Apple Watch ECG Feature : మహిళ ప్రాణాన్ని కాపాడిన ఆపిల్ వాచ్.. హార్ట్‌లో బ్లాక్ గుర్తించి అలర్ట్ చేసిన ఈసీజీ ఫీచర్..!
Apple Watch ECG Feature : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) సరికొత్త టెక్నాలజీతో కూడిన డివైజ్‌లను గ్లోబల్ మార్కెట్లోకి ప్రవేశపెడుతోంది.

Apple Watch saves life again, ECG feature helps woman detect undiagnosed heart blockage
Apple Watch ECG Feature : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) సరికొత్త టెక్నాలజీతో కూడిన డివైజ్‌లను గ్లోబల్ మార్కెట్లోకి ప్రవేశపెడుతోంది. ఆపిల్ ప్రొడక్టుల్లో ఆపిల్ వాచ్ (Apple Watch) అద్భుతమైన హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఆపిల్ వాచ్ ఎంతోమంది ప్రాణాలను కాపాడింది. ఇప్పుడు మరోసారి ఆపిల్ వాచ్ ఒక మహిళ జీవితాన్ని సేవ్ చేసింది.
ఆపిల్ వాచ్‌లో సాధారణంగా క్రాష్ డిటెక్షన్ అలర్ట్, శాటిలైట్ ఎమర్జెన్సీ కాల్, హార్ట్ రేట్ మానిటర్ వంటి ఫీచర్లు Apple డివైజ్‌లను అందించాయి. ఆపిల్ iPhones, Apple Watch వంటి Apple డివైజ్‌లను తప్పనిసరిగా వినియోగించుకోవాలి. ప్రమాదకర పరిస్థితులలో సకాలంలో హెచ్చరికలను పంపడం ద్వారా ఆపిల్ వాచ్‌లోని ఎమర్జెన్సీ, హెల్త్ ఫీచర్‌లు ఎంతోమంది జీవితాలను కాపాడాయి.
Apple వాచ్‌లోని Apple ECG ఫీచర్ హార్ట్ బ్లాకేజ్ గుర్తించడంలో సాయపడింది. తద్వారా ఒక మహిళ జీవితాన్ని రక్షించింది. ఇంగ్లండ్‌లోని గేట్స్‌హెడ్‌కు చెందిన ఎలైన్ థాంప్సన్ ఇటీవల ఆపిల్ వాచ్‌లో హార్ట్ రేట్ వార్నింగ్స్ పంపింది. దాంతో ఆ మహిళ ముందుజాగ్రత్తగా కార్డియాలజిస్ట్‌ను సంప్రదించింది. ఆమెను పరీక్షించిన డాక్టర్ గుండె మానిటర్‌ను అమర్చి వారం పాటు గుండె పనితీరును ట్రాక్ చేశారు. ఈ సందర్భంగా ఆ మహిళ మాట్లాడుతూ.. ‘ఒక రోజు ఉదయం నాకు రెడ్ అలర్ట్ వచ్చింది. అది నన్ను డాక్టర్‌ని సంప్రదించాలని అలర్ట్ చేసింది.
ఆపిల్ వాచ్ చెప్పిందే చేసాను. వాచ్ రికార్డ్ చేసిన ఫలితాలను వైద్యులకు చూపించాను’ అని ఆమె తెలిపింది. ఒకరోజు రాత్రి, థాంప్సన్ నిద్రపోతున్న సమయంలో ఆమె గుండె 19 సెకన్ల పాటు ఆగిపోయిన తర్వాత హార్ట్ మానిటర్ ఆసుపత్రికి ఎమర్జెన్సీ కాల్ పంపింది. వెంటనే స్పందించిన వైద్య సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించగా వైద్య పరీక్షల్లో గుండెలో బ్లాకులు ఏర్పడినట్లు తేలింది. ఆమె గుండెలో పేస్‌మేకర్‌ను అమర్చారని నివేదించింది. ఆపిల్ వాచ్ థామ్సన్ ప్రాణాలను కాపాడింది. గతంలో ఆమెకు సంబంధించిన వైద్య చరిత్ర ఉందని, 2018లో మూర్ఛ వ్యాధికి గురయినట్లు ఆమె తెలిపింది.

Apple Watch saves life again, ECG feature helps woman
ఆపిల్ వాచ్‌లో ECG ఎలా పనిచేస్తుందంటే? :
Apple వాచ్ సిరీస్ 4కి ప్రత్యేకంగా ECG ఫీచర్‌తో నోటిఫికేషన్ (electrocardiogram) ఫీచర్‌లను సెప్టెంబర్ 2018లో ప్రారంభించింది. ఈ ఫీచర్ అన్ని లేటెస్ట్ Apple Watch మోడల్‌లలో అందుబాటులో ఉంది. ECG ఫీచర్‌లో గుండె కొట్టుకునేలా చేసే విద్యుత్ పల్స్‌లను సూచించే ఎలక్ట్రో కార్డియోగ్రామ్‌ను రికార్డ్ చేసే యాప్ అందుబాటులో ఉంది. ఈ ECG ఫీచర్ హృదయ స్పందన రేటును మానిటరింగ్ చేయడంతో పాటు పల్స్‌లను కూడా ట్రాక్ చేస్తుంది. ఒకవేళ గుండె సరిగా స్పందించకుంటే వెంటనే ఎమర్జెన్సీ అలర్ట్స్ పంపుతుంది.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..