BSNL Plan Offer
BSNL Plan Offer : దేశీయ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL లాంగ్ టైమ్ వ్యాలిడిటీ ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. ఇతర టెలికం నెట్‌వర్క్‌లైన జియో, ఎయిర్‌టెల్, Vi వంటి ప్రైవేట్ నెట్‌వర్క్‌లకు దీటుగా బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లను తక్కువ ధరకే అందిస్తోంది. లేటెస్ట్ రూ.897 ప్లాన్ 180 రోజుల వ్యాలిడిటీతో అందిస్తుంది. ఖరీదైన నెలవారీ రీఛార్జ్‌ల అవసరం లేకుండా వినియోగదారులు తక్కువ ధరలో బెస్ట్ రీఛార్జ్ ఆఫర్లను పొందవచ్చు.
అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో లాంగ్ టైమ్ వ్యాలిడిటీ :
బీఎస్ఎన్ఎల్ రూ. 897 ప్రీపెయిడ్ ప్లాన్లలో దీర్ఘకాలిక ప్లాన్ ఒకటి. 180 రోజుల (సుమారు 6 నెలలు) వ్యాలిడిటీతో భారత్ అంతటా ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ కాలింగ్‌ను అందిస్తుంది. నెలవారీ రీఛార్జ్‌ల అవసరం ఉండదు. కాలింగ్ బెనిఫిట్స్ అవసరమైన వినియోగదారులకు బెస్ట్ ప్లాన్ అని చెప్పొచ్చు.
రోజువారీ లిమిట్ లేకుండా 90GB డేటా :
ఈ ప్లాన్ ద్వారా బీఎస్ఎన్ఎల్ మొత్తం 180 రోజుల వ్యవధిలో మొత్తం 90GB డేటాను అందిస్తుంది. ఇతర టెలికాం ఆపరేటర్ల మాదిరిగా కాకుండా BSNL తమ వినియోగదారులకు సొంత డేటాను వాడుకునేందుకు అనుమతిస్తుంది. వారంలో మొత్తం 90GBని వాడుకోవచ్చు లేదంటే 6 నెలల పాటు పొడిగించుకోవచ్చు.
రోజుకు 100 ఫ్రీ SMS :
కాలింగ్, డేటాతో పాటు ఈ ప్లాన్‌లో రోజుకు 100 ఫ్రీ SMS కూడా ఉన్నాయి. మెసేజింగ్ సర్వీసులపై ఆధారపడే లేదా తరచుగా SMS ఆధారిత ఉపయోగించే వినియోగదారులకు ఫుల్ ప్యాక్ అని చెప్పొచ్చు.
Read Also : Best 5G Phones : అమెజాన్‌లో రూ. 15వేల లోపు ధరలో బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఏ ఫోన్ కొంటారో మీ ఇష్టం..!
ఎక్కువ వ్యాలిడిటీని ఇష్టపడే రోజువారీ భారీ డేటా వినియోగం అవసరం లేని వినియోగదారులకు రూ. 897 BSNL ప్లాన్ గేమ్-ఛేంజర్ లాంటిది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, సెకండరీ సిమ్ వినియోగదారులు లేదా తక్కువ ఖర్చుతో నంబర్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవాలని అనుకునే ఎవరికైనా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
నెలవారీ రీఛార్జ్‌లతో విసిగిపోతే BSNL రూ. 897 ప్లాన్ ఎంచుకోండి. 6 నెలల వ్యాలిడిటీతో రోజువారీ డేటా లిమిట్ లేదు. అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో వస్తుంది. ప్రస్తుతం భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ లాంగ్ టైమ్ ప్రీపెయిడ్ ప్లాన్‌లలో ఇదొకటిగా చెప్పవచ్చు.