China Zhurong Rover Mars : అంగారక గ్రహంపై జురాంగ్ రోవర్ మొదటి ఫొటోలు విడుదల చేసిన చైనా

చైనా జురాంగ్ రోవర్ (Zhurong rover) యుటోపియా ప్లానిటియా (Utopia Planitia)లో దిగిన తరువాత మార్స్ ఉపరితలం నుంచి మొదటి చిత్రాలను పంపింది. మార్స్ నుంచి రోవర్ పంపిన రెండు కొత్త ఫొటోలను చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (CNSA) విడుదల చేసింది.

China Releases First Images From Its Zhurong Rover On Mars

China Zhurong rover first images : చైనా జురాంగ్ రోవర్ (Zhurong rover) యుటోపియా ప్లానిటియా (Utopia Planitia)లో దిగిన తరువాత మార్స్ ఉపరితలం నుంచి మొదటి చిత్రాలను పంపింది. మార్స్ నుంచి రోవర్ పంపిన రెండు కొత్త ఫొటోలను చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (CNSA) విడుదల చేసింది. అందులో ఒకటి రంగులతో మెరిసిపోతుండగా.. మరొకటి బ్లాక్ అండ్ వైట్ లో కనిపిస్తోంది. ఈ రెండు ఫొటోల్లో కనిపించే రోవర్ ల్యాండర్ ఉన్న యుటోపియా ప్లానిటియా ప్రదేశంలో కనిపిస్తోంది.

గత శుక్రవారమే రోవర్ మార్టిన్ వాతావరణంలోకి అడుగుపెట్టింది. చైనా టియాన్వెన్ -1 నుంచి విడిపోయిన తరువాత ల్యాండర్‌తో కలిసిపోయింది. కొత్త ఫొటోల్లో రెండు రోబోట్లు మొదటి ల్యాండింగ్ దశలు కనిపిస్తున్నాయి. జురాంగ్ ఆరు చక్రాలను మొదటిసారిగా మార్టిన్ ఉపరితలంపై నిలబడేందుకు వీలుగా లాండర్ ఒక చిన్న ర్యాంప్‌ను పెంచింది. రోవర్ నావిగేషన్ కెమెరాలలో జురాంగ్ నాలుగు రెక్కలతో కూడిన సోలార్ ప్యానెల్ కమ్యూనికేషన్ యాంటెన్నా ఉంది.

ఫిబ్రవరిలో మార్టిన్ కక్ష్యకు చేరుకున్న టియాన్వెన్ -1 మిషన్ అంగారక గ్రహంపై విజయవంతంగా చైనా ల్యాండ్ చేసింది. ఇప్పటివరకూ అమెరికా మాత్రమే రెడ్ ప్లానెట్‌లో రోవర్లను విజయవంతంగా ల్యాండ్ చేసింది. అమెరికా తర్వాత అంగారకుడిపై రోవర్ ల్యాండ్ చేసిన రెండో దేశంగా చైనా అవతరించింది. జురాంగ్ రోవర్ ఆరు చక్రాలతో 530-పౌండ్లు. (240 కిలోగ్రాములు) బరువు ఉంది. యుటోపియా ప్లానిటియా ప్రాంతంలో భూగర్భ శాస్త్రం, వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి రోవర్ తన ఆరు పరికరాలను ఉపయోగించనుంది. ఈ  రోవర్ సుమారు మూడు నెలల (90 రోజులు) పాటు అంగారకుడిపై అన్వేషణ కొనసాగించనుంది.