రూ.10 వేలకే 50MP కెమెరా ఫోన్ కావాలా? 8 బెస్ట్ 5G మొబైల్స్ ఇవే… ఫీచర్లు కెవ్వుకేక…

బడ్జెట్‌లో బెస్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే, వీటిలో మీ అవసరానికి తగిన దాన్ని కొనవచ్చు.

మీ బడ్జెట్ రూ.10,000 లోపేనా? అద్భుతమైన 50MP కెమెరా, వేగవంతమైన 5G కనెక్టివిటీ, రోజంతా నిలిచే బ్యాటరీతో ఉండే ఒక మంచి స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, ప్రస్తుతం మార్కెట్‌లో తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో అలరిస్తున్న బెస్ట్ ఫోన్ల గురించి తెలుసుకోండి…

రూ.10,000 బడ్జెట్‌లో టాప్ కెమెరా ఫోన్లు

1. Acer Super ZX

కెమెరా: 64MP మెయిన్ కెమెరా, 2MP డెప్త్, 2MP సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్. 13MP సెల్ఫీ కెమెరా.

డిస్ప్లే: 6.8 అంగుళాల Full HD+ స్క్రీన్, 120Hz స్మూత్ రిఫ్రెష్ రేట్.

ప్రాసెసర్: MediaTek Dimensity 6300.

బ్యాటరీ: 5000mAh, 33W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్.

దీని ప్రత్యేకత: కెమెరా క్వాలిటీ, డిస్ప్లే క్లారిటీ కోరుకునే వారికి ఇది సరైనది.

2. Poco M7 5G

కెమెరా: 50MP ప్రైమరీ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా.

డిస్ప్లే: 6.88 అంగుళాల డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్.

ప్రాసెసర్: Snapdragon 4 Gen 2.

బ్యాటరీ: 5160mAh, 18W ఛార్జింగ్.

దీని ప్రత్యేకత: 1TB దాకా స్టోరేజ్ పెంచుకునే సౌకర్యం, మంచి ప్రాసెసర్.

Also Read: ఎయిర్‌పోర్టుకు లేటుగా వచ్చిన డిప్యూటీ సీఎం.. విమానాన్ని నడపనని చెప్పిన పైలట్.. ఆ తర్వాత మరో ట్విస్ట్‌

3. Samsung Galaxy M06 5G

కెమెరా: 50MP డ్యూయల్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా.

డిస్ప్లే: 6.74 అంగుళాల HD+ డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్.

ప్రాసెసర్: Dimensity 6300.

బ్యాటరీ: 5000mAh, 25W ఫాస్ట్ ఛార్జింగ్.

దీని ప్రత్యేకత: 1.5TB వరకు స్టోరేజ్ పెంచుకునే వీలు, శాంసంగ్ బ్రాండ్.

4. Samsung Galaxy A06 5G

కెమెరా: 50MP డ్యూయల్ రియర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా.

డిస్ప్లే: 6.7 అంగుళాల HD+ స్క్రీన్, 90Hz రిఫ్రెష్ రేట్.

ప్రాసెసర్: Dimensity 6300 చిప్‌సెట్.

బ్యాటరీ: 5800mAh భారీ బ్యాటరీ, 25W ఛార్జింగ్.

దీని ప్రత్యేకత: ఎక్కువసేపు ఛార్జింగ్ నిలిచే భారీ బ్యాటరీ.

5. Samsung Galaxy F06 5G

కెమెరా: 10x డిజిటల్ జూమ్‌తో కూడిన 50MP కెమెరా.

డిస్ప్లే: 6.7 అంగుళాల HD+ డిస్ప్లే, 90Hz రిఫ్రెష్.

ప్రాసెసర్: Dimensity 6300.

బ్యాటరీ: 5000mAh, 25W ఛార్జింగ్.

దీని ప్రత్యేకత: వాటర్‌డ్రాప్ నాచ్‌తో ఆకర్షణీయమైన బీజెల్‌లెస్ డిజైన్.

6. Itel Color Pro 5G

కెమెరా: 50MP AI కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా.

డిస్ప్లే: 6.6 అంగుళాల HD+ డిస్ప్లే.

ప్రాసెసర్: Dimensity 6080 చిప్‌సెట్.

బ్యాటరీ: 6GB RAM, 5000mAh బ్యాటరీ.

దీని ప్రత్యేకత: పగలు, రాత్రి వేళల్లో స్పష్టమైన ఫొటోలు తీయడానికి బాగా ఉపయోగపడుతుంది.

7. Redmi 14C 5G

కెమెరా: 50MP డ్యూయల్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా.

డిస్ప్లే: 6.88 అంగుళాల IPS LCD డిస్ప్లే.

ప్రాసెసర్: Snapdragon 4 Gen 2.

బ్యాటరీ: 5160mAh బ్యాటరీ.

దీని ప్రత్యేకత: స్టార్‌డస్ట్ పర్పుల్, స్టార్‌లైట్ బ్లూ రంగులలో అద్భుతమైన డిజైన్.

8. Redmi A4 5G

కెమెరా: 50MP కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా.

డిస్ప్లే: 6.88 అంగుళాల HD+ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ సాంప్లింగ్.

ప్రాసెసర్: Snapdragon 4s Gen 2.

బ్యాటరీ: 5160mAh, 18W ఛార్జింగ్.

దీని ప్రత్యేకత: గేమింగ్, స్క్రోలింగ్ సమయంలో చాలా స్మూత్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది.

ఈ ఫోన్లన్నీ రూ.10,000 బడ్జెట్‌లో బెస్ట్‌ ఫీచర్లతో ఉన్నాయి. మంచి కెమెరా, పెద్ద డిస్ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లతో రోజువారీ పనులకు ఇవి చక్కగా సరిపోతాయి. బడ్జెట్‌లో బెస్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే, వీటిలో మీ అవసరానికి తగిన దాన్ని పరిశీలించవచ్చు.