SparkCat Virus : బిగ్ సెక్యూరిటీ అలర్ట్.. ‘స్పార్క్‌క్యాట్’తో జర జాగ్రత్త.. మీ ఫోన్లలో పర్సనల్ డేటా దొంగిలిస్తోంది!

SparkCat Virus : స్పార్క్ క్యాట్ అనేది వైరస్ కాదు.. మీ వ్యక్తిగత, ఆర్థిక డేటాను తస్కరిస్తుంది. ఇటీవల ఏదైనా అనుమానాస్పద యాప్‌లను డౌన్‌లోడ్ చేస్తే వెంటనే డిలీట్ చేయండి. మాల్వేర్ కోసం మీ ఫోన్‌ను స్కాన్ చేయండి.

Dangerous SparkCat virus

SparkCat Virus : మీరు స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. మీరు వాడే ఫోన్ ఆండ్రాయిడ్ అయినా లేదా ఐఫోన్ అయినా వెంటనే అలర్ట్ అవ్వండి. ప్రస్తుతం స్పార్క్‌క్యాట్ అనే కొత్త మాల్వేర్ ఆందోళనకు గురిచేస్తోంది.

అత్యంత ప్రమాదకరమైన ఈ మాల్వేర్ వేగంగా ఫోన్లలో వ్యాప్తి చెందుతోంది. ప్రపంచవ్యాప్తంగా వేలాది ఫోన్లలో ఈ మాల్వేర్ సోకుతోంది. సాధారణ వైరస్‌ల మాదిరిగా కాకుండా.. స్పార్క్‌క్యాట్ క్రిప్టోకరెన్సీ వాలెట్ రికవరీ పదబంధాలతో సహా సున్నితమైన డేటాను సులభంగా తస్కరించగలదు.

Read Also : Mohini Mohan Dutta : రతన్ టాటా వీలునామాలో షాకింగ్ పేరు? ఎవరీ మోహిని మోహన్ దత్తా.. ఈ మిస్టరీ మ్యాన్‌కు రూ. 500 కోట్లు రాసిచ్చాడు!

స్పార్క్‌క్యాట్ మాల్వేర్ అంటే ఏంటి? :
కాస్పెర్స్కీ (Kaspersky) లేటెస్ట్ రిపోర్టు ప్రకారం.. స్పార్క్‌క్యాట్ అనేది గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్‌లోని మల్టీ యాప్‌లలో కనిపించే ఒక డేంజరస్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కిట్ (SDK). ఈ మాల్వేర్ వినియోగదారుల డివైజ్‌లలో స్టోర్ చేసిన ఫొటోలను స్కాన్ చేయడం ద్వారా వ్యక్తిగత డేటాను దొంగిలిస్తుంది. మీకు తెలియకుండానే ఇన్‌ఫెక్ట్ అయిన యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే.. మీ ఆర్థిక, వ్యక్తిగత సమాచారం ప్రమాదంలో పడవచ్చు.

స్పార్క్‌క్యాట్ వైరస్ ప్రభావిత యాప్‌లు :
ఇప్పటివరకు, 18 ఆండ్రాయిడ్ యాప్‌లు, 10 ఐఓఎస్ యాప్‌లలో ఈ మాల్వేర్ ఉన్నట్లు నిర్ధారించాయి. వైరస్ ప్రభావిత యాప్‌లలో ఒకటి (ChatAi) ఉంది. మీరు ఈ యాప్ లేదా ఏదైనా ఇతర అనుమానాస్పద యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఉంటే.. మీ డేటాను ప్రొటెక్ట్ చేసేందుకు వెంటనే దాన్ని అన్‌ఇన్‌స్టాల్ చేసి ఫోన్ నుంచి పూర్తిగా డిలీట్ చేయండి.

స్పార్క్ క్యాట్ మీ డేటాను ఎలా దొంగిలిస్తుందంటే? :

మీ ఫోన్‌లోని ఫోటోలను స్కాన్ చేస్తుంది : స్పార్క్‌క్యాట్ మీ ఫోన్‌లో స్టోర్ చేసిన ఫొటోలను స్కాన్ చేస్తుంది. క్రిప్టోకరెన్సీ వ్యాలెట్ రికవరీ కోడ్‌లను కూడా పసిగట్టేయగలదు.

ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ (OCR) వాడకం : ఇది గూగుల్ ఎంఎల్ కిట్ (OCR)ని ఉపయోగించి ఫొటోల నుంచి టెక్స్ట్ కూడా చదవగలదు. సున్నితమైన సమాచారాన్ని దొంగిలిస్తుంది.

మల్టీ లాంగ్వేజీలను గుర్తిస్తుంది : ఈ మాల్వేర్ ఇంగ్లీష్, హిందీ, చైనీస్, జపనీస్, ఫ్రెంచ్, ఇటాలియన్ వంటి కీవర్డ్స్ ఈజీగా గుర్తించగలదు. ఇది చాలా ప్రమాదకరమైనదిగా గమనించాలి.

స్పార్క్‌క్యాట్ నుంచి మీ స్మార్ట్‌ఫోన్‌ను ఎలా రక్షించుకోవాలి? :

గుర్తుతెలియని యాప్‌లను డౌన్‌లోడ్ చేయొద్దు : ఎల్లప్పుడూ మంచి రివ్యూలు కలిగిన నమ్మదగిన సోర్సెన్ నుంచి యాప్‌లను ఇన్‌స్టాల్ చేయండి.

Read Also : Realme Valentine’s Week Sale : మీ గర్ల్ ఫ్రెండ్‌కు గిఫ్ట్ ఇవ్వాలా? ఈ 3 రియల్‌‌మి ఫోన్లపై రూ.10వేల వరకు డిస్కౌంట్.. ఓ లుక్కేయండి!

యాప్ అనుమతులను చెక్ చేయండి: ఏదైనా యాప్ మీ స్టోరేజీ లేదా కెమెరాకు అనవసరమైన యాక్సెస్ అడిగితే వెంటనే ఆపేయండి.

మీ సాఫ్ట్‌వేర్‌ను అప్‌‌డేట్ చేయండి : రెగ్యులర్ అప్‌డేట్‌లతో సెక్యూరిటీపరమైన లోపాలను పరిష్కరించవచ్చు.

యాంటీవైరస్‌ను వాడండి : సెక్యూరిటీ యాప్‌లు మాల్వేర్ థ్రెట్స్ గుర్తించి వెంటనే నిరోధించగలవు.

క్రిప్టో వ్యాలెట్ కోడ్‌లను స్క్రీన్‌షాట్‌లుగా ఎప్పుడూ స్టోర్ చేయవద్దు : దానికి బదులుగా వాటిని సురక్షితంగా ఎక్కడైనా పేపర్‌లో రాసుకోండి.