BSNL Rechcarge Plan : BSNL బంపర్ ఆఫర్.. ఈ చీపెస్ట్ ప్లాన్‌తో 30 రోజుల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు హైస్పీడ్ డేటా ఎంతంటే?

BSNL Rechcarge Plan : బీఎస్ఎన్ఎల్ సరసమైన రీఛార్జ్ ప్లాన్ అందిస్తోంది. 30 రోజుల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ కాలింగ్, అదనపు డేటాను పొందవచ్చు.

BSNL Rechcarge Plan : BSNL బంపర్ ఆఫర్.. ఈ చీపెస్ట్ ప్లాన్‌తో 30 రోజుల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు హైస్పీడ్ డేటా ఎంతంటే?

BSNL Rechcarge Plan

Updated On : September 28, 2025 / 1:49 PM IST

BSNL Rechcarge Plan : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. బీఎస్ఎన్ఎల్ తమ యూజర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త రీఛార్జ్ తీసుకొచ్చింది. ఇతర టెలికం దిగ్గజాలతో పోటీగా బీఎస్ఎన్ఎల్ అత్యంత సరసమైన ధరకే అద్భుతమైన ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ కొత్త ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.

వినియోగదారులకు దేశమంతటా అన్‌లిమిటెడ్ (BSNL Rechcarge Plan) వాయిస్ కాలింగ్, మరెన్నో ఫోన్ కాల్స్ డేటాను అందిస్తుంది. అలాగే, అనేక ఇతర బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. ముఖ్యంగా, ఈ బీఎస్ఎన్ఎల్ ప్లాన్ ఎయిర్‌టెల్, జియో, వోడాఫోన్ ఐడియా నుంచి ప్లాన్‌ల కన్నా 40 శాతం వరకు చౌకగా అందిస్తోంది.

బీఎస్ఎన్ఎల్ కొత్త రూ.225 ప్లాన్ :

  • ఈ బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్ కేవలం రూ. 225 ధరకే యూజర్లకు అందిస్తుంది.
  • భారత్ అంతటా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్
  • ఫ్రీ నేషనల్ రోమింగ్.
  • రోజుకు 2.5GB హై-స్పీడ్ డేటా.
  • రోజుకు 100 ఫ్రీ SMS
  • ప్రతి ప్రీపెయిడ్ ప్లాన్‌తో 350కి పైగా లైవ్ టీవీ ఛానల్స్, వివిధ OTT యాప్‌, BiTVకి ఫ్రీ యాక్సెస్.

Read Also : Apple iPhone 17 Series : ఆపిల్ ఫ్యాన్స్ మీకోసమే.. కొత్త ఐఫోన్ 17 సిరీస్ కొంటున్నారా? లేదంటే ఐఫోన్ 16e కొంటారా? ఏ ఐఫోన్ కొంటే బెటర్?

దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ 4G ప్రారంభం.. 5G రెడీ.. :
బీఎస్ఎన్ఎల్ అధికారికంగా దేశవ్యాప్తంగా 4G సర్వీసును ప్రారంభించింది. కంపెనీలోని 90 మిలియన్లకు పైగా వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ 4G సర్వీసు పూర్తిగా స్వదేశీ టెక్నాలజీపై రూపొందింది. పూర్తిగా 5G రెడీ సర్వీసును అందించనుంది. అలాగే, అతి త్వరలోనే 5G సర్వీసులు కూడా ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. బీఎస్ఎన్ఎల్ యూజర్లకు మెరుగైన కనెక్టివిటీని అందించేందుకు బీఎస్ఎన్ఎల్ 97,500 కొత్త మొబైల్ టవర్లను ఏర్పాటు చేస్తోంది.

భారీగా ఆదా :
ప్రైవేట్ ఆపరేటర్లతో పోలిస్తే.. బీఎస్ఎన్ఎల్ ప్లాన్ ద్వారా యూజర్లు భారీగా ఆదా చేసుకోవచ్చు. ఉదాహరణకు.. ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా నుంచి 30-రోజుల ప్లాన్‌ల ధర రూ. 399. ఈ ప్లాన్‌లు 2.5GB రోజువారీ హై-స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, ఫ్రీ నేషనల్ రోమింగ్, 100 రోజువారీ ఫ్రీ ఎస్ఎంఎస్ మెసేజ్ సహా ఇలాంటి బెనిఫిట్స్ అందిస్తున్నాయి. బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ కన్నా వినియోగదారులకు రూ. 174 ఎక్కువ ఖర్చవుతాయి.

బీఎస్ఎన్ఎల్ మొబైల్ కనెక్టివిటీని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు పోస్ట్స్ డిపార్ట్మెంట్ (DOP), భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేశాయి. అధికారిక ప్రకటన ప్రకారం.. బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డులను విక్రయించేందుకు దేశవ్యాప్తంగా మొబైల్ రీఛార్జ్ సర్వీసుల కోసం పోస్టల్ డిపార్ట్మెంట్ 1.65 లక్షలకు పైగా పోస్టాఫీసుల నెట్‌వర్క్‌ను వినియోగించుకుంటుంది.