కారు కొనాలని ప్లాన్ చేసుకుంటున్నారా? ఈ కారు గురించి తెలుసుకోవాల్సిందే.. ఫీచర్లు చూస్తే వదలరు..
పై స్థాయి వేరియంట్‌లలో జేబీఎల్ స్పీకర్లు, సన్‌రూఫ్, విలాసవంతమైన ఫీచర్లు అదనంగా వస్తాయి.

Tata Nexon SUV
Tata Nexon: కారు కొనాలని ప్లాన్ చేసుకుంటున్నారా? టాటా నెక్సాన్‌కు భారత్ పాపులారిటీ ఉంది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ గురించి తెలుసుకోవాల్సిందే. ఇంజిన్ ఆప్షన్స్, ధర, ఫీచర్లు, మైలేజ్, పవర్ అవుట్‌పుట్ మీ అవసరాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో మీకు తెలుసా?
నెక్సాన్ ఇంజిన్ ఆప్షన్స్
నెక్సాన్ ఐసీఈ (ICE – Internal Combustion Engine) ఆప్షన్లలో 1.5 లీటర్ల డీజిల్ ఇంజిన్, 1.2 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉన్నాయి. టర్బో పెట్రోల్ ఇంజిన్ సీఎన్‌జీ వేరియంట్‌లో కూడా అందుబాటులో ఉంది. 1,199 సీసీ టర్బో పెట్రోల్ ఇంజిన్ 118 బీహెచ్‌పీ -170 ఎన్ఎమ్ శక్తిని ఇస్తుంది.
Also Read: మీరు డబ్బులు దాచుకున్న బ్యాంకు మూతబడితే? మీ డబ్బులన్నీ తిరిగివస్తాయా? ఏం జరుగుతుంది?
దీనికి 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఏఎంటీ, 7-స్పీడ్ డీసీఏ (డ్యుయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్) తో ప్యాడిల్ షిఫ్టర్లు లభిస్తాయి. అదే సీఎన్‌జీ వెర్షన్‌లో 99 బీహెచ్‌పీ-170 ఎన్ఎమ్ శక్తి ఇస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్‌తో మాత్రమే వస్తుంది. 1,497 సీసీ డీజిల్ ఇంజిన్ 113 బీహెచ్‌పీ, 260 ఎన్ఎమ్ శక్తి ఇస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఏఎంటీ ఆప్షన్లు ఉన్నాయి.
పెట్రోల్ లేదా సీఎన్‌జీ వెర్షన్‌లకు వేరియంట్, వాడుక ఆధారంగా మైలేజ్ ఉంటుంది. టర్బో ఇంజిన్ ఉండడంతో నగరంలో ఇంధన ఆదా కంటే పనితీరుపైనే చాలా మంది దృష్టి ఉంటుంది. (Tata Nexon SUV)
ఏ ఫీచర్లు స్టాండర్డ్‌గా వస్తాయి?
ప్రాథమిక నెక్సాన్ వేరియంట్‌లలో ఎల్ఈడీ డీఆర్‌ఎల్స్, టెయిల్‌లాంప్స్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ నావిగేషన్‌తో, వెంటిలేటెడ్ ముందు సీట్లు, ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎమ్, వాయిస్ ఆధారిత పానోరమిక్ సన్‌రూఫ్, ఐఆర్ఏ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ లభిస్తాయి. పై స్థాయి వేరియంట్‌లలో జేబీఎల్ స్పీకర్లు, సన్‌రూఫ్, విలాసవంతమైన ఫీచర్లు అదనంగా వస్తాయి.
ధరలు
భారత మార్కెట్లో నెక్సాన్ ఐసీఈ బేస్ వేరియంట్ ధర రూ.7.32 లక్షల నుంచి ప్రారంభమై రూ.14.05 లక్షల వరకు ఉంటుంది. 50కి పైగా వేరియంట్‌లు (పెట్రోల్, సీఎన్‌జీ, ఈవీ) అందుబాటులో ఉన్నాయి. కాబట్టి కచ్చితమైన వేరియంట్ పేరు, ఫీచర్లు, స్థానిక ఆన్‌రోడ్ ఖర్చును నిర్ధారించుకోవాలి.