ChatGPT Down : మళ్లీ చాట్‌జీపీటీకి ఏమైంది.. ప్రపంచవ్యాప్తంగా ఏఐ చాట్‌బాట్ డౌన్.. ఓపెన్ఏఐ ఏం చెబుతుందంటే?

ChatGPT Down : చాట్‌జీపీటీ మళ్లీ మొరాయించింది. ఓపెన్ఏఐ చాట్‌బాట్ ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా నిలిచిపోయింది. వినియోగదారుల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఇష్యూపై ఓపెన్ఏఐ సమాధానం ఏంటంటే?

ChatGPT down for users across the world, OpenAI says they are investigating the issue

ChatGPT Down : ప్రపంచవ్యాప్తంగా ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ డౌన్ అయింది. ఓపెన్ఏఐ దీనికి సంబంధించి సమస్యను పరిశోధిస్తున్నట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది యూజర్లు చాట్‌జీపీటీ పని చేయడం లేదని ఫిర్యాదులు చేస్తున్నారు. ఓపెన్ఏఐ వెబ్‌సైట్‌లో తాము సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని కంపెనీ తెలిపింది. చాలా మంది వినియోగదారులు పాపులర్ ఏఐ టూల్ యాక్సెస్ చేయలేమని రిపోర్టు చేశారు. కొన్ని గంటల నుంచి చాట్‌జీపీటీ ప్రపంచవ్యాప్తంగా అంతరాయాన్ని ఎదుర్కొంటోంది.

Read Also : Amazon Great Republic Day Sale : ఈ నెల 13 నుంచే అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. ముందుగా ప్రైమ్ మెంబర్లకు అనుమతి

ఏఐ చాట్‌బాట్‌ను యాక్సెస్ చేయలేకపోతున్నామని అనేక మంది వినియోగదారుల నుంచి సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కొంతమంది వినియోగదారులకు, వెబ్‌సైట్ పూర్తిగా లోడ్ కాలేదు. మరికొందరికి ఇంటర్నల్ సర్వర్ లోపం తలెత్తినట్టు నివేదించారు. ఈ ఫ్లాట్‌ఫారమ్ మొబైల్, వెబ్ వెర్షన్‌లు రెండింటినీ అంతరాయం ప్రభావితం చేసినట్లు కనిపిస్తోంది. అయినప్పటికీ, ఇప్పటికీ యూజర్లు ఆండ్రాయిడ్ ఫోన్‌లు లేదా ఐఫోన్ ద్వారా ఏఐ టూల్ యాక్సెస్ చేయగల కొంతమంది వినియోగదారులు ఉన్నారు.

ChatGPT down for users

మరోసారి స్తంభించిన చాట్‌జీపీటీ.. ఓపెన్ఏఐ మాటల్లోనే.. :
ఓపెన్ఏఐ తమ వెబ్‌సైట్‌లో వాస్తవానికి అంతరాయం ఉందని సమస్యను అంగీకరించింది. ఏఐ టూల్ చాలా మంది వినియోగదారులకు పని చేయడం లేదని అప్‌డేట్ చేసింది. వెబ్‌సైట్ నుంచి లేటెస్ట్ అప్‌డేట్‌లో భాగంగా ప్రస్తుతం ఈ సమస్యను పరిశోధిస్తున్నారని పేర్కొన్నారు. చాట్‌జిపిటి అంతరాయానికి గురికావడం ఇదే మొదటిసారి కాదు.

గత ఏడాది నవంబర్‌లో కూడా ఏఐ టూల్ యూజర్ల కోసం అకస్మాత్తుగా పనిచేయడం నిలిచిపోయింది. ఓపెన్ఏఐ కూడా ఈ సమస్యను గుర్తించింది. డీడీఓఎస్ దాడి కారణంగా అంతరాయానికి కారణమని వెల్లడించింది. డీడీఓఎస్ కారణంగా అసాధారణ ట్రాఫిక్ మోడల్ అంతరాయం కలిగిందని, సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని కంపెనీ తెలిపింది.

ఓపెన్ఏఐ జీపీటీ స్టోర్ ప్రారంభం :
ఓపెన్ఏఐ జీపీటీ స్టోర్‌ను ప్రారంభించిన కొన్ని గంటల తర్వాత ప్రస్తుతం అంతరాయం ఏర్పడింది. జీపీటీ స్టోర్ అనేది ప్లేస్టోర్ లాంటిది. కానీ, కస్టమ్ చాట్‌బాట్‌లకు జీపీటీ స్టోర్‌లో వినియోగదారులు చాట్‌జీపీటీ వారి సొంత వెర్షన్‌లను (ఏ కోడింగ్ లేకుండా) క్రియేట్ చేయొచ్చు. ప్రపంచంతో షేర్ చేసుకోవచ్చు. జీపీటీ స్టోర్‌ను ప్రారంభిస్తూ.. ఓపెన్ఏఐ బ్లాగ్ పోస్ట్‌లో ఇలా ప్రకటించింది.

ChatGPT down

జీపీటీలను ప్రకటించి రెండు నెలలైంది. వినియోగదారులు ఇప్పటికే చాట్‌జీపీటీ 3 మిలియన్లకు పైగా కస్టమ్ వెర్షన్‌లను క్రియేట్ చేశారు. చాలా మంది బిల్డర్‌లు వారి జీపీటీలను ఇతరులు ఉపయోగించేందుకు షేర్ చేశారు. జీపీటీ స్టోర్‌ కోసం chat.openai.com/gptsని విజిట్ చేయండని కంపెనీ ఒక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. జీపీటీ స్టోర్‌తో పాటు ఓపెన్ఏఐ టీమ్ చాట్‌జీపీటీ టీమ్ సబ్‌స్క్రిప్షన్ అనే కొత్త సబ్‌స్క్రిప్షన్ టైర్‌ను కూడా ఆవిష్కరించింది.

ఒక్కో యూజర్.. నెలవారీ సబ్‌స్ర్కిప్షన్ 30 డాలర్ల వరకు.. :
ఈ సబ్‌స్క్రిప్షన్ టైర్ సేఫ్ అసిస్టెంట్ వర్క్‌స్పేస్‌ను కోరుకునే చిన్న టీమ్‌లకు ఒక వరంలా ఉద్భవించింది. ఒక్కో వినియోగదారుకు నెలవారీ 25 డాలర్ల నుంచి 30 డాలర్ల వరకు ధర ఉంటుంది. ఈ సబ్‌స్క్రిప్షన్ ఎంటర్‌ప్రైజ్ కౌంటర్ లాగా కాకుండా, భారీ పెట్టుబడులు అవసరం లేదు. జీపీటీ-4కి కూడా యాక్సెస్ ఉంది. భారీ 32వేల-టోకెన్ కాంటెక్స్ట్ విండోను కలిగి ఉంటుంది.

సుదీర్ఘమైన మరింత క్లిష్టమైన ప్రశ్నలను కూడా సమాధానం ఇవ్వగలదు. సబ్‌స్క్రైబర్‌లు ఎలివేటెడ్ మెసేజ్ క్యాప్‌లను కూడా యాక్సస్ చేయొచ్చు. ఓపెన్ఏఐ యూజర్లు వారి డేటా, కానర్వేజన్ మోడల్‌లకు ట్రైనింగ్ ఇచ్చేందుకు ఉఫయోగించమని హామీ ఇస్తుంది.

Read Also : Amazon Q ChatGPT : ఏఐ చాట్‌జీపీటీకి పోటీగా అమెజాన్‌ బిజినెస్ ‘క్యూ’ చాట్‌బాట్ వచ్చేసింది..!