్ ఇన్-సెన్సర్, డిజిటల్) 120ని కలిగి ఉంటుంది. ఓఐఎస్ ఎఫ్/2.6 ఎపర్చరుతో వస్తుంది. ఫ్రంట్ సైడ్ ఎఫ్/2.4 ఎపర్చర్‌తో 32ఎంపీ కెమెరా కలిగి ఉంది.
ఈ హ్యాండ్‌సెట్‌లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, 4 మైక్రోఫోన్‌లు ఉన్నాయి. వన్‌ప్లస్ 13లోని కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 7, బ్లూటూత్ 5.4, ఎన్ఎఫ్‌సీ, డ్యూయల్ బ్యాండ్ జీపీఎస్, యూఎస్‌బీ 3.2 జనరేషన్ 1 టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ప్రాక్సిమిటీ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, కలర్ టెంపరేచర్ సెన్సార్, ఇ-కంపాస్, యాక్సిలెరోమీటర్, గైరోస్కోప్, హాల్ సెన్సార్, లేజర్ ఫోకస్ సెన్సార్, స్పెక్ట్రల్ సెన్సార్‌లను కలిగి ఉంటుంది.
బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం వన్‌ప్లస్ 13 డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. 100డబ్ల్యూ ఫ్లాష్ ఛార్జ్ (వైర్డ్), 50W ఫ్లాష్ ఛార్జ్ (వైర్‌లెస్) సపోర్టుతో 6,000mAh బ్యాటరీని అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ రివర్స్ వైర్డ్ (5W), రివర్స్ వైర్‌లెస్ (10W) ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. వన్‌ప్లస్ 13లో ఇన్‌ఫ్రారెడ్ (IR) ట్రాన్స్‌మిటర్ ఉంది. దుమ్ము, నీటి నిరోధకతకు ఐపీ68, ఐపీ69 సర్టిఫికేట్లను కలిగి ఉంది. వన్‌ప్లస్ 13 కొలతలు 162.9×76.5×8.9ఎమ్ఎమ్ బరువు, 210గ్రాముల (లెదర్ ఎండ్) అయితే, గ్లాస్ ఎండ్ 8.5ఎమ్ఎమ్ మందం, 213గ్రాముల బరువు ఉంటుంది.