Best Smartphones
Best Smartphones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ప్రస్తుతం 5G ఫోన్లకు ఫుల్ క్రేజ్ ఉంది. కొత్త 5G ఫోన్ కొనేందుకు చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్..
రూ. 10 వేల లోపు ధరలో అద్భుతమైన ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్లను ఎంచుకోవచ్చు. ఇందులో మీకు నచ్చిన 5G ఫోన్లలో ఏదైనా ఒకటి కొనేసుకోవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ M06 5G :
అమెజాన్ నుంచి ఈ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ రూ. 8,499కి కొనేసుకోవచ్చు. మీడియాటెక్ డైమన్షిటీ 6300 ప్రాసెసర్ కలిగి ఉంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. 5000mAh బ్యాటరీ కూడా ఉంది. ఆండ్రాయిడ్ 15OS, 50MP ప్రైమరీ కెమెరాతో వస్తుంది.
పోకో M6 ఫోన్ :
అమెజాన్‌లో ఈ పోకో ఫోన్ రూ.9,399కి కొనుగోలు చేయవచ్చు. మీడియాటెక్ డైమన్షిటీ 6100+ 5G ప్రాసెసర్ ఉంది. పవర్ విషయానికి వస్తే.. 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ప్రైమరీ కెమెరా 50MP, 6.74 అంగుళాల HD+ 90Hz డిస్‌ప్లేతో వస్తుంది.
రెడ్‌మి A4 5G :
ఈ రెడ్‌మి A4 5G ఫోన్ (Best Smartphones) రూ. 10వేల లోపు ధరలో అందుబాటులో ఉంది. ప్రస్తుతం రూ. 7,999 ప్రారంభ ధరకు ఈ రెడ్‌మి ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
స్నాప్‌డ్రాగన్ 4s జనరేషన్ 2 ప్రాసెసర్‌తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కలిగి ఉంది. మెయిన్ కెమెరా 50MP ఉండగా, రెడ్‌మి A4 5G ఫోన్ 5160mAh బ్యాటరీతో వస్తుంది.
ఐటెల్ A95 5G :
ఐటెల్ ఫోన్ రిటైల్ స్టోర్ల నుంచి రూ. 9,599 ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 50MP కెమెరాతో వస్తుంది. పవర్ కోసం 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.
6.67-అంగుళాల HD+IPS ఎల్‌సీడీ డిస్‌ప్లే కలిగి ఉంది. రిఫ్రెష్ రేట్ 120Hz కలిగి ఉంది. మీడియాటెక్ డైమన్షిటీ 6300 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది.