BSNL Plan Offers : BSNL యూజర్లకు బంపర్ గుడ్ న్యూస్..! రూ.1499 ప్లాన్‌తో 300 రోజుల జాక్‌పాట్
BSNL Plan Offers : బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ సిమ్ వాడుతున్నారా? రూ. 1499 ప్లాన్ ద్వారా లాంగ్ వ్యాలిడిటీతో పాటు డేటా, కాలింగ్, SMS బెనిఫిట్స్ పొందవచ్చు. పూర్తి ప్లాన్ వివరాలు ఇలా ఉన్నాయి.
BSNL Plan Offers
- 300 రోజుల వ్యాలిడిటీతో బీఎస్ఎన్ఎల్ చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్
- రూ. 1499తో 300 రోజుల వరకు అన్ లిమిటెడ్ కాల్స్, డేటా బెనిఫిట్స్
- 32GB దాటాక డేటా స్పీడ్ లిమిట్ 40kbps తగ్గుతుంది
BSNL Plan Offers : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. అత్యంత సరసమైన రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. కేవలం రూ.1,499కి 300 రోజుల వ్యాలిడిటీతో అద్భుతమైన ప్రీపెయిడ్ ప్లాన్ సొంతం చేసుకోవచ్చు.
మీరు చేయాల్సింది ఒకటే.. బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ సిమ్ ఉంటే చాలు.. ఈ ప్లాన్ తీసుకోవచ్చు. ఈ ప్లాన్ ద్వారా (BSNL Plan Offers) అద్భుతమైన వ్యాలిడిటీతో పాటు FUP పరిమితితో అన్ లిమిటెడ్ డేటాను కూడా పొందవచ్చు. పూర్తి ప్లాన్ బెనిఫిట్స్ ఏంటి? అనేది ఇప్పుడు వివరంగా చూద్దాం..
రూ. 1499 ప్లాన్ బెనిఫిట్స్ :
ఈ బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్ 300 రోజుల వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ మెసేజ్‌లు, అన్లిమిటెడ్ డేటాను అందిస్తుంది. కంపెనీ అధికారిక వెబ్సైట్ ప్రకారం.. ఈ ప్లాన్ 32GB ఎఫ్యూవీ లిమిట్‌తో వస్తుంది.. అంటే 32GB డేటా వాడిన తర్వాత డేటా స్పీడ్ లిమిట్ 40kbpsకి తగ్గుతుంది. ఈ ప్లాన్ వోచర్ కేవలం ప్రీపెయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
మీ సిమ్ యాక్టివ్ ఉండాలన్నా లాంగ్ టైమ్ వ్యాలిడిటీ కావాలన్నా కంపెనీ అనేక సరసమైన రీఛార్జ్ ప్లాన్లను అందిస్తుంది. టెలికాం టాక్ రిపోర్టు ప్రకారం.. రూ. 1,499 బీఎస్ఎన్ఎల్ ప్లాన్ అందుబాటులో ఉంది. 300 రోజుల వరకు వ్యాలిడిటీని అందిస్తుంది.
జియోలో చీపెస్ట్ ప్లాన్ ఉందా? :
రిలయన్స్ జియో రూ. 1748 ధరలో అత్యంత చౌకైన ప్లాన్ 336 రోజుల వ్యాలిడిటీతో అందిస్తోంది. ఈ రీఛార్జ్ ప్లాన్‌లో అన్లిమిటెడ్ కాలింగ్, 3600 SMS, అలాగే జియో టీవీ, జియో క్లౌడ్ స్టోరేజ్ లభిస్తాయి. అయితే, డేటా లేనప్పటికీ ఈ ప్లాన్ బీఎస్ఎన్ఎల్ రూ. 1499 ప్లాన్ కన్నా చాలా ఖరీదైనది.
