దేశీయ ప్రభుత్వ టెలికం రంగ సంస్థ (BSNL) తమ కస్టమర్ల కోసం కొత్త ఆఫర్లను ప్రవేశపెట్టింది. కరోనా కాలంలో సామాజిక దూరాన్ని పాటిస్తూ ఇంట్లో నుంచే పనిచేస్తున్న తమ కస్టమర్ల కోసం ఈ కొత్త వార్షిక ఆఫర్లను తీసుకొచ్చింది. ఇంటి పట్టునే ఉండి ఆఫీసు వర్క్ చేస్తున్నోళ్లకు బండెల కొద్ది డేటాను అందిస్తోంది.
అపరిమిత (అన్ లిమిటెడ్) కాల్స్ ఆఫర్ చేస్తోంది. వార్షిక ప్లాన్ ఆఫర్లలో భాగంగా BSNL తమ ఫైబర్ సర్వీసు వినియోగదారుల కోసం నెలవారీ ప్లాన్ కింద 40mbps స్పీడ్‌తో 250GB వరకు అందిస్తోంది. అయితే ఈ ప్లాన్ బిల్లు మాత్రం వార్షికంగా లెక్కిస్తుంది.. అంటే.. ప్రతి ఏడాదిలో రూ.5,700 వరకు బిల్లు చెల్లించాల్సి ఉంటుంది.
వచ్చే అక్టోబర్ 1 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఒకసారి 250GB లిమిట్ దాటిన తర్వాత డేటా స్పీడ్ 10mbps కు పడిపోతుంది. మరోవైపు బీఎస్ఎన్ఎల్ అందించే మరో ప్లాన్ ‘Fibro 3000GB’.. ప్రారంభంలో ఈ ప్లాన్ కేవలం గుజరాత్ లో మాత్రమే ప్రవేశపెట్టింది.
ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లు దేశంలో ఏదైనా నెట్ వర్క్ నుంచి లోకల్, STD కాల్స్ అన్ లిమిటెడ్ మాట్లాడుకోవచ్చు. BSNL టెలికో ఇటీవలే కొత్త రూ.599 ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ లాంచ్ చేసింది. ఈ ప్లాన్ కింద అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, ప్రతిరోజు 5GB వరకు హైస్పీడ్ ఇంటర్నెట్ డేటాను 90 రోజుల వరకు పొందవచ్చు.