Best Smartphones : రూ. 25వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనొచ్చు..!
Best smartphones : భారత మార్కెట్లో మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లకు ఫుల్ డిమాండ్ ఉంది. స్మార్ట్ ఫోన్ యూజర్లు ఎక్కువగా ఈ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు.

Best Smartphones Under Rs 25,000 In India Iqoo Z6 Pro, Oneplus Nord Ce 2 5g And More
Best smartphones : భారత మార్కెట్లో మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లకు ఫుల్ డిమాండ్ ఉంది. స్మార్ట్ ఫోన్ యూజర్లు ఎక్కువగా ఈ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే మొబైల్ మేకర్లు కూడా వినియోగదారులను ఆకట్టుకునేలా స్మార్ట్ ఫోన్ల డిజైన్, ఫీచర్లను అందిస్తున్నాయి. కొన్ని స్మార్ట్ ఫోన్లు.. ద్రవ్యోల్బణం, ఇతర కారణాలతో ధరలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. భారత్‌లో రూ. 25000లోపు అత్యుత్తమ స్మార్ట్ఫోన్ల జాబితాలో అనేక బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. రూ. 25,000లోపు కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకోసం ప్రత్యేకించి మీ బడ్జెట్లోనే కొన్ని బెస్ట్ స్మార్ట్ ఫోన్ల జాబితాను అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంపిక చేసుకుని కొనుగోలు చేసుకోవచ్చు.
iQOO Z6 Pro 5G :
iQOO Z6 Pro 5G స్మార్ట్ ఫోన్.. Qualcomm Snapdragon 778G SoCతో వచ్చింది. రూ. 25,000 లోపు స్మార్ట్ ఫోన్లలో ఇదొకటి.. ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్టుతో 6.44-అంగుళాల Full HD+ AMOLED డిస్ప్లేతో వచ్చింది. బ్యాక్ సైడ్ 64MP ట్రిపుల్ కెమెరా సెటప్, 16MP ఫ్రంట్ కెమెరా సెన్సార్ ఉంది. ఫోన్ ఆండ్రాయిడ్ 12-ఆధారిత ఫన్‌టచ్ OS 12 ఆపరేట్ చేస్తోంది. iQOO Z6 Pro 5Gలో 4700 mAh బ్యాటరీని అందిస్తోంది. 66W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. భారత మార్కెట్లో iQOO Z6 Pro 5G (6GB RAM) ఆప్షన్ ధర రూ. 23,999 నుంచి ప్రారంభమవుతుంది.

Best Smartphones Under Rs 25,000 In India
OnePlus Nord CE 2 5G :
OnePlus Nord CE 2 5G, MediaTek డైమెన్సిటీ 900 SoCతో పనిచేస్తుంది. చిప్సెట్ గరిష్టంగా 8GB RAMతో వచ్చింది. 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్టుతో 6.43-అంగుళాల FULL HD+ AMOLED డిస్ప్లే ఉంది. ఫోన్ బ్యాక్ 64MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 16MP ఫ్రంట్ కెమెరా సెన్సార్ ఉంది. హుడ్ కింద.. 65W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 4500 mAh బ్యాటరీ అమర్చారు. ఈ ఫోన్ ఆక్సిజన్ OS 11తో ఆండ్రాయిడ్ 11 అవుట్ ది బాక్స్‌తో రన్ అవుతుంది. భారత మార్కెట్లో OnePlus Nord CE 2 5G ప్రారంభ ధర రూ. 23,999గా ఉంది.

Best Smartphones Under Rs 25,000 In India
Realme 9 Pro+ 5G :
Realme 9 Pro+ 5G ప్రారంభ ధర రూ. 24,999గా ఉంది. OISకి సపోర్టు చేసే ప్రైమరీ కెమెరాతో 50MP ట్రిపుల్-కెమెరా సెటప్‌ను వినియోగదారులు పొందవచ్చు. 16MP ఫ్రంట్ కెమెరాతో హోల్-పంచ్ కటౌట్‌తో 6.43-అంగుళాల 90Hz AMOLED డిస్ప్లేతో వచ్చింది. ఈ ఫోన్ 60W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4500 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ డివైజ్ MediaTek డైమెన్సిటీ 920 SoC నుంచి పవర్ అందిస్తోంది. ఆండ్రాయిడ్ 12-ఆధారిత Realme UI రన్ అవుతుంది.

Best Smartphones Under Rs 25,000 In India
Moto Edge 20
ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లో ఇది కూడా బెస్ట్ ఆప్షన్.. Moto Edge 20 స్మార్ట్ ఫోన్ ఎంచుకోవచ్చు. 8GB + 128GB వేరియంట్ ధర రూ. 24,999కు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 6.7-అంగుళాల Full HD+ AMOLED డిస్ప్లేతో 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌ను కలిగి ఉంది. 108MP ప్రధాన కెమెరా, 16MP అల్ట్రావైడ్ కెమెరా, 8MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ 30W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4000 mAh బ్యాటరీని అందిస్తుంది. Qualcomm Snapdragon 778G SoC నుంచి పవర్ అందిస్తుంది.

Best Smartphones Under Rs 25,000 In India
Xiaomi 11i :
Xiaomi 11i డైమెన్సిటీ 920 SoC, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో 6.67-అంగుళాల AMOLED డిస్ప్లే, వెనుకవైపు 108MP ట్రిపుల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5160 mAh బ్యాటరీని కూడా అందిస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11-ఆధారిత MIUI 12.5 అవుట్ ది బాక్స్‌తో రన్ అవుతుంది. Xiaomi 11i బేస్ వేరియంట్ ధర రూ. 24,999గా ఉంది. 8GB RAM ఆప్షన్.. రూ. 26,999లకు కొనుగోలు చేయొచ్చు.

Best Smartphones Under Rs 25,000 In India
Redmi Note 11 Pro+ 5G :
Redmi Note 11 Pro+ 5G స్మార్ట్ ఫోన్.. Redmi Note సిరీస్‌లో రూ. 20,000 ధరతో వచ్చిన ఫస్ట్ స్మార్ట్‌ఫోన్ కూడా ఇదే. 6.67-అంగుళాల 120Hz ఫుల్ HD+ AMOLED డిస్ప్లే, 108MP ట్రిపుల్-కెమెరా సెటప్, 67W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000 mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 695 SoCతో రన్ అవుతుంది. Redmi Note 11 Pro+ 5G బేస్ మోడల్ ధర రూ. 20,999గా ఉంటే.. 6GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజీతో వచ్చింది. 8GB + 128GB స్టోరేజీ ఆప్షన్ కూడా ఉంది. దీని ధర రూ. 22,999గా ఉంటే.. 8GB + 256GB స్టోరేజీ ఆప్షన్ ధర రూ. 24,999లకే అందుబాటులో ఉంది.

Best Smartphones Under Rs 25,000 In India
Read Also : Redmi Note 11 SE : భారీ బ్యాటరీతో రెడ్మి నోట్ 11 SE స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు, ధర ఎంతంటే?