Apple Watch : అదిరిందయ్యా Apple.. వాచ్‌కే కెమెరా, AI కూడా.. ఎప్పుడు వస్తుందంటే..?

Apple Watch : ఆపిల్ వాచ్ అల్ట్రా యూజర్లు తమ వాచ్ కెమెరాతో ఏదైనా వస్తువును ఈజీగా స్కాన్ చేయగలరు. స్టాండర్డ్ ఆపిల్ వాచ్ యూజర్లు తమ మణికట్టును తిప్పి స్కాన్ చేయొచ్చు.

Apple Watch to get cameras

Apple Watch : ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. అతి త్వరలో ఏఐ కెమెరా ఫీచర్లతో ఆపిల్ వాచ్‌ మోడల్స్ రానున్నాయి. భవిష్యత్తులో స్మార్ట్‌ఫోన్లకు మించిన ఫీచర్లతో ఆపిల్ వాచ్‌లను చూడొచ్చు. ఆపిల్ స్మార్ట్‌వాచ్‌లలో కెమెరాలను ఇంటిగ్రేట్ చేయాలని యోచిస్తోంది. ఐఫోన్లలో మాదిరిగానే ఆపిల్ వాచ్‌లలో కూడా ఏఐ కెమెరా ఫీచర్లు ఉంటాయి.

నివేదిక ప్రకారం.. ఇంటిగ్రేటెడ్ కెమెరాలు, AI ఫీచర్లతో కూడిన కొత్త ఆపిల్ వాచ్ మోడళ్లపై ఆపిల్ తీసుకురానుంది. ఆపిల్ వాచ్ అల్ట్రా క్రౌన్, సైడ్ బటన్ దగ్గర కెమెరా ఉండవచ్చు. ఈ ఏఐ కెమెరాతో వినియోగదారులు తమ చుట్టూ ఉన్న వస్తువులను ఈజీగా స్కాన్ చేయొచ్చు.

Read Also : BSNL Offer : BSNL ఫ్యామిలీ ప్లాన్ అదిరిందిగా.. సింగిల్ రీఛార్జ్‌తో 3 సిమ్ కార్డుల్లో ఫ్రీ కాల్స్, హైస్పీడ్ డేటా.. పోలే.. అదిరిపోలే..!

అంతేకాదు.. ఆయా వస్తువుల గురించి సమాచారాన్ని కూడా పొందవచ్చు. అయితే, ఈ ఫీచర్‌ను ఆపిల్ వాచ్ స్టాండర్డ్ సిరీస్‌లో చేర్చనుంది. కెమెరాతో కూడిన స్టాండర్డ్ మోడల్, అల్ట్రా మోడల్‌తో సహా కొత్త ఆపిల్ వాచ్‌లు 2027 నాటికి లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

2015 నుంచి ఆపిల్ వాచ్ టాప్ స్మార్ట్‌వాచ్‌గా పేరొందింది. కెమెరాతో కూడిన ఆపిల్ వాచ్ సమాచారాన్ని సేకరించేందుకు ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ప్రస్తుతం ఐఫోన్‌లలో మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ప్రత్యేకించి ఆపిల్ విజువల్ ఇంటెలిజెన్స్‌ను మరింతగా విస్తరిస్తుంది. ఆపిల్ కెమెరాతో కూడిన ఎయిర్‌పాడ్స్ ప్రోను కూడా అభివృద్ధి చేస్తోంది.

ఆపిల్ వాచ్‌లో కొత్త కెమెరా ఫీచర్ :
బ్లూమ్‌బెర్గ్‌ మార్క్ గుర్మాన్ ప్రకారం.. ఆపిల్ స్మార్ట్‌వాచ్ సిరీస్ కొత్త ప్లాన్లతో పాటు ముఖ్యంగా వాచ్ అల్ట్రా, స్టాండర్డ్ సిరీస్‌లను రివీల్ చేశారు. ఆపిల్ ఐఫోన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అత్యంత ముఖ్యమైనదిగా మారనుంది.

ఇప్పుడు ఆపిల్ స్మార్ట్‌వాచ్‌లో కూడా “విజువల్ ఇంటెలిజెన్స్”ని చేర్చనుంది. దాంతో ఆపిల్ వాచ్ యూజర్లు వస్తువులు, లొకేషన్లను గుర్తించవచ్చు. అంతేకాదు.. వాటి సమాచారాన్ని కూడా విజువల్‌గా పొందవచ్చు. ఈ వాచ్ కెమెరా ఫీచర్ పూర్తిగా ఆపిల్ ఇంటెలిజెన్స్ (AI టెక్నాలజీ) ఆధారంగా పనిచేస్తుంది.

కెమెరా ఎక్కడ? అదేలా పనిచేస్తుంది? :
ఆపిల్ ప్రకారం.. స్టాండర్డ్ ఆపిల్ వాచ్‌లో ఐఫోన్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా మాదిరిగానే స్క్రీన్ లోపల కెమెరా ఉంటుంది. వాచ్ అల్ట్రా మోడల్‌లో క్రౌన్, సైడ్ బటన్ మధ్య ఉంచవచ్చు. స్మార్ట్ వాచ్ అల్ట్రా బాడీ స్టాండర్డ్ మోడల్ కన్నా మందంగా ఉంటుంది. ఆపిల్‌కు కొత్త ఫీచర్లను చేర్చేందుకు కావాల్సినంత స్పేస్ కూడా లభిస్తుందని గుర్మాన్ చెప్పారు.

నివేదిక ప్రకారం.. ఆపిల్ వాచ్ అల్ట్రా యూజర్లు తమ వాచ్ కెమెరాతో ఏదైనా వస్తువును స్కాన్ చేయొయ్చు. మరోవైపు, స్టాండర్డ్ ఆపిల్ వాచ్ యూజర్లు స్కానింగ్ కోసం తమ మణికట్టును వెనక్కి తిప్పాల్సి రావచ్చు.

Read Also : AC Safety Tips : బిగ్ అలర్ట్.. వేసవిలో ఏసీలు పేలుతున్నాయి జాగ్రత్త.. మీ AC ఏదైనా ఈ మిస్టేక్స్ పొరపాటున కూడా చేయొద్దు..!

అయితే, ఈ ఆపిల్ వాచ్ ఫీచర్లు 2027 వరకు రాకపోవచ్చు. ఆపిల్ ఇన్-హౌస్ ఏఐ మోడల్స్ ద్వారా పనిచేస్తాయి. ఆపిల్ కూడా సిరి కొత్త వెర్షన్‌పై వర్క్ చేస్తోంది. 2026 చివరి నాటికి iOS20 వరకు రెడీగా ఉండకపోవచ్చు.