Ather Electric Scooter: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరపై రూ.24వేల తగ్గింపు

లేటెస్ టూ వీలర్స్ ట్రెండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. యూత్ ఏ కాదు.. యూత్‌లా ఆలోచించే వాళ్లు కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ముందుగానే బుకింగ్ చేసుకుని ఎదురుచూస్తున్నారు.

Ather

Ather Electric Scooter: లేటెస్ టూ వీలర్స్ ట్రెండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. యూత్ ఏ కాదు.. యూత్‌లా ఆలోచించే వాళ్లు కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ముందుగానే బుకింగ్ చేసుకుని ఎదురుచూస్తున్నారు. కొత్తగా వస్తున్న మోడల్స్ లో కాస్త ఎక్కువ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ పొందిన వాటిలో అథర్ 450 ప్లస్ స్కూటర్ ఒకటి. టెక్నికల్ గా పాజిటివ్ రెస్పాన్స్ పొందడమే కాకుండా.. ధరలోనూ దాదాపు రూ.24వేల వరకూ తగ్గింపు దొరికింది.

అయితే ఈ భారీ డిస్కౌంట్ మన దగ్గర కాదు మహారాష్ట్రలో. అథర్ 450 ప్లస్ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1.03 లక్షలుగా ఉంది. దేశంలో అన్నీ రాష్ట్రలతో పోలిస్తే అథర్ 450+ ధర అక్కడే అతి తక్కువ. ధరలు తగ్గించక ముందు వరకూ అథర్ 450 ప్లస్ ఫేమ్ 2 ఇన్సెంటివ్ ధర సుమారు రూ.1.28 లక్షల(ఎక్స్ షోరూమ్ ధర) వరకూ పలికేది.

6కే డబ్ల్యూ పీఎమ్ఎస్ఎమ్ మోటార్, 2.9కేడబ్ల్యూ లిథియం-అయాన్ బ్యాటరీతో పనిచేయడంతో పాటు ఎకో, రైడ్, స్పోర్ట్, వార్ప్ అనే నాలుగు రకాల మోడ్‌లతో దొరుకుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లు. 3.3 సెకన్లలో 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. అథర్ 450ఎక్స్ ఐడీసీ మోడ్‌లో 116 కిలోమీటర్ల దూరం అందుకోనున్నట్లు పేర్కొన్నారు.

బ్యాటరీ వాటర్ రెసిస్టెంట్, ఐపీ 67 రేటెడ్ ప్రజర్ డై కాస్ట్ అల్యూమినియం బ్యాటరీ ప్యాక్, ఫ్రంట్ అండ్ రేర్ కోసం రెండు డిస్క్ బ్రేక్‌లు, 22ఎల్ స్టోరేజీ, 7 అంగుళాల ఎల్సీడీ డిస్‌ప్లేతో వస్తుంది.