Motorola Razr 60
Motorola Razr 60: మోటోరోలా రేజర్ 60 స్మార్ట్‌ఫోన్ మే 28న భారత మార్కెట్లో లాంచ్ అయిన విషయం తెలిసిందే. ఫోల్డబుల్ ఫోన్ కొనాలనుకుంటున్న వారికి ఇది మంచి ఆప్షన్‌గా మారింది.
మోటోరోలా రేజర్ 60 ఇప్పుడు ఆండ్రాయిడ్ ధరలోనే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ ఫెస్టివల్ ధమాకా సేల్ 2025 కొనసాగుతోంది. ఇందులో మోటోరోలా రేజర్ 60పై ప్రత్యేక ఆఫర్ ఇస్తున్నారు. (Motorola Razr 60)
ఈ ఫోన్ 8GB RAM, 256GB స్టోరేజ్ వెర్షన్‌లో లభిస్తుంది. అసలు ధర రూ.54,999. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 27% డిస్కౌంట్‌తో ఇది రూ.39,999కి వస్తుంది.
బ్యాంక్ ఆఫర్లలో ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ లేదా ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ బ్యాంక్ కార్డ్ ఉంటే రూ.1,999 తగ్గింపు లభిస్తుంది. పాత ఫోన్ ఇచ్చి గరిష్ఠంగా రూ.38,540 ఎక్స్చేంజ్ ఆఫర్ పొందవచ్చు. ఇది పాలసీ, పాతఫోన్ మోడల్‌పై ఆధారపడి మారుతుంది. నెలకు రూ.3,331 ఈఎంఐ ఆప్షన్‌తో కొనవచ్చు.
ఈ ఫోన్‌లో 6.9-అంగుళాల pOLED మెయిన్ డిస్‌ప్లే, 3.6-అంగుళాల కవర్ డిస్‌ప్లే ఉన్నాయి. pOLED అంటే ప్లాస్టిక్ ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్, తక్కువ మందంతో, ఫోల్డ్ చేసుకునే స్క్రీన్ టెక్నాలజీ. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ గార్డ్ ఉంది. ఈ ఫోన్ డైమెన్సిటీ 7400x చిప్‌సెట్‌తో వచ్చింది.
మోటో రేజర్ 60 కెమెరా, బ్యాటరీ
రెండు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి. ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్స్, రెండోది 13 మెగాపిక్సెల్స్. ముందు భాగంలో 32 మెగాపిక్సెల్స్ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది, 30డబ్ల్యూ టర్బోపవర్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. కనెక్టివిటీ కోసం వైఫై, బ్లూటూత్ ఉన్నాయి.