×
Ad

BSNL Recharge Plans : BSNL బంపర్ ఆఫర్.. ఈ 4 రీఛార్జ్ ప్లాన్లు మీకోసమే.. డేటా టెన్షన్ ఉండదు భయ్యా.. అన్‌లిమిటెడ్ అంతే..!

BSNL Recharge Plans : ఈ 4 రీఛార్జ్ ప్లాన్‌లకు బీఎస్ఎన్ఎల్ జనవరి 31 వరకు వ్యాలీడిటీని అందిస్తోంది. కొత్త ఆఫర్ కింద బీఎస్ఎన్ఎల్ అదనపు డేటాను అందిస్తోంది. ఓసారి లుక్కేయండి.

BSNL Recharge Plan (Image Credit To Original Source)

  • బీఎస్ఎన్ఎల్ 4 రీఛార్జ్ ప్లాన్లపై అదనపు డేటా
  • జనవరి 31 వరకు మాత్రమే వ్యాలిడిటీ
  • అన్ లిమిటెడ్ డేటా, 100 ఫ్రీ SMS బెనిఫిట్స్

BSNL Recharge Plans : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు బంపర్ ఆఫర్.. దేశీయ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తమ కస్టమర్లను ఆకర్షించేందుకు అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. ప్రైవేట్ టెలికం కంపెనీల కన్నా సరసమైన రీఛార్జ్ ప్లాన్‌లను అందించే బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు ఏకంగా 4 రీఛార్జ్ ప్లాన్లపై అదనపు డేటాను ఆఫర్ చేస్తోంది.

ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలతో పోలిస్తే బీఎస్ఎన్ఎల్ అందించే రీఛార్జ్ ప్లాన్లు చాలా చవకగా ఉంటాయి. మీరు కూడా బీఎస్ఎన్ఎల్ యూజర్లు అయితే ఇది మీకోసమే. ఇంతకీ ఈ చౌకైన రీఛార్జ్ ప్లాన్ల ధరలు ఎంత? వ్యాలిడిటీ ఎప్పటివరకు అనే పూర్తి పూర్తి వివరాలను తెలుసుకుందాం.

బీఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్ :
బీఎస్ఎన్ఎల్ జనవరి 31 వరకు వ్యాలీడిటీతో 4 రీఛార్జ్ ప్లాన్‌లకు స్పెషల్ ఆఫర్‌ అందిస్తోంది. కొత్త ఆఫర్ కింద బీఎస్ఎన్ఎల్ 4 రీఛార్జ్ ప్లాన్‌లపై అదనపు డేటాను అందిస్తోంది. ఈ అదనపు డేటా కోసం మీరు జనవరి 31కి ముందే రీఛార్జ్ చేసుకోవాలి. ఈ ప్లాన్‌లలో రూ. 2399, రూ. 485, రూ. 347, రూ. 225 రీఛార్జ్ ప్లాన్‌లు ఉన్నాయి.

రూ. 2399 రీఛార్జ్ ప్లాన్ :

బీఎస్ఎన్ఎల్ రూ. 2399 రీఛార్జ్ ప్లాన్ గతంలో రోజుకు 2GB డేటాను అందించేది. కానీ, ఇప్పుడు రోజుకు 2.5GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. అన్‌లిమిటెడ్ ఫ్రీ కాలింగ్ రోజుకు 100 ఫ్రీ SMS బెనిఫిట్స్ అందిస్తుంది.

Read Also : Motorola Edge 50 Pro : కిర్రాక్ డిస్కౌంట్ బ్రో.. ఈ మోటోరోలా ఫోన్ ధర భారీగా తగ్గిందోచ్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

రూ. 485 రీఛార్జ్ ప్లాన్ :
బీఎస్ఎన్ఎల్ రూ. 485 రీఛార్జ్ ప్లాన్ కూడా రోజుకు 2GB డేటాను అందించింది. కానీ, ఇప్పుడు రోజుకు 2.5GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ 72 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అన్‌లిమిటెడ్ ఫ్రీ కాలింగ్ రోజుకు 100 ఫ్రీ SMS బెనిఫిట్స్ అందిస్తుంది.

BSNL Recharge Plan data (Image Credit To Original Source)

రూ. 347 రీఛార్జ్ ప్లాన్ : 
గతంలో బీఎస్ఎన్ఎల్ రూ. 347 రీఛార్జ్ ప్లాన్ రోజుకు 2GB డేటా అందించేది. కానీ, ఇప్పుడు రోజుకు 2.5GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ 50 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఇందులో అన్‌లిమిటెడ్ ఫ్రీ కాలింగ్ రోజుకు 100 ఫ్రీ SMS బెనిఫిట్స్ ఉన్నాయి.

రూ. 225 రీఛార్జ్ ప్లాన్ :
బీఎస్ఎన్ఎల్ రూ. 225 రీఛార్జ్ ప్లాన్ గతంలో రోజుకు 2.5GB డేటాను అందించేది. కానీ, ఇప్పుడు రోజుకు 3GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఇందులో అన్‌లిమిటెడ్ ఫ్రీ కాలింగ్, రోజుకు 100 ఫ్రీ ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.