×
Ad

BSNL Recharge Plan : పండగ చేస్కోండి.. BSNL 72 రోజుల ప్లాన్.. ఫ్రీగా OTT బెనిఫిట్స్.. 144GB హైస్పీడ్ డేటా, క్యాష్‌బ్యాక్‌ కూడా..!

BSNL Recharge Plan : బీఎస్ఎన్ఎల్ 4Gతో పాటు 72 రోజుల వ్యాలిడిటీతో కొత్త రూ.485 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ అక్టోబర్ 15 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో వస్తుంది.

BSNL launches 72-day plan

BSNL Recharge Plan : బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్ న్యూస్.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) 4G సర్వీసును లాంచ్ చేసింది. ఈ టెలికాం ఆపరేటర్ 4G నెట్‌వర్క్ ఈరోజు (సెప్టెంబర్ 27, 2025) నుంచి ప్రతి టెలికాం సర్కిల్‌లో అందుబాటులో ఉంటుంది. గత ఏడాది నుంచే ఈ 4G ప్రాజెక్ట్‌ను బీఎస్ఎన్ఎల్ అమలు చేస్తోంది.

దేశవ్యాప్తంగా లక్షకు పైగా కొత్త 4G, 5G టవర్లను ఏర్పాటు చేసింది. ఈ ప్రయోగం (BSNL Recharge Plan) ఇంటర్నెట్ స్పీడ్ మరింత మెరుగుపడటమే కాకుండా కాల్ డ్రాప్‌లను తగ్గిస్తుందని, బీఎస్ఎన్ఎల్ యూజర్లకు మరింత కనెక్టివిటీని అందించనుంది. 4G నెట్‌వర్క్ లాంచ్‌తో పాటు అత్యంత సరసమైన రీఛార్జ్ ప్లాన్ కూడా తీసుకొచ్చింది.

బీఎస్ఎన్ఎల్ 72 రోజుల ప్లాన్ :
4G లాంచ్‌తో పాటు బీఎస్ఎన్ఎల్ రూ.485 ధరకు కొత్త సరసమైన ప్రీపెయిడ్ ప్లాన్‌ ప్రవేశపెట్టింది. ఈ 72 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ అనేక బెనిఫిట్స్ అందిస్తుంది. డేటా, కాలింగ్ బెనిఫిట్స్ రెండింటినీ కోరుకునే వినియోగదారులకు ఈ బడ్జెట్-ఫ్రెండ్లీ ప్లాన్ అద్భుతంగా ఉంటుంది.

  • దేశంలో ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ ఫ్రీ కాలింగ్
  • రోజుకు 2GB హై-స్పీడ్ డేటా, ప్లాన్ మొత్తంలో 144GB డేటా
  • అన్ని నెట్‌వర్క్‌లలో రోజుకు 100 SMS బెనిఫిట్స్
  • ఫ్రీ నేషనల్ రోమింగ్ బెనిఫిట్స్

ఎంటర్‌టైన్మెంట్ కోసం ఫ్రీ BiTV యాక్సెస్ :
బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ కింద మొబైల్ యూజర్లందరికి BiTVకి ఫ్రీ యాక్సెస్‌ను అందిస్తోంది. BiTV 300కి పైగా లైవ్ టీవీ ఛానెల్‌లు, మల్టీ OTT ప్లాట్‌ఫామ్‌లను అందిస్తుంది. తద్వారా సబ్‌స్ర్కైబర్లు అదనపు ఖర్చు లేకుండా సినిమాలు, షోలు, లైవ్ స్పోర్ట్స్‌ను స్ట్రీమింగ్ చేయొచ్చు.

Read Also : Google 27th Birthday : గూగుల్ పుట్టింది ఈరోజే.. 27వ బర్త్‌డే డూడుల్‌ చూశారా? ‘గూగుల్’ పేరు ఎలా వచ్చింది? అసలు జర్నీ ఫుల్ స్టోరీ ఇదే..!

క్యాష్‌బ్యాక్‌తో లిమిటెడ్ టైమ్ ఆఫర్ :
బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్‌కేర్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకునే వినియోగదారుల కోసం బీఎస్ఎన్ఎల్ ప్రత్యేక క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను కూడా ప్రకటించింది. వినియోగదారులు తమ రీఛార్జ్‌పై 2 శాతం క్యాష్‌బ్యాక్ (రూ. 10 వరకు) పొందవచ్చు. అయితే, ఈ ఆఫర్ అక్టోబర్ 15, 2025 వరకు మాత్రమే వ్యాలిడిటీ అందిస్తుంది.

5G ప్రారంభానికి BSNL సన్నాహాలు :
4G నెట్‌వర్క్ విస్తరిస్తున్నప్పటికీ, బీఎస్ఎన్ఎల్ 5G విస్తరణపై కూడా పనిచేస్తోంది. హైదరాబాద్, బెంగళూరు, ఇతర దక్షిణ భారత నగరాలతో సహా ఎంపిక చేసిన నగరాల్లో టెలికం దిగ్గజం ఇప్పటికే 5G ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ (FWA)ను ప్రారంభించింది. 4G, 5G విస్తరణతో బీఎస్ఎన్ఎల్ భారతీయ టెలికాం మార్కెట్లో స్థానాన్ని బలోపేతం చేయడంతో పాటు ప్రైవేట్ ఆపరేటర్లతో గట్టిపోటీనిస్తోంది.