×
Ad

Motorola Edge 60 Pro : గేమింగ్ లవర్స్ కోసం కిర్రాక్ ఆఫర్.. ఈ మోటోరోలా ఎడ్జ్ 60ప్రో ఫోన్ అతి చౌకైన ధరకే.. ఎలా కొనాలంటే?

Motorola Edge 60 Pro : వాలెంటైన్స్ డే సేల్ సందర్భంగా రూ. 7వేల తగ్గింపుతో మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

Motorola Edge 60 Pro

  • వాలెంటైన్స్ డే సేల్‌లో రూ. 7వేలు తగ్గింపు
  • రూ. 1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు
  • 90W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌, భారీ 6000mAh బ్యాటరీ

Motorola Edge 60 Pro : కొత్త మోటోరోలా ఫోన్ కోసం చూస్తున్నారా? మీరు గేమింగ్ ప్రియులా? మీకోసం మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో ఫోన్‌ భారీ తగ్గింపుతో లభిస్తోంది. అద్భుతమైన పర్ఫార్మెన్స్, భారీ బ్యాటరీ ప్యాక్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో ఈ ఫోన్ అద్భుతంగా ఉంటుంది.

మీరు కూడా ఇలాంటి 5జీ గేమింగ్ ఫోన్ కోసం చూస్తుంటే ఈ డీల్ అసలు వదులుకోవద్దు. ఈ ఫోన్ 90W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో భారీ 6000mAh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో 5జీ ఫోన్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

50MP మెయిన్ సోనీ సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్‌ అందిస్తుంది. పవర్‌ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఎక్స్‌ట్రీమ్ చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. మీరు ఫ్లిప్‌కార్ట్‌లో వాలెంటైన్స్ సేల్‌లో రూ. 7వేల తగ్గింపుతో ఫోన్‌ కొనుగోలు చేయవచ్చు.

వాలెంటైన్స్ డే సేల్‌లో రూ. 7వేలు తగ్గింపు :
భారత మార్కెట్లో మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో 5G ఫోన్ రూ. 36,999 ధరకు లాంచ్ అయింది. కానీ, ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ సేల్ సమయంలో మీరు 19శాతం తగ్గింపుతో ఫోన్‌ కొనుగోలు చేయవచ్చు. ధర దాదాపు రూ. 29,999కి తగ్గుతుంది.

అదనంగా, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ లేదా ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఉంటే.. వరుసగా రూ. 2,447, రూ. 1,497 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. మీకు ఐసీఐసీఐ బ్యాంక్ లేదా యాక్సిస్ బ్యాంక్ స్టాండర్డ్ క్రెడిట్ కార్డ్ ఉంటే.. మీరు రూ. 1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.

Read Also : Valentine Day Sale : ఆఫర్ అదిరింది మావా.. 50MP సెల్ఫీ కెమెరా, ఈ ఒప్పో ఫోన్ ఇలా కొన్నారంటే రూ. 10వేలు డిస్కౌంట్.. ఎలాగంటే?

గేమింగ్ ప్రియులకు బెస్ట్ ఫోన్ :
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో 5G ఫోన్ అద్భుతంగా ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఎక్స్‌ట్రీమ్ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌లో పెర్ప్లెక్సిటీ ఏఐని ఇంటిగ్రేట్ అయింది. 3 నెలల ఫ్రీ ట్రయల్‌ కూడా అందిస్తుంది.

రియల్ టైమ్ అసిస్టెన్స్ కోసం మోటో ఏఐ ద్వారా మైక్రోసాఫ్ట్ కోపైలట్‌ అందిస్తుంది. ఈ ఫోన్ 256GB లేదా 512GB యూఎఫ్ఎస్ 4.0 ఇంటర్నల్ స్టోరేజ్‌తో 8GB, 12GB లేదా 16GB LPDDR5X ర్యామ్ ఆప్షన్ కూడా అందిస్తుంది.

కెమెరా సెటప్, బ్యాటరీ ప్యాక్ :

మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో 5జీ ఫోన్ బ్యాక్ సైడ్ జీఈఐఎస్ఎస్ ఆప్టిక్స్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్‌ అందిస్తుంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50MP మెయిన్ సోనీ LYTIA 700C సెన్సార్, మాక్రో విజన్‌తో 50MP అల్ట్రా-వైడ్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్, OISతో 10MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి.

అయితే, ఫ్రంట్ సైడ్ 50MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ భారీ 6000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని అందిస్తుంది. 90W టర్బోపవర్ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

డిస్‌ప్లే, డిజైన్ ఆప్షన్లు :
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో 5జీ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. భారీ 6.7-అంగుళాల సూపర్ HD+ క్వాడ్-కర్వ్డ్ pOLED స్క్రీన్‌ అందిస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68, IP69 రేటింగ్‌ పొందుతుంది. MIL-STD-810 మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్‌ అందిస్తుంది.