Income Tax Rules : బిగ్ అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఐటీ రూల్స్.. వేతనజీవులపై ఎంతగా ప్రభావం ఉంటుందంటే? ఫుల్ డిటెయిల్స్..
Income Tax Rules : 2025 ఏప్రిల్ నుంచి కొత్త ఐటీ రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఈ కొత్త ఆదాయ పన్ను నియమాలతో ముఖ్యంగా జీతం పొందే ఉద్యోగులపై భారీగా ప్రభావం పడనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

New Income Tax Rules
Income Tax Rules : టాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి ఆదాయ పన్నుకు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా ఈ కొత్త ఐటీ రూల్స్ వల్ల వేతన జీవులపై భారీగా ప్రభావం పడనుంది. ఇందులో పన్ను స్లాబ్‌లు, డిడెక్షన్స్, టీడీఎస్ వంటి వాటిలో అనేక మార్పులు ఉంటాయి.
అదనపు ప్రయోజనాలతో కేంద్ర ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చనుంది. అయితే, సాండర్డ్ డిడెక్షన్స్, మినహాయింపులలో అప్‌డేట్స్ టేక్-హోమ్ జీతాలపై భారీగా ప్రభావితం చేయవచ్చు. పన్నుచెల్లింపుదారులు ఐటీఆర్ దాఖలు చేయడం ద్వారా సాధ్యమైనంత వరకు పన్ను ఆదాను పెంచుకునే ప్రయత్నం చేయొచ్చు.
ఏప్రిల్ 1, 2025 పన్ను, ఆర్థిక మార్పులు :
ఏప్రిల్ 1 నుంచి కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన అనేక కొత్త ఆదాయపు పన్ను నియమాలు అమలులోకి వస్తాయి. జీతం పొందే వ్యక్తులు, పెట్టుబడిదారులు, పన్ను చెల్లింపుదారులపై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. ఈ మార్పులలో సవరించిన పన్ను స్లాబ్‌లు, పెరిగిన రాయితీలు, అప్‌డేట్ చేసిన TDS, TCS పరిమితులు ఉన్నాయి.
TDS పరిమితిలో పెరుగుదల :
పన్ను మినహాయింపు (TDS) పరిమితి పెరిగింది. సీనియర్ సిటిజన్లకు బిగ్ రిలీఫ్.. ఏప్రిల్ 1 నుంచి వడ్డీ ఆదాయంపై టీడీఎస్ పరిమితి రూ. 1 లక్షకు పెరుగుతుంది. పెన్షనర్లు, రిటైర్డ్ అయిన వారికి అనవసరమైన పన్ను మినహాయింపులను తగ్గిస్తుంది.
సెక్షన్ 87A కింద అధిక పన్ను రాయితీ :
సెక్షన్ 87A కింద పన్ను రాయితీని రూ.25వేల నుంచి రూ.60వేలకి భారీగా పెంచారు. సంవత్సరానికి రూ.12 లక్షల వరకు సంపాదించే వ్యక్తులు పన్ను రహిత ఆదాయాన్ని పొందవచ్చు. మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు భారీ ఉపశమనం కలిగిస్తుంది.
కొత్త పన్ను స్లాబ్‌లు, రేట్లు :
ప్రభుత్వం సవరించిన ఆదాయపు పన్ను స్లాబ్‌లను ప్రవేశపెట్టింది. వివిధ ఆదాయ వర్గాలకు పన్ను రేట్లు మారుతాయి.
4 లక్షల వరకు : పన్ను లేదు
రూ. 4 లక్షల నుంచి రూ. 8 లక్షల వరకు : 5 శాతం
రూ. 8 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు : 10 శాతం
రూ. 12 లక్షల నుంచి రూ. 16 లక్షల వరకు : 15 శాతం
రూ. 16 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు : 20 శాతం
రూ. 20 లక్షల నుంచి రూ. 24 లక్షల వరకు : 25 శాతం
24 లక్షలకు పైన : 30 శాతం
ఈ కొత్త శ్లాబులు తక్కువ, మధ్యతరగతి ఆదాయ వర్గాలపై పన్ను భారాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. అదే సమయంలో ఎక్కువ సంపాదిస్తున్నవారు ఎక్కువ వాటాను పొందవచ్చు.
టీసీఎస్ (TCS) నిబంధనల్లో మార్పులు :
టీసీఎస్ రేట్లు సవరించారు. ముఖ్యంగా విదేశీ ప్రయాణం, పెట్టుబడులు, అధిక-విలువ లావాదేవీలపై ప్రభావితం చేస్తాయి. గతంలో రూ. 7 లక్షలకు పైగా ఉన్న మొత్తాలపైనే టీసీఎస్ వర్తించేది. కానీ, ఏప్రిల్ 1 నుంచి ఈ పరిమితి రూ. 10 లక్షలకు పెంచనున్నారు. దాంతో పన్ను చెల్లింపుదారులపై సమ్మతి భారాన్ని తగ్గిస్తుంది.
అప్‌డేటెడ్ టాక్స్ రిటర్న్లు (ITR-U) ఫైలింగ్ గడువు పొడిగింపు :
రిటర్న్‌లను దాఖలు చేయని పన్ను చెల్లింపుదారులు ఇప్పుడు తమ ఆదాయపు పన్ను రిటర్న్ (ITR)ను అప్‌డేట్ చేసేందుకు ఏడాది కాకుండా 4 ఏళ్ల వరకు సమయం ఉంది. అప్పటిలోగా మీ రిటర్న్స్ దాఖలు చేసుకునేందుకు తగినంత సమయం ఉంటుంది.