Apple Stores in Delhi and Mumbai have boosted iPhone sales in India, says CEO Tim Cook
Apple Stores in India : భారత్‌లో ఐఫోన్ విక్రయాలు జోరందుకున్నాయి. ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ దేశంలో ఐఫోన్ అమ్మకాలు పెరగడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రధానంగా ఢిల్లీ, ముంబైలలో రెండు ఆపిల్ యాజమాన్యంలోని రిటైల్ స్టోర్‌లను ప్రారంభించి ఘనత సాధించారు. ఇదే జోష్‌తో రానున్న రోజుల్లో భారత్‌లో మరిన్ని ఆపిల్ పెట్టుబడులు రాబోతున్నాయని, దేశంలో మరిన్ని ఆపిల్ స్టోర్‌లను తెరవాలని కంపెనీ యోచిస్తోందని సీఈఓ కుక్ సూచించాడు. ఆపిల్ ఐఫోన్ త్రైమాసికం తర్వాత దేశంలో కొత్త కస్టమర్లను అందుకోనుంది.
ఆపిల్ లేటెస్ట్ త్రైమాసిక ఫలితాలు సైతం ఇదే చూపిస్తున్నాయి. గురువారమే ఆపిల్ క్యూ3 ఫలితాలను ప్రకటించింది. అందులో భారత్ కేవలం ఒక భాగం మాత్రమే. ఆదాయానికి సంబంధించి ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ కొన్ని భారత-నిర్దిష్ట బిట్‌లను ప్రస్తావించారు. ఇటీవలి త్రైమాసికంలో దేశంలో ఐఫోన్ల విక్రయాలు పాక్షికంగా రెండు ఆపిల్ స్టోర్‌ల ద్వారా పెరిగినట్టు కుక్ చెప్పారు. ఈ ఏడాదిలో ఏప్రిల్‌లో ఢిల్లీ, ముంబై రెండు ఆపిల్ స్టోర్లను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఢిల్లీ, ముంబైలలో రెండు రిటైల్ స్టోర్లను ప్రారంభించేందుకు భారత్‌ను సందర్శించిన కుక్.. స్టోర్ల పనితీరుపై సంతృప్తిని వ్యక్తం చేశాడు. స్టోర్లలో ఐఫోన్ల అమ్మకాలు అంచనాలను మించి ఉన్నాయని కుక్ పేర్కొన్నాడు. ఈ త్రైమాసికంలో మొదటి రెండు రిటైల్ స్టోర్‌లను ప్రారంభించామని అప్పటినుంచి ఐఫోన్లపై విక్రయాలు జోరుందుకున్నాయని తెలిపాడు. దేశంలో పెట్టుబడి పెట్టడంపై ఆపిల్ పని చేస్తూనే ఉందని, డైరెక్ట్-టు-కన్స్యూమర్ ఆఫర్లు కూడా ఉన్నాయని కుక్ చెప్పాడు. మరో మాటలో చెప్పాలంటే, భారత మార్కెట్లో మరిన్ని ఆపిల్ స్టోర్లను ఓపెన్ చేయాలని కంపెనీ భావిస్తోంది.
ప్రపంచంలోని రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా భారత్ స్థానాన్ని గుర్తించిన కుక్.. దేశంలో ఆపిల్ అనూహ్యంగా మంచి పనితీరును కనబరచాలని ఉద్ఘాటించారు. కంపెనీ వృద్ధి ఉన్నప్పటికీ, భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో కంపెనీ ప్రస్తుత మార్కెట్ వాటా తక్కువగానే ఉందని ఆయన అంగీకరించారు. అయినప్పటికీ, ఆపిల్‌కు భారత్ భారీ అవకాశాన్ని అందిస్తుందని, పెట్టుబడులు పెట్టేందుకు శక్తియుక్తులన్నింటినీ వెచ్చించేందుకు కంపెనీ కట్టుబడి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్ ప్రపంచంలో రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్ కావడంతో ఆపిల్ మరింతగా శ్రమించాల్సి ఉందని అన్నారు.
Apple Stores in Delhi and Mumbai have boosted iPhone sales in India, says CEO Tim Cook
ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఇప్పటికీ ఆపిల్ తక్కువ వాటాను కలిగి ఉందని చెప్పారు. ఇదే మాకు గొప్ప అవకాశమని భావిస్తున్నామని అన్నారాయన. ఆపిల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, లూకా మాస్త్రి మాట్లాడుతూ.. భారత మార్కెట్లో ఆపిల్ కంపెనీ ఆల్-టైమ్ సేల్స్ రికార్డ్‌ను సాధించిందని తెలిపారు. దేశంలో ఐఫోన్ జూన్ త్రైమాసిక రికార్డులను రెండంకెల ఆదాయ వృద్ధిని సాధించిందని అన్నారు. ఆపిల్ గురువారం త్రైమాసిక ఆదాయాన్ని 81.8 బిలియన్ డాలర్లుగా నివేదించింది. అంటే.. ఏడాదికి 1 శాతం తగ్గింది. అయినప్పటికీ, ఆపిల్ ఐఫోన్ల అమ్మకాల అంచనాలను అధిగమించింది.
ఆపిల్ భారత్‌లో 7వ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ :
ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 5.5 శాతం మార్కెట్ వాటాతో ఆపిల్ ఇప్పుడు భారత్‌లో 7వ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా ర్యాంక్ పొందిందని (IDC) తెలిపింది. ఆ కాలంలో దేశంలో షిప్పింగ్ చేసిన టాప్ 5G మోడల్ ఫోన్లలో ఆపిల్ iPhone 13, OnePlus Nord CE3 Lite ఉన్నాయి. భారత్‌లో ఆపిల్ విక్రయాల్లో ఏడాది ప్రాతిపదికన 61 శాతం వృద్ధిని సాధించినట్లు నివేదిక పేర్కొంది.
అయితే, దేశంలోని మొత్తం స్మార్ట్‌ఫోన్ మార్కెట్ చూస్తే మరోలా ఉంది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే.. 3 శాతం క్షీణతను ఎదుర్కొంది. అయినప్పటికీ, గత త్రైమాసికంతో పోల్చితే.. జనవరి నుంచి మార్చి వరకు మార్కెట్‌లో 10 శాతం సీక్వెన్షియల్ వృద్ధి ఆశాజనకంగా ఉన్నట్టు కనిపిస్తోంది.
Read Also : Laptops Price in India : పీసీల దిగుమతులపై ఆంక్షల ఎఫెక్ట్.. భారీగా పెరగనున్న ల్యాప్‌టాప్‌ల ధరలు..!