Apple Warn iPhone Users : మెర్సిన‌రీ స్పైవేర్‌ అటాక్.. భారత్ సహా 92 దేశాల్లోని ఐఫోన్ యూజర్లకు ఆపిల్ హెచ్చరిక..!

Apple Warn iPhone Users : ప్రపంచవ్యాప్తంగా 92 దేశాల్లోని ఐఫోన్ యూజర్లకు ఆపిల్ వార్నింగ్ నోటిఫికేషన్ పంపుతోంది. మెర్సినరీ స్పైవేర్ అటాక్ గురించి యూజర్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

Apple Warn iPhone Users : మీరు ఐఫోన్ వాడుతున్నారా? అయితే, తస్మాత్ జాగ్రత్త.. మెర్సినరీ స్పైవేర్ అటాక్ రిస్క్ ఉందంటూ ఆపిల్ తమ ఐఫోన్ యూజర్లను హెచ్చరిస్తోంది. ఇప్పటికే అనేక దేశాల్లోని ఐఫోన్ యూజర్లను మెర్సినరీ స్పైవేర్ దాడికి గురయ్యే ప్రమాదం ఉండవచ్చనని ఆపిల్ హెచ్చరించింది. భారత్ సహా 92 దేశాలలో ఐఫోన్ యూజర్లకు హెచ్చరిక జారీ చేసింది.

Read Also : WhatsApp New Feature : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై చాట్‌లో డాక్యుమెంట్ డౌన్‌లోడ్ చేయకుండానే చూడొచ్చు..!

మీ ఐఫోన్ డివైజ్‌‌లను హ్యాకర్లు హ్యాక్ చేసి ఉంటారని వార్నింగ్ నోటిఫికేషన్‌లో పేర్కొంది. గత బుధవారం రాత్రి (ఏప్రిల్ 10న) ఆపిల్ మెయిల్ ద్వారా నోటిఫికేషన్ పంపింది. అయితే, కంపెనీ ఈ దాడులను నిర్దిష్ట గ్రూపులకు ఆపాదించలేదు. అంతేకాదు.. ఐఫోన్ యూజర్లను అప్రమత్తం చేసిన దేశాల జాబితాను కూడా ఆపిల్ వెల్లడించలేదు.

మొత్తం 150 దేశాల్లోని ఐఫోన్ యూజర్లకు హెచ్చరిక :
ఐఫోన్ తయారీదారు ఈ వార్నింగ్ నోటిఫికేషన్‌లు ఎలా పనిచేస్తాయనే వివరాలతో పాటు మెర్సినరీ స్పైవేర్ దాడుల ద్వారా లక్ష్యంగా చేసుకున్న వినియోగదారుల సమాచారంతో పాటు సపోర్టు డాక్యుమెంట్ కూడా అప్‌డేట్ చేసింది. కంపెనీ 92 దేశాల్లోని ఐఫోన్‌ యూజర్లను మెర్సినరీ స్పైవేర్‌తో లక్ష్యంగా చేసుకుని ఉండవచ్చని హెచ్చరించింది.

మీ ఆపిల్ ఐడీ-xxx-తో ఇంటిగ్రేట్ అయిన ఐఫోన్‌ను రిమోట్‌గా మార్చేసి మెర్సినరీ స్పైవేర్ దాడి చేస్తున్నట్టుగా ఆపిల్ గుర్తించింది. ఇదే విషయాన్ని కంపెనీ ఐఫోన్ యూజర్లకు ఏప్రిల్ 10 మధ్యాహ్నం 12గంటలకు పంపిన ఇమెయిల్‌లో పేర్కొంది. ఇప్పటివరకు 150 దేశాల్లోని ఐఫోన్ యూజర్లకు ఆపిల్ ఇమెయిల్ ద్వారా హెచ్చరిక జారీచేయగా.. కంపెనీ ఈ లక్ష్య స్పైవేర్ దాడులకు సంబంధించి వివరాలను వెల్లడించలేదు.

ఐఫోన్ iOS 17.4.1కు అప్‌డేట్ చేసుకోండి :
అంతేకాదు.. ఆపిల్ ఎన్ఎస్ఓ గ్రూప్ అభివృద్ధి చేసిన పెగాసస్ స్పైవేర్ అటాక్ గురించి కూడా వార్నింగ్ నోటిఫికేషన్‌లో ప్రస్తావించింది. వార్నింగ్ నోటిఫికేషన్ ఇమెయిల్‌ను స్వీకరించిన యూజర్లను ఆపిల్ తమ ఐఫోన్‌లో లాక్‌డౌన్ మోడ్‌ను ఎనేబుల్ చేయమని సూచిస్తోంది. ఈ ఫీచర్ ద్వారా స్పైవేర్ దాడులను నివారించే స్పెషల్ మోడ్ అని చెప్పవచ్చు.

Apple iPhone Users  

ఐఫోన్ యూజర్లు iOS 17.4.1కి అప్‌డేట్ చేసుకోవాలని సూచిస్తోంది. ఇతర డివైజ్‌లు, మెసేజింగ్, క్లౌడ్ యాప్‌లను అప్‌డేట్ చేయమని కూడా సూచిస్తోంది. మెర్సెనరీ స్పైవేర్ ద్వారా లక్ష్యంగా చేసుకున్న యూజర్లకు నిపుణుల మార్గదర్శకత్వం కోసం ఆపిల్ పలు సూచనలు చేసింది. ఈ మెర్సెనరీ స్పైవేర్ దాడులు ఎలా పనిచేస్తాయో వివరిస్తూ వార్నింగ్ నోటిఫికేషన్‌లకు సంబంధించిన సపోర్ట్ డాక్యుమెంట్‌ను కూడా కంపెనీ అప్‌డేట్ చేసింది.

ఐఫోన్ యూజర్ల వివరాలను ఆపిల్ అడగదు :
కంపెనీ మెర్సినరీ దాడికి అనుగుణంగా కనిపించే యాక్టివిటీని గుర్తించిన తర్వాత యూజర్లకు ఆపిల్ ఐడీ అనుబంధ ఇమెయిల్, ఫోన్ నంబర్‌లలో వరుసగా ఇమెయిల్, ఐమెసేజ్ నోటిఫికేషన్‌ను పంపుతుంది. ఆపిల్ ఐడీ వెబ్‌సైట్‌కి సైన్ ఇన్ చేసిన యూజర్లకు సపోర్టు డాక్యుమెంట్ ప్రకారం.. పేజీ ఎగువన థ్రెట్ నోటిఫికేషన్ బ్యానర్‌ను కూడా చూడవచ్చు.

ఆపిల్ వార్నింగ్ నోటిఫికేషన్‌లో సపోర్టు పేజీలో ఆపిల్ యూజర్లను లింక్‌లను క్లిక్ చేయడం, ఫైల్‌లను ఓపెన్ చేయడం, అనుమానాస్పద యాప్‌లను ఇన్‌స్టాల్ చేయడం, ఆపిల్ ఐడీ పాస్‌వర్డ్ లేదా వెరిఫికేషన్ కోడ్‌ని ఫోన్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా పంపమని యూజర్లను ఎప్పుడూ అడగవని కూడా తెలియజేసింది. ఆపిల్ పంపిన వార్నింగ్ నోటిఫికేషన్‌లో క్లిక్ చేసే లింక్‌లు లేవు.

Read Also : Apple iPhone 15 : ఆపిల్ ఐఫోన్ 15 కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకే ఈ డీల్‌ ఎలా పొందాలంటే?

ట్రెండింగ్ వార్తలు