BSNL Cinemaplus : బీఎస్ఎన్ఎల్ యూజర్ల కోసం కొత్త ఓటీటీ ప్లాన్లు.. కేవలం రూ.49కే సినిమాప్లస్‌ సబ్‌స్ర్కిప్షన్!

BSNL Cinemaplus : బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ మొదట స్టార్టర్ ప్యాక్‌ను అందిస్తుంది. ప్రస్తుతం రూ.99కి బదులుగా రూ.49కి కొనుగోలు చేయొచ్చు. బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ కస్టమర్లు ఈ ఓటీటీ ప్లాన్‌లను కొనుగోలు చేయవచ్చు.

BSNL Cinemaplus : ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL), సినిమాప్లస్ అనే ఓటీటీ (ఓవర్-ది-టాప్) సర్వీసును 50శాతం తగ్గింపుతో అందిస్తోంది. సాధారణంగా, ఈ సర్వీసు నెలకు రూ. 99కి అందుబాటులో ఉంటుంది. కానీ, ఇప్పుడు, మీరు స్టార్టర్ ప్యాక్‌ను కేవలం రూ. 49కే పొందవచ్చు.

Read Also : WhatsApp iPhone Users : వాట్సాప్ ఐఫోన్ యూజర్లు ఇకపై పాస్‌వర్డ్ లేకుండానే లాగిన్ చేయొచ్చు.. ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ స్టార్టర్ ప్యాక్‌తో యూజర్లు లయన్స్‌గేట్, షెమరూమి, హంగామా, ఎపిక్ఆన్‌తో సహా మల్టీ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్ పొందవచ్చు. మీరు ఎంచుకోగల మరిన్ని ప్లాన్‌లు ఇందులో ఉన్నాయి. ఈ కింది పేర్కొన్న అన్ని వివరాలను ఓసారి పరిశీలిద్దాం.

బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ ప్లాన్లు, వివరాలివే :
బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ ఫస్ట్ స్టార్టర్ ప్యాక్‌ను అందిస్తుంది. లయన్స్‌గేట్, షెమరూమి, హంగామా, ఎపిక్ఆన్‌తో వస్తుంది. ప్రస్తుతం రూ.99కి బదులుగా రూ.49కి అందుబాటులో ఉంది. బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ కస్టమర్లు ఈ ఓటీటీ ప్లాన్‌లను కొనుగోలు చేయవచ్చు. ఆ తర్వాత, పూర్తి ప్యాక్ పొందవచ్చు. జీ5, సోనీలైవ్, యప్‌టీవీ, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌తో వస్తుంది. ఈ ప్లాన్ ధర నెలకు రూ.199 చెల్లించాల్సి ఉంటుంది. చివరగా, ప్రీమియం ప్యాక్ ధర నెలకు రూ. 249 చెల్లించాల్సి ఉంటుంది.

ఈ ప్లాన్‌తో మీరు ZEE5, SonyLIV, YuppTV, Lionsgate, ShemarooMe, Hungama, Disney+ Hotstar ఓటీటీ సబ్ స్ర్కిప్షన్లను కూడా పొందవచ్చు. సినిమాప్లస్ సర్వీసు ద్వారా యూజర్లు ఒకే లాగిన్‌తో అనేక ప్లాట్‌ఫారమ్‌ల నుంచి కంటెంట్‌ను యాక్సెస్ చేయొచ్చు.

ఎయిర్‌టెల్ నుంచి ఎక్స్‌స్ట్రీమ్ ప్లే మాదిరిగానే ఓటీటీ సర్వీసును పొందవచ్చు. మీరు JioTV ప్రీమియం, Tata Play Binge వంటి ఇతర ఓటీటీ అగ్రిగేటర్ ప్లాట్‌ఫారమ్‌లను కూడా యాక్సస్ చేయొచ్చు. ఈ ప్లాట్‌ఫారమ్‌లలో మరింత కంటెంట్‌కి యాక్సెస్‌ను కూడా పొందవచ్చు.

మీరు హెచ్‌బీఓ కంటెంట్ కోసం చూస్తున్నట్లయితే.. జియోసినిమా ప్రీమియం ప్లాట్‌ఫారమ్‌లో యాక్సస్ చేయొచ్చు. బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్‌కు యాక్సెస్ కావాలనుకునే భారత్ ఫైబర్ కస్టమర్‌లు బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ వెబ్‌సైట్‌కి వెళ్లి తమకు నచ్చిన ప్లాన్‌ను కొనుగోలు చేయొచ్చు. తద్వారా తమకు ఇష్టమైన టీవీ షోలు, సినిమాలను వీక్షించవచ్చు. సబ్‌స్క్రిప్షన్ రుసుము కస్టమర్ బ్రాడ్‌బ్యాండ్ బిల్లులో వస్తుంది. ప్రత్యేకంగా ఛార్జ్ చేయదని గమనించాలి.

Read Also : CEO Sundar Pichai : గూగుల్‌లో సుందర్ పిచాయ్ 20ఏళ్ల ప్రస్థానం.. సాధారణ ఉద్యోగి నుంచి సీఈఓ స్థాయికి..!

ట్రెండింగ్ వార్తలు