స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6పై అమెజాన్‌లో భారీ ఆఫర్…

ఆటో జూమ్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి.

స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6పై అమెజాన్‌లో భారీ ఆఫర్…

Updated On : May 31, 2025 / 1:22 PM IST

మీరు కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే, ఇదే సరైన సమయం. శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6 స్మార్ట్‌ఫోన్‌ అమెజాన్‌లో ప్రస్తుతం భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్‌పై ఏకంగా రూ.33,500 డిస్కౌంట్ అందుకోవచ్చు.

ఇలాంటి ఆఫర్లు ఎక్కువ కాలం ఉండకపోవచ్చు. కొనాలనే ఆసక్తి మీకు ఉంటే, ఆలస్యం చేయకుండా వెంటనే ఆర్డర్ చేయడం మంచిది. ఈ ఆఫర్‌ను ఎలా పొందాలో వివరంగా చూద్దాం.

గెలాక్సీ Z ఫ్లిప్ 6: అమెజాన్ ఆఫర్ వివరాలు

శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6 ఫోన్ భారత్‌లో విడుదల సమయంలో దాని ధర రూ.1,09,999. ప్రస్తుతం అమెజాన్‌లో ఇది రూ.78,488 కే దొరుకుతోంది. అంటే, ఈ ఫోన్‌పై రూ.31,511 నేరుగా తగ్గింపు ఉంది. అదనంగా, ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI చెల్లింపులతో రూ.2,000 తగ్గింపు లభిస్తుంది. ఇంకా ఆదా చేయాలనుకుంటే, మీ పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంది.

గెలాక్సీ Z ఫ్లిప్ 6: ముఖ్యమైన స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

డిస్‌ప్లే: 6.7-అంగుళాల డైనమిక్ AMOLED 2X మెయిన్ స్క్రీన్ (FHD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్), 3.4-అంగుళాల కవర్ స్క్రీన్ (Super AMOLED, 60Hz).

ప్రాసెసర్: క్వాల్‌కమ్ Snapdragon 8 Gen 3 చిప్‌సెట్.

బ్యాటరీ: 4,000mAh సామర్థ్యం, 25W ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్.

కెమెరాలు: 50MP ప్రధాన కెమెరా + 12MP అల్ట్రా వైడ్ లెన్స్; 10MP సెల్ఫీ కెమెరా.

AI ఫీచర్లు: ఆటో జూమ్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఇది సబ్జెక్ట్‌ను గుర్తించి ఫ్రేమ్‌ను దానంతట అదే సర్దుబాటు చేస్తుంది.