Google 27th Birthday : గూగుల్ పుట్టింది ఈరోజే.. 27వ బర్త్‌డే డూడుల్‌ చూశారా? ‘గూగుల్’ పేరు ఎలా వచ్చింది? అసలు జర్నీ ఫుల్ స్టోరీ ఇదే..!

Google's 27th Birthday : గూగుల్ సెర్చ్ దిగ్గజం తన హోమ్‌పేజీలో 27వ పుట్టినరోజు (సెప్టెంబర్ 27, 2025)న రంగురంగుల గూగుల్ డూడుల్‌తో ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకుంది.

Google 27th Birthday : గూగుల్ పుట్టింది ఈరోజే.. 27వ బర్త్‌డే డూడుల్‌ చూశారా? ‘గూగుల్’ పేరు ఎలా వచ్చింది? అసలు జర్నీ ఫుల్ స్టోరీ ఇదే..!

Google's 27th Birthday

Updated On : September 27, 2025 / 1:45 PM IST

Google 27th Birthday : ప్రపంచంలోని ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ ఈరోజు (సెప్టెంబర్ 27, 2025) 27వ పుట్టినరోజును జరుపుకుంటోంది. ఈ సందర్భాన్ని సెర్చ్ దిగ్గజం తన హోమ్‌పేజీలో రంగురంగుల గూగుల్ డూడుల్‌తో (Google doodle 27వ Birthday) ఈ ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకుంది.

ఈ డూడుల్ సంవత్సరాల క్రితం సెర్చింగ్ సమయంలో కనిపించే గూగుల్ ఫొటో (Google 27th Birthday)ను వర్ణిస్తుంది. గూగుల్ డూడుల్‌ ద్వారా అమెరికా అంతటా మిలియన్ల మంది వినియోగదారులకు గూగుల్ సుదీర్ఘ ప్రయాణాన్ని గుర్తు చేస్తుంది. కాలిఫోర్నియాలోని ఒక చిన్న గ్యారేజ్ నుంచి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సెర్చ్ ఇంజిన్‌గా మారడం వరకు గూగుల్ సుదీర్ఘ ప్రయాణం కొనసాగిస్తోంది.

మారుతున్న కాలంతో పాటు గూగుల్ తన లోగోను మార్చింది. అప్పటినుంచి ఇంటర్నెట్ యూజర్లు కూడా గూగుల్‌ వాడుతున్నారు. నేడు, గూగుల్ 27వ పుట్టినరోజు సందర్భంగా గూగుల్ అంటే ఏంటి? ఎలా ఆ పేరు వచ్చింది? అసలు గూగుల్ చరిత్ర ఏంటి? జర్నీ ఎలా సాగింది అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్ పుట్టినరోజు ఎప్పుడు? :
చాలా మంది వినియోగదారులు తరచుగా “గూగుల్ పుట్టినరోజు ఎప్పుడు?” అని అడుగుతుంటారు. గూగుల్ సెప్టెంబర్ 4, 1998న స్థాపించబడినప్పటికీ ఆ కంపెనీ సాధారణంగా ప్రతి ఏడాది సెప్టెంబర్ చివరలో తన పుట్టినరోజును జరుపుకుంటుంది. వార్షిక పుట్టినరోజు డూడుల్‌ ద్వారా ప్రత్యేకంగా జరుపుకుంటుంది.

గూగుల్ అంటే ఏంటి? :

ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది గూగుల్‌ను ఉపయోగిస్తున్నారు. అత్యంత ప్రజాదరణ పొందిన సెర్చ్ ఇంజిన్. అయినప్పటికీ, చాలా మందికి గూగుల్ అంటే తెలియకపోవచ్చు. నివేదికల ప్రకారం. గూగుల్ అనే పేరు గూగోల్ అనే గణిత పదం తప్పు స్పెల్లింగ్ నుంచి వచ్చింది. గూగోల్ అంటే.. 1 తరువాత 100 సున్నాలు అని అర్థం.

గూగుల్‌ను ప్రారంభించిన సెర్గీ బ్రిన్, లారీ పేజ్ తమ సెర్చ్ ఇంజిన్ యూజర్లకు అవసరమైన సమాచారాన్ని అందిస్తుందని అనేవారు.. ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది. నేడు గూగుల్‌ను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఇంటర్నెట్‌లో ఏదైనా తెలుసుకునేందుకు యూజర్లు ఎక్కువగా ఇప్పుడు గూగుల్‌నే వాడుతున్నారు.

Read Also : Oppo Reno 14 5G Diwali Edition : రంగులు మారే కలర్ ప్యానెల్‌తో కొత్త ఒప్పో రెనో 14 5G దీపావళి ఎడిషన్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతంటే?

గ్యారేజ్ స్టార్టప్ నుంచి టెక్ పవర్‌హౌస్ వరకు :
గూగుల్ జర్నీ 1995లో స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో ప్రారంభమైంది. అక్కడ లారీ పేజ్ గ్రాడ్యుయేట్ స్కూల్‌ను పరిశీలిస్తూ క్యాంపస్ వద్ద విద్యార్థి సెర్గీ బ్రిన్‌ను కలిశాడు. వీరి మొదటి సమావేశంలో ఇద్దరికి అభిప్రాయాలు కలిసేవి కావు. కానీ, ఏడాదితిరిగే సరికి ఇద్దరు ఒకటిగా కలిసిపోయారు. 1998లో సెర్గీ బ్రిన్, లారీ పేజ్ కలిసి గూగుల్‌ సెర్చ్ ఇంజిన్ స్థాపించారు. వెబ్ పేజీలను లింక్‌ల ఆధారంగా ర్యాంక్ చేసింది.

గూగుల్ ఒక చిన్న గ్యారేజీలో ప్రారంభమైంది. ఇంటర్నెట్ ఇప్పుడిప్పుడే ఆవిర్భవిస్తున్న కాలం అది. అప్పటినుంచే అందరూ గూగుల్ సెర్చ్ ఇంజిన్ వాడటం మొదలుపెట్టారు. దాదాపు ప్రతి ఇంటర్నెట్ యూజర్‌కు కంప్యూటర్లు బ్రౌజింగ్ చేసేందుకు ప్రాథమిక టూల్స్ ఇవే. నేటిలా కాకుండా గూగుల్ కోసం సెర్చ్ చేసేందుకు తమ స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించరు. ఆ కాలంలోనే గూగుల్ బాగా పాపులర్ అయింది.

గూగుల్ అసలు పేరు ఇదే :
ఇప్పుడు మనం పిలుస్తున్నట్టుగా గూగుల్‌ను మొదట గూగుల్ (Google) అని పిలిచేవారు కాదు. గూగుల్ అసలు పేరు “బ్యాక్‌రబ్” (BackRub). అయితే, 1997లో కొత్త పేరు కోసం అన్వేషణ మొదలైంది. ఇందులో పాల్గొన్న బృందం ప్రారంభంలో “గూగోల్‌ప్లెక్స్” “గూగోల్” వంటి పేర్లను ఎంచుకుంది. చివరికి, “గూగోల్”ను ఎంచుకోవాలని నిర్ణయించారు.

ఫస్ట్ ‘గూగుల్’ టైప్ చేసింది ఎవరంటే? :
‘గూగోల్’ అనే పేరునే ఉంచాలని గట్టిగా పట్టుబట్టిన టీంలో సీన్ ఆండర్సన్ ఒకరు. ఇతడు కూడా స్టాన్‌ఫోర్డ్‌లో చదువుతున్నాడు. ‘గూగోల్’ అనే ((Googol) పేరును ఎలా పొందాలో తెలుసుకునేందుకు ఇంటర్నెట్‌లో సెర్చ్ చేశాడు. ఆ తర్వాత ‘గూగోల్’కి బదులుగా గూగుల్ అని టైప్ చేశాడు. యాదృచ్చికంగా, అలా తప్పుగా టైప్ చేసిన పేరు అందుబాటులోకి వచ్చింది. లారీ పేజ్‌కు తప్పుగా రాసిన పేరు నచ్చింది. ఆ తర్వాత, గూగుల్ పేరుతోనే డొమైన్ రిజిస్టర్ చేశారు.