Vivo V50e Price
Big Festive Dhamaka Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ ఫెస్టివ్ ధమాకా సేల్‌లో మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? 50MP సెల్ఫీ కెమెరాతో మార్కెట్లో ఉన్న Vivo V50e 5Gకి సంబంధించి ఇందులో మంచి ఆఫర్ అందుబాటులో ఉంది.
బ్యాంక్, ఎక్స్చేంజ్ డీల్స్‌తో పాటు ఈ ఫోన్‌కు ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్ 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 8జీబీ ర్యామ్ మోడల్‌ను రూ.25,990 ధరకు అందిస్తోంది. (Big Festive Dhamaka Sale)
ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డులు వాడితే అదనంగా 5% డిస్కౌంట్ పొందవచ్చు. పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేస్తే రూ.19,860 వరకు ఆదా చేసుకోవచ్చు. నెలకు రూ.914 నుంచి ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఈ ఆఫర్ కొంతకాలం మాత్రమే ఉంటుంది.
Also Read: కారు కొనాలని ప్లాన్ చేసుకుంటున్నారా? ఈ కారు గురించి తెలుసుకోవాల్సిందే.. ఫీచర్లు చూస్తే వదలరు..
వివో వీ50ఈ 5G ఫీచర్లు
వీవో వీ50ఈ 6.77 అంగుళాల కర్వ్‌డ్ అమోల్డ్ స్క్రీన్, 120 హర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ లోకల్ పీక్ బ్రైట్‌నెస్‌తో అందుబాటులో ఉంది. 128 గిగాబైట్/256 గిగాబైట్ యూఎఫ్‌ఎస్ 2.2 స్టోరేజ్, 8 గిగాబైట్ LPDDR4x ర్యామ్‌తో, ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌తో నడుస్తుంది.
వీవో వీ50ఈ కెమెరా సెటప్‌లో 8 మెగాపిక్సెల్ లెన్స్, 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 ప్రధాన సెన్సర్ ఉన్నాయి. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. 5600 మిల్లీఆంపియర్ బ్యాటరీ 90 వాట్స్ వేగవంతమైన ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
ఫోన్ స్టీరియో స్పీకర్స్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫంటచ్ ఓఎస్ 15తో నడుస్తుంది. నీరు, ధూళి నిరోధకత కోసం IP68, IP69 రేటింగ్స్ ఉన్నాయి. డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై 5, బ్లూటూత్ 5.4, GPS, యూఎస్‌బీ టైప్-సీ కనెక్టివిటీ ఉన్నాయి.