Apple Pay Penalty : అప్పుడు చేసిన ఆ పనికి.. ఆపిల్ ఇప్పుడు కోట్లు చెల్లిస్తోంది!

ఆపిల్ కంపెనీ.. ఓ స్టూడెంట్‌కు కోట్లలో పెనాల్టీ చెల్లిస్తోంది. ఏకంగా రూ.36 కోట్లు వరకు చెల్లిస్తోంది. ఆపిల్ సంస్థకు చెందిన ఇద్దరు టెక్నిషియన్లు చేసిన పాడుపనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందట..

Apple Paying Penalty to Student : ఆపిల్ కంపెనీ.. ఓ స్టూడెంట్‌కు కోట్లలో పెనాల్టీ చెల్లిస్తోంది. ఏకంగా రూ.36 కోట్లు వరకు చెల్లిస్తోంది. ఆపిల్ సంస్థకు చెందిన ఇద్దరు టెక్నిషియన్లు చేసిన పాడుపనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందట .. రిపేర్‌కు వచ్చిన ఐఫోన్‌లో న్యూడ్ ఫొటోలను వారిద్దరూ ఫేస్‌బుక్‌లో అప్ లోడ్ చేశారట.. 2016లో ఈ ఘటన జరిగింది.. అప్పుడే ఆపిల్ కంపెనీపై బాధిత యువతి పరువు నష్టం దావా వేసింది.

ఫోన్ రిపేర్ అయ్యాక బాధితురాలికి చెందిన పది పర్సనల్ ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేశారు. ఆ ఫొటోలను చూసి స్నేహితులు ఆమెకు చెప్పడంతో డిలీట్ చేసింది. న్యాయ పోరాటానికి దిగింది. తనకు నష్టపరిహారంగా 50 లక్షల డాలర్లు (రూ.36 కోట్లు) వరకు చెల్లించాలని ఆమె తరఫు లాయర్లు ఆపిల్ కంపెనీని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఆపిల్ ఎట్టకేలకు ఆ మొత్తం చెల్లించేందుకు అంగీకరించింది.

ఫొటోలు, వీడియోలను ఫేసుబుక్ లో పోస్టుచేసిన ఐఫోన్ సర్వీసు సెంటర్ ఇద్దరు టెక్నిషియన్లను ఆపిల్ తొలగించింది. దీనిపై విచారణకు ఆదేశించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలకు జరగకుండా ఉండేలా కఠిన చర్యలు చేపట్టనున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు