Ration Card eKYC : మీకు రేషన్ కార్డ్ ఉందా? ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో e-KYC ఎలా పూర్తి చేయాలో తెలుసా? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..!
Ration Card eKYC : మీ రేషన్ కార్డుకు ఈ-కేవైసీని పూర్తి చేశారా? రేషన్ కార్డుదారులు తప్పనిసరిగా ఈ-కేవైసీని పూర్తి చేయాలి. లేదంటే ప్రభుత్వం అందించే పథకాలను కోల్పోతారు. అంతేకాదు.. మరెన్నో ప్రయోజనాలను కూడా పొందలేరు.

Ration Card eKYC
Ration Card eKYC Process : మీకు రేషన్ కార్డు ఉందా? మీ రేషన్ కార్డుకు ఈ-కేవైసీ చేయించుకున్నారా? లేదంటే వెంటనే ఈ-కేవైసీని పూర్తి చేయండి. రేషన్ కార్డ్ అనేది చాలా ముఖ్యం. మన దేశంలో చాలా కాలంగా రేషన్ కార్డుకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
ప్రభుత్వ పథకాలను పొందాలన్నా రేషన్ బియ్యం ఇతర సరుకులను పొందాలన్నా రేషన్ కార్డు కీలకమైన డాక్యుమెంట్. రేషన్ కార్డుతో, పౌరులు ఉచితంగా లేదా సబ్సిడీతో కూడిన ఆహారాన్ని పొందవచ్చు.
భారతీయ పౌరులకు రేషన్ కార్డు ఐడీలు చాలా ముఖ్యం. జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) ప్రకారం.. రేషన్ కార్డుల కోసం e-KYCని పూర్తి చేయడం తప్పనిసరి. చాలా మంది వ్యక్తులు 2013లో తమ e-KYCని పూర్తి చేశారని నివేదికలు సూచిస్తున్నాయి.
అంటే.. అప్పటి నుంచి దాదాపు 12 ఏళ్లు అనమాట. కొత్త నిబంధనల ప్రకారం.. e-KYCని ప్రతి 5 ఏళ్లకు ఒకసారి అప్‌డేట్ చేసుకోవాలి. నేటి డిజిటల్ యుగంలో మీ e-KYCని పూర్తి చేయడం చాలా సులభం. మీరు క్యూ లైన్లలో గంటల కొద్ది వేచి ఉండాల్సిన అవసరం లేదు. మీ ఇంటి నుంచి చాలా సులభంగా రేషన్ కార్డు ఇ-కేవైసీని పూర్తి చేయొచ్చు.
ఇంట్లోనే రేషన్ కార్డ్ e-KYC ఎలా పూర్తి చేయాలి? :
- మీ రేషన్ కార్డ్ e-KYCని ఆన్‌లైన్‌లో పూర్తి చేయాలంటే.. మీకు కావలసిందల్లా స్మార్ట్‌ఫోన్, స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ సరిపోతుంది.
- ‘My KYC’ ‘Aadhaar FaceRD’ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
- యాప్ ఓపెన్ చేసి మీ లొకేషన్ ఎంచుకోండి. ఉదాహరణకు.. మీరు హైదరాబాద్‌లో ఉంటే.. మీ లొకేషన్ వెరిఫికేషన్ కోసం హైదరాబాద్ ఆప్షన్ ఎంచుకోండి.
- మీ ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి. ఆపై మీరు అందుకున్న OTPని ఇన్‌పుట్ చేసి క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి.
- మీ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. Face e-KYC బటన్ కోసం సెర్చ్ చేయండి.
- Face e-KYC బటన్‌ను క్లిక్ చేశాక మీ కెమెరా యాక్టివేట్ అవుతుంది. మీ ముఖాన్ని సర్కిల్‌లో ఉంచి ఫొటో తీసుకోండి.
- మీ ఫోటో తీసిన తర్వాత మీ e-KYC ప్రక్రియ పూర్తవుతుంది.
- మీ స్క్రీన్ పై స్టేటస్‌లో ‘Y’ కనిపిస్తే.. మీ e-KYC విజయవంతంగా పూర్తి అయినట్టే..
రేషన్ కార్డ్ e-KYC ఆఫ్‌లైన్‌లో ఎలా పొందాలి? :
మీరు కోరుకుంటే.. మీరు రేషన్ కార్డ్ దుకాణంలో ఆఫ్‌లైన్‌లో మీ రేషన్ కార్డ్ e-KYCని కూడా పొందవచ్చు. మీ మొబైల్ యాప్ పనిచేయకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు మీ సమీప రేషన్ దుకాణం నుంచి సులభంగా e-KYCని పొందవచ్చు.