Buying Smartphone Sale : ఆన్‌లైన్‌లో మీరు కొన్న స్మార్ట్‌ఫోన్ కొత్తదేనా? సెకండ్ హ్యాండ్ ఫోనా? బాక్సు ఓపెన్ చేయకుండానే ఈజీగా తెలుసుకోవచ్చు..!
Buying Smartphone Sale : అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సేల్ సమయంలో కొత్త ఫోన్లతో పాటు వాడిన లేదా డ్యామేజ్ అయినా ఫోన్లను తక్కువ ధరకే ఆఫర్ చేస్తుంటాయి. మీరు బాక్సు ఓపెన్ చేయకుండానే అది కొత్త ఫోన్ లేదా సెకండ్ హ్యాండ్ ఫోన్ అని ఎలా గుర్తుపట్టాలంటే?

Buying smartphone in sale
Buying Smartphone Sale : అసలే పండుగ సీజన్.. అందులోనూ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్ కూడా మొదలైంది. ఆసక్తిగల వినియోగదారులు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే, ప్రస్తుతం అనేక ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో సేల్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా అనేక స్మార్ట్‌ఫోన్‌లపై ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తున్నాయి. కొనుగోలుదారులు తమకు ఇష్టమైన స్మార్ట్‌ఫోన్‌లను తక్కువ ధరలకు కొనుగోలు చేయాలని చూస్తుంటారు.
ఎలాగైనా తగ్గింపు ధరకే ఫోన్లను సొంతం చేసుకోవాలనుకుంటారు. అయినప్పటికీ, కొంతమంది వినియోగదారులు ఈ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి ఏదైనా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసి మోసపోతుంటారు. కొన్నిసార్లు ఉపయోగించిన లేదా సెకండ్ హ్యాండ్ డ్యామేజడ్ స్మార్ట్‌ఫోన్‌లను స్వీకరించినట్లు చెబుతుంటారు. ఎందుకంటే.. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి సేల్ సమయంలో కొత్త ఫోన్లతో పాటు వాడిన లేదా కొద్దిగా డ్యామేజ్ అయినా ఫోన్లను తక్కువ ధరకే ఆఫర్ చేస్తుంటాయి.
ఇటీవలే ఒక వినియోగదారు ఫ్లిప్‌కార్ట్ నుంచి తనకు యూజడ్ స్మార్ట్‌ఫోన్‌ను స్వీకరించినట్లు నివేదించారు. ఆ పోస్ట్‌లో ఫ్లిప్‌కార్ట్ నుంచి గూగుల్ పిక్సెల్ 8 స్మార్ట్‌ఫోన్‌ను ఆర్డర్ చేసినట్టుగా ప్రస్తావించారు. అయితే, డెలివరీ అయిన తర్వాత స్మార్ట్‌ఫోన్ స్క్రాచ్ అయినట్లు గుర్తించారు. సాధారణంగా ఫ్లిప్‌కార్ట్ ఏదైనా ఆర్డర్ డెలివరీ చేయగానే ఓపెన్-బాక్స్ డెలివరీని కూడా అందిస్తుంది.
అయితే, వినియోగదారులు ఓటీపీని షేర్ చేయలేదు. డివైజ్ రిటర్న్ ఇచ్చేశారు. కానీ, మీరు బాక్సు ఓపెన్ చేయకుండానే అది కొత్త ఫోన్ లేదా సెకండ్ హ్యాండ్ ఫోన్ అని ఎలా చెప్పగలరు? అందుకే, చాలా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తమ కస్టమర్‌లను డివైజ్‌ని ఓపెన్ చేయకుండానే స్మార్ట్‌ఫోన్‌ల వారంటీని చెక్ చేసేందుకు అనుమతిస్తాయి. మీరు ఈ ప్రాసెస్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
I ordered a Google Pixel 8 (Rose, 128GB) on Flipkart (on 26 Sep at 12:05 AM), The product was out of delivery today, Open Box delivery was done & Flipkart Sent me a used unit with visible scratches and only 2 months of warranty remaining. [1/n] pic.twitter.com/Y6Ru6rrF49
— Aryan Sinha (@techyminati) September 27, 2024
ఏదైనా స్మార్ట్‌ఫోన్ వారంటీని ఎలా చెక్ చేయాలి? :
1. గూగుల్ సెర్చ్‌కు వెళ్లి స్మార్ట్‌ఫోన్ వారంటీ స్టేటస్ కోసం చూడండి.
ఉదాహరణకు.. మీకు వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ ఉంటే.. “OnePlus Warranty Check” కోసం సెర్చ్ చేయండి.
2. టాప్ లింక్‌పై క్లిక్ చేసి.. మీ స్మార్ట్‌ఫోన్ సీరియల్ నెంబర్ ఎంటర్ చేయండి.
3. మీరు కొత్త స్మార్ట్‌ఫోన్‌ని కలిగి ఉంటే.. రిటైల్ బాక్స్‌ను ఓపెన్ చేసే ముందే దాని వారంటీని చెక్ చేయొచ్చు. చాలా కంపెనీలు బాక్స్ లేబుల్‌పై స్మార్ట్‌ఫోన్ సీరియల్ నంబర్‌ను అందిస్తాయి. అది ఎక్కడో ఉందో చెక్ చేయండి.
4. సీరియల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీరు వారంటీ స్టేటస్ తెలుసుకోవచ్చు.
ఈ విధంగా, మీరు స్మార్ట్‌ఫోన్ కొత్త ఫోన్ లేదా సెకండ్ హ్యాండ్ ఫోన్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు.