Amazon Prime Day 2026 : అమెజాన్‌లో బిగ్ బ్లాస్ట్! రూ. 30వేల లోపు స్మార్ట్ఫోన్లపై దిమ్మతిరిగే డిస్కౌంట్లు.. శాంసంగ్ నుంచి వన్‌ప్లస్ వరకు..!
Amazon Prime Day 2026 Offers : అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా అనేక స్మార్ట్ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, స్మార్ట్ టీవీలు, ఇయర్‌బడ్స్, టాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి.. అవేంటో ఓసారి లుక్కేయండి..
Amazon Prime Day 2026 Offers
- వన్‌ప్లస్ నార్డ్ సీఈ6 లైట్లో 50ఎంపీ ప్రైమరీ కెమెరా సెటప్
- ఐక్యూ జెడ్11ఎక్స్ 5జీలో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో ప్రాసెసర్
- రెడ్మి నోట్ 15 ప్రో 5జీలో 200ఎంపీ ప్రైమరీ కెమెరా సెటప్
Amazon Prime Day 2026 Offers : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అమెజాన్‌లో ప్రైమ్ డే సేల్ నడుస్తోంది. ఇందులో స్మార్ట్ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, స్మార్ట్ టీవీలు, ఇయర్‌బడ్స్, టాబ్లెట్లు ల్యాప్‌టాప్‌లపై భారీ తగ్గింపులు లభిస్తున్నాయి. ఈ సేల్‌లో బ్యాంక్ ఆఫర్లు, కూపన్లు, అలాగే ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. తద్వారా భారీగా (Amazon Prime Day 2026) డబ్బులు ఆదా చేసుకోవచ్చు. రూ. 30వేల లోపు ధరలో స్మార్ట్ఫోన్లపై తగ్గింపులు, ఆఫర్లను ఓసారి పరిశీలిద్దాం..
రూ. 30వేల లోపు స్మార్ట్ఫోన్లపై ఆఫర్లు :
వన్‌ప్లస్ నార్డ్ సీఈ6 లైట్ ఫోన్ 8GB+128GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో రూ. 25,998కి అందుబాటులో ఉంది. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో చేసే పేమెంట్లపై 5శాతం క్యాష్‌బ్యాక్ వంటి బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి. ఈ ఫోన్లో డైమెన్సిటీ 7400 అపెక్స్ చిప్సెట్, 7000mAh బ్యాటరీ, 50MP ప్రైమరీ కెమెరా ఉన్నాయి.
శాంసంగ్ గెలాక్సీ M47 5జీ :
అమెజాన్‌లో 6GB+128GB స్టోరేజ్ వేరియంట్ రూ. రూ. 23,999 ధరకు లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లలో అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ ఫోన్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఇందులో సూపర్ అమోల్డ్ డిస్ప్లే 50MP ప్రైమరీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP64 రేటింగ్ అందిస్తుంది.
Read Also : Gold Loan : ఫస్ట్ టైమ్ గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? ఈ 4 విషయాలు గుర్తుంచుకోండి.. లేదంటే భారీ నష్టం తప్పదు!
ఐక్యూ జెడ్11x :
అమెజాన్‌లో ఈ ఐక్యూ జెడ్11ఎక్స్ 5జీ ఫోన్ 8GB+256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 26,998 ధరకు లభ్యమవుతోంది. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే 5శాతం క్యాష్‌బ్యాక్, మరెన్నో బ్యాంక్ ఆఫర్లు పొందవచ్చు. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 7200mAh బ్యాటరీతో వస్తుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68, IP69+ రేటింగ్‌లతో వస్తుంది.
రియల్‌మి నార్జో పవర్ 5జీ :
అమెజాన్‌లో 8జీబీ+128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999కి అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్ల ప్రకారం.. అమెజాన్ పే బ్యాలెన్స్ ద్వారా పేమెంట్ చేస్తే రూ. 809 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 5జీ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ ఫోన్లో 10001mAh బ్యాటరీ ఉంది. 50MP ప్రైమరీ కెమెరా కూడా ఉంది.
రెడ్మి నోట్ 15 ప్రో 5జీ :
8జీబీ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో రూ. 31,998కి అందుబాటులో ఉంది. ఈ సేల్ సమయంలో కూపన్ ఆఫర్‌తో రూ. 3వేలు ఆదా చేసుకోవచ్చు. దాంతో అసలు ధర రూ. 28,998 అవుతుంది. అదనంగా, అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో చేసే పేమెంట్లపై 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ ఫోన్లో 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 6580mAh బ్యాటరీ ఉంది. ఇందులో OIS సపోర్ట్‌తో 200MP ప్రైమరీ కెమెరా ఉంది.
