ChatGPT Ghibli : చాట్‌జీపీటీ ‘ఘిబ్లి’తో జాగ్రత్త.. ట్రెండ్ కోసం మీ ఫొటోలు తెగ అప్‌లోడ్ చేస్తున్నారా? మీ ప్రైవసీ హ్యాకర్ల చేతుల్లోకి..!

ChatGPT Ghibli : చాట్‌జీపీటీ కొత్త ఇమేజ్ జనరేషన్ టూల్‌లో కనిపించే ఘిబ్లి ఆర్ట్ ఫీచర్ గురించి సైబర్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ట్రెండ్‌ కారణంగా వ్యక్తిగత ఫోటోలు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది.

ChatGPT's Ghibli feature

ChatGPT Ghibli : ఏఐ టెక్నాలజీ మరింత క్రేజీగా మారిపోతోంది. సోషల్ మీడియా యూజర్లు ఏఐ మాయలో పడిపోతున్నారు. కొత్తగా ఏది వస్తే అది ట్రై చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో చాట్‌జీపీటీ ‘ఘిబ్లి’ ఆర్ట్ ఫీచర్ ఫుల్ ట్రెండ్ అవుతోంది.

ప్రతిఒక్కరూ ఈ ఏఐ ఫీచర్‌తో ఫన్నీ ఫొటోలను జనరేట్ చేసేస్తున్నారు. మార్చి 26న రిలీజ్ అయిన ChatGPT స్టూడియో ఘిబ్లి ఇమేజ్ జనరేషన్ ఫీచర్‌ను సోషల్ మీడియా యూజర్లు తెగ వాడేస్తున్నారు. ఈ కొత్త ఫీచర్ ఆన్‌లైన్‌లో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.

Read Also : Ration Card eKYC : మీకు రేషన్ కార్డ్ ఉందా? ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో e-KYC ఎలా పూర్తి చేయాలో తెలుసా? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..!

మిలియన్ల మంది వినియోగదారులు తమ ఫోటోలను ఘిబ్లి-శైలి యానిమేషన్‌లుగా మార్చుకున్నారు. అయితే, మార్చి 30న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ఫీచర్ వినియోగం పెరగడంతో ChatGPT సర్వర్‌లు ఒక్కసారిగా క్రాష్ అయ్యాయి.

అయితే, సైబర్ భద్రతా నిపుణులు ఘిబ్లి ఫీచర్ వినియోగంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూజర్ల ప్రైవసీకి ముప్పు ఉందని హెచ్చరిస్తున్నారు. OpenAI అందించే ఈ AI ఆర్ట్ జనరేటర్ యూజర్ల వ్యక్తిగత ఫోటోలను ప్రమాదంలో పడేస్తుందని హెచ్చరిస్తున్నారు.

చాలా మంది నిపుణులు సోషల్ మీడియా ద్వారా ప్రైవసీ భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ట్రెండ్ వల్ల చాట్‌జీపీటీకి చాలా మంది వ్యక్తుల వ్యక్తిగత ఫొటోలు అందుబాటులో ఉండవచ్చని, వీటిని AI మోడల్‌లకు మరింత ట్రైనింగ్ ఇచ్చేందుకు ఉపయోగించవచ్చని సూచిస్తున్నారు.

ఈ ధోరణితో చాలా మంది వినియోగదారులు అనుకోకుండా వారి వ్యక్తిగత ఫోటోలు, ప్రత్యేకమైన ఫేస్ డేటాను OpenAIతో షేర్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రైవసీపరంగా భారీగా నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. OpenAI డేటా సేకరణ పద్ధతులు AI కాపీరైట్ సమస్యలను తప్పించుకోగలవని, చట్టపరమైన పరిమితులను ఎదుర్కోకుండా సమర్పించిన ఫొటోలను ఉపయోగించుకునే సామర్థ్యాన్ని కంపెనీకి కల్పిస్తుందని టెక్ విమర్శకులు వాదిస్తున్నారు.

GDPR నిబంధనలను అతిక్రమించి ఘిబ్లి ట్రెండ్ వినియోగదారుల పూర్తి అనుమతి లేకుండా వారి ఫేస్ డేటాను ఉపయోగించుకునే వెసులుబాటును ఓపెన్ఏఐకి అందిస్తుంది. దాంతో చాలా మంది సైబర్ సెక్యూరిటీ న్యాయవాదులు వినియోగదారులు ఈ ట్రెండ్ నుంచి దూరంగా ఉండాలని, వ్యక్తిగత ఫొటోలను అప్‌లోడ్ చేయకుండా ఉండాలని కోరుతున్నారు.

Read Also : PF Withdrawals : ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మీ PF డబ్బులను రూ. 5లక్షల వరకు విత్‌డ్రా చేయొచ్చు.. ఫుల్ డిటెయిల్స్..!

‘ఘిబ్లి’ ఆర్ట్ ఫీచర్‌తో ప్రైవసీ రిస్క్ ఏంటి? :

ప్రైవసీ ఉల్లంఘనలు : వినియోగదారుల ఫోటోలను వారి అనుమతి లేకుండా వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు.

ఐడెంటిటీ థెఫ్ట్ : వ్యక్తిగత సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేసే అవకాశం ఉంది.

డేటా భద్రత :
వినియోగదారు సమాచారం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్ళవచ్చు.

ఫేక్ ప్రొఫైల్‌ క్రియేషన్ :
మోసపూరిత ఆన్‌లైన్ ఐడెంటిటీని క్రియేట్ చేసేందుకు మీ ఫోటోలను దుర్వినియోగం చేయవచ్చు.

చట్టపరమైన సమస్యలు :
వినియోగదారులు తమ ఫోటోలను అనుచితంగా ఉపయోగిస్తే.. చట్టపరమైన సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు.