JioMotive Location Tracker : జియోమోటివ్ రియల్ టైమ్ కారు లొకేషన్ ట్రాకర్ ఇదిగో.. ఎవరూ దొంగిలించలేరు.. ధర ఎంతంటే?

JioMotive Location Tracker : భారతీయ కార్ల యూజర్ల కోసం రిలయన్స్ జియో (Reliance Jio) కొత్త జియోమోటివ్ (2023) డివైజ్ ఆవిష్కరించింది. కార్లలో లొకేషన్ ట్రాకింగ్ ఫీచర్, థ్రెట్ అలర్ట్‌తో వస్తుంది. ఈ డివైజ్ ధర, ఇతర వివరాలను ఓసారి లుక్కేయండి.

JioMotive Location Tracker : జియోమోటివ్ రియల్ టైమ్ కారు లొకేషన్ ట్రాకర్ ఇదిగో.. ఎవరూ దొంగిలించలేరు.. ధర ఎంతంటే?

JioMotive with real-time car location tracker, theft alert launched

Updated On : November 6, 2023 / 7:05 PM IST

JioMotive Location Tracker : భారతీయ కార్ల యజమానుల కోసం కొత్త లొకేషన్ ట్రాకింగ్ డివైజ్ వచ్చేసింది. దేశంలోని ప్రముఖ టెలికమ్యూనికేషన్ కంపెనీలలో ఒకటైన రిలయన్స్ జియో (Reliance Jio) కొత్త జియోమోటివ్ (JioMotive 2023) డివైజ్ ఆవిష్కరించింది. వాహన భద్రత, డ్రైవర్ సౌలభ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఉత్పత్తి అనేక ఫీచర్లను అందిస్తుంది.

రూ. 4,999 ధరతో, జియోమోటివ్ అమెజాన్, రిలయన్స్ డిజిటల్ ఇ-కామర్స్ సైట్‌లు, (Jio.com) ఎంపిక చేసిన రిటైల్ అవుట్‌లెట్‌లతో సహా వివిధ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంది. జియోమోటివ్ కారు OBD పోర్ట్‌కు కనెక్ట్ చేయొచ్చు. స్టీరింగ్ వీల్ కింద ఉన్న చాలా వాహనాలలో కనిపించే ప్రామాణిక ఫీచర్ అని చెప్పవచ్చు. కొత్త జియో డివైజ్ ముఖ్య ఫీచర్లలో ఒకటిగా ఉంది. రియల్-టైమ్ 4G జీపీఎస్ ట్రాకింగ్ సామర్థ్యానికి సపోర్టు అందిస్తుంది.

ఈ కారు లొకేషన్ ఎక్కడా ఉన్నా పసిగట్టేస్తుంది :

కారు యజమానులకు వాహనం లొకేషన్‌కు సంబంధించి నిరంతర అప్‌డేట్స్ అందిస్తుంది. వాహనానికి మెరుగైన భద్రతను అందిస్తుంది. అంతేకాకుండా, యూజర్లు జియో లొకేషన్ సెటప్ చేయవచ్చు. కారు నిర్దిష్ట ప్రాంతాల్లోకి ప్రవేశించినప్పుడు లేదా దాటినప్పుడు ఇన్‌స్టంట్ అలర్ట్స్ వెంటనే అందిస్తుంది. ఈ డివైజ్ వాహన హెల్త్ మానిటరింగ్ డేటాను కూడా అందిస్తుంది.

Read Also : JioSpace Fiber vs Starlink : అంబానీ జియోస్పేస్ ఫైబర్, మస్క్ స్టార్‌లింక్ మధ్య తేడాలేంటి? శాటిలైట్ కనెక్టివిటీ, స్పీడ్, ధర ఎంతంటే?

స్పెషల్ యాప్ ద్వారా యాక్సెస్ చేయగల డయాగ్నస్టిక్ ట్రబుల్ కోడ్ (DTC) హెచ్చరికల ద్వారా యూజర్ల కీలక సమాచారానికి యాక్సెస్‌ను పొందవచ్చు. ఇంకా, జియోమోటివ్ డ్రైవింగ్ ప్రవర్తనను అంచనా వేస్తుంది. డ్రైవర్ అలవాట్లు, రోడ్డుపై పనితీరుపై కూడా వినియోగదారులను అప్రమత్తం చేస్తుంది.

JioMotive with real-time car location tracker, theft alert launched

JioMotive with real-time car location tracker, theft alert launched

జియో స్మార్ట్‌ఫోన్ ప్లాన్లకు మాత్రమే వర్తిస్తుంది :

ముఖ్యంగా, జియోమోటివ్ డివైజ్ దొంగతనం, ప్రమాదాలను గుర్తించే సామర్థ్యాలను కూడా కలిగి ఉంది. దొంగతనం లేదా ప్రమాదాలు జరిగినప్పుడు ఇన్‌స్టంట్ వార్నింగ్స్ వినియోగదారులకు పంపుతుంది. మెరుగైన కనెక్టివిటీ కోసం ఇంటర్నల్ Wi-Fiకి కూడా సపోర్టు అందిస్తుంది. అయితే, ముఖ్యమైన అంశం ఏమిటంటే, జియోమోటివ్ ప్రత్యేకంగా జియో SIMతో పనిచేసేందుకు రూపొందించింది. ఇతర ఆపరేటర్ల SIMలతో పని చేయదు. ఈ డివైజ్ కారు యజమాని ప్రస్తుత జియో స్మార్ట్‌ఫోన్ ప్లాన్‌కు మాత్రమే వర్తిస్తుంది. ఆయా ప్లాన్ బెనిఫిట్స్ వారి వాహనానికి కూడా అందిస్తుంది.

మొదటి ఏడాదికి ఫ్రీ సబ్‌స్ర్కిప్షన్ :
అదనంగా, జియో పరిమిత కాల వ్యవధికి ఆఫర్‌ను కూడా ప్రకటించింది. జియోమోటివ్ మొదటి సంవత్సరానికి ఉచిత సభ్యత్వాన్ని అందిస్తుంది. ప్రారంభ సంవత్సరం తర్వాత సబ్‌స్క్రైబర్‌లు సంవత్సరానికి రూ. 599 రుసుముతో ఈ ఫీచర్‌లను ఉపయోగించవచ్చు. ప్రస్తుతానికి, జియో నుంచి కొత్త కార్ ట్రాకర్ డివైజ్.. రిలయన్స్ డిజిటల్ వెబ్‌సైట్‌లో అదనంగా 10 శాతం తగ్గింపు ఆఫర్‌తో అందిస్తోంది. ఇప్పటికే ఇ-కామర్స్ సైట్‌లో లైవ్‌లో ఉంది. అయితే, ఆఫర్ లిమిటెడ్ పిరియడ్ వరకు ఉంటుంది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లో కంపెనీ అందించిన వివరాల ప్రకారం.. ఉత్పత్తికి ఒక ఏడాది వారంటీ కూడా లభిస్తుంది.

Read Also : Vivo X100 Specifications : వివో X100 సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర, ఫీచర్ల వివరాలు లీక్!