BSNL Offers Free 4G SIM Upgrade, Additional Free Data to Users in India
BSNL Free 4G SIM Upgrade : ప్రముఖ భారత ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికమ్యూనికేషన్ కంపెనీ BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) ఈ ఏడాది మేలో కంపెనీ దేశంలో 4G సర్వీసులను ప్రారంభించింది. డిసెంబర్ నాటికి, నెట్‌వర్క్‌లను 5Gకి అప్‌గ్రేడ్ చేస్తామని కంపెనీ తెలిపింది. అయితే, ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో, బీఎస్ఎన్ఎల్ ఛైర్మన్ పీకే పుర్వార్ మాట్లాడుతూ.. కంపెనీ డిసెంబర్‌లో 4G సర్వీసులను ప్రారంభించి, జూన్ 2024 నాటికి దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసురానున్నట్టు చెప్పారు. వచ్చే ఏడాది జూన్ తర్వాత 5G అప్‌గ్రేడ్‌లు జరుగుతాయని ఛైర్మన్ తెలిపారు.
బీఎస్ఎన్ఎల్ ఆంధ్రప్రదేశ్ (@bsnl_ap_circle) యూనిట్ భాగస్వామ్యం చేసిన X పోస్ట్‌లో, బీఎస్ఎన్ఎల్ యూజర్లు పాత 2G లేదా 3G సిమ్‌లను ఉచితంగా 4G సిమ్‌కి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని కంపెనీ ధృవీకరించింది. అప్‌గ్రేడ్ ఫ్రీ మాత్రమే కాకుండా, అప్‌గ్రేడ్‌ని ఎంచుకున్న యూజర్లు మూడు నెలల పాటు వ్యాలీడ్ అయ్యే 4GB ఉచిత డేటాను కూడా పొందవచ్చు.
ఈ ఆఫర్‌తో బీఎస్ఎన్‌ఎల్ రాబోయే 4G సర్వీసులను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుందని కంపెనీ తెలిపింది. ఉచిత డేటా ఆఫర్, ఉచిత అప్‌గ్రేడ్‌ను యాక్సెస్ చేయడానికి బీఎస్ఎన్ఎల్ యూజర్లు బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్, ఫ్రాంఛైజీ లేదా రిటైలర్ స్టోర్‌లలోని ఎగ్జిక్యూటివ్‌లను సంప్రదించవలసిందిగా లేదా వారి డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్‌లలో ఒకరిని (DSA) సంప్రదించండి. ఆఫర్ నిర్దిష్ట నిబంధనలు, షరతులతో అందుబాటులో ఉందని ప్రోమో సూచిస్తోంది.
BSNL Offers Free 4G SIM Upgrade
రిలయన్స్ జియో ఇటీవల భారత్‌లో 4G-సపోర్ట్ చేసే భారత్ B1 ఫీచర్ ఫోన్‌ను లాంచ్ చేసింది. భారత మార్కెట్లో ఈ హ్యాండ్‌సెట్ ధర రూ. 1,299కు పొందవచ్చు. 4G కనెక్టివిటీతో పాటు, ఫోన్ (JioCinema, JioSaavn) అప్లికేషన్‌లతో ప్రీ ఇన్‌స్టాల్ అయ్యాయి. జియో భారత్ B1 జియోపే అప్లికేషన్‌తో అమర్చబడి ఉంది. వినియోగదారులు UPI పేమెంట్లు చేయడానికి అనుమతిస్తుంది. ఈ ఫోన్ విభిన్న ప్రాంతీయ భాషలతో సహా మొత్తం 23 భాషలకు సపోర్టు ఇస్తుంది.