Battlegrounds Mobile India : బాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా వస్తోంది..!

బాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా ఇండియాకు వస్తోంది. పాపులర్ బాటిల్ రాయల్ గేమ్ పబ్‌జీ మొబైల్ వచ్చేవారమే లాంచ్ కానుంది. మే 18న ఈ గేమ్ కు సంబంధించి ప్రీ-రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. జూన్ 18న ఈ గేమ్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Battlegrounds Mobile India : బాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా వస్తోంది..!

Battlegrounds Mobile India

Updated On : June 14, 2021 / 2:49 PM IST

Battlegrounds Mobile India : బాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా భారత్‌కు వస్తోంది. పాపులర్ బాటిల్ రాయల్ గేమ్ పబ్‌జీ మొబైల్ వచ్చేవారమే లాంచ్ కానుంది. మే 18న ఈ గేమ్ కు సంబంధించి ప్రీ-రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. జూన్ 18న ఈ గేమ్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. క్రాఫ్టాన్ కంపెనీ ఈ బాటిల్ గ్రౌండ్స మొబైల్ ఇండియా గేమ్ ను డెవలప్ చేసింది. లాంచ్ డేట్ కు సంబంధించి కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. బాటిల్ గ్రౌండ్స్ గేమ్ డెవలప్ చేసిన కంపెనీ డెవలపర్లు లాంచింగ్ కు ముందే కొన్ని విషయాలను వెల్లడించారు. ఈ గేమ్ ఇండియన్ ప్లేయర్ల కోసం ఎక్స్ క్లూజివ్ గా ఉంటుందని అంటున్నారు.

బాటిల్ రాయలీ గేమ్ కూడా ఇండియా స్పెషిఫిక్ ఇన్-గేమ్ ఈవెంట్లను రిలీజ్ చేసింది. ఔట్ ఫిట్స్, ఫీచర్లు, ఎస్పోర్ట్స్ ఈకోసిస్టమ్, రెగ్యులర్ స్ట్రీమింగ్ టోర్నమెంట్లు, లీగులను కూడా ఆడుకోవచ్చు. ఈ గేమ్ కోసం రిజిస్టర్ చేసుకున్న ప్లేయర్లు.. 4 ప్రి-రిజిస్ట్రేషన్ రివార్డులను పొందవచ్చు. రెకాన్ మాస్క్, రెకాన్ ఔట్ ఫిట్, సెలబ్రేషన్ ఎక్స్‌పర్ట్ టైటిల్, 300AG ఆఫర్ చేస్తోంది. ఈ గేమ్ ఉచితంగా ప్లేయర్లు ఆడుకోవచ్చు. అలాగే మల్టిపుల్ గేమ్ మోడ్స్ ఆప్షన్లు పొందవచ్చు.

గేమ్ మ్యాప్స్ విషయంలో గేమ్ డెవలపర్లు ఎలాంటి ప్రత్యేకమైన పేర్లను రివీల్ చేయలేదు. గేమ్ బ్యాగ్ గ్రౌండ్‌లో కనిపించే పాపులర్ మ్యాప్స్ ఇరెంజల్, శాన్హక్, మిరామార్ మ్యాప్ లతో పాటు సరికొత్త మ్యాప్స్ ఉంటాయని భావిస్తున్నారు. చైనా ప్రభుత్వానికి సంబంధించి లింకులు ఉండటంతో గత ఏడాదిలో ఈ గేమ్ బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. మళ్లీ ఈ గేమ్ ఇండియాలో రీలాంచింగ్ ప్రయత్నాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.