వావ్ సూపర్ టిప్.. క్రెడిట్ కార్డు యాన్యువల్ ఫీజు మాఫీ చేసుకోవచ్చట ఇలా..!
అదే, క్రెడిట్ కార్డ్‌లపై చేసిన ఖర్చులను తిరిగి చెల్లించడానికి 45 రోజుల వరకు సమయం ఉంటుంది. ఈ సమయంలో తీసుకున్న సొమ్ముపై ఎలాంటి వడ్డీ పడదు.

Get Your Annual Fee Waived With These Tips
Credit Card Hack : క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అయితే, ఇది మీకోసమే.. సాధారణంగా ప్రతి క్రెడిట్ కార్డుకు యాన్యువల్ ఫీజు ఉంటుంది. కానీ, కొన్ని క్రెడిట్ కార్డులకు వార్షిక ఫీజు లేకుండానే జారీ చేస్తుంటాయి. వీటినే లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డులుగా పిలుస్తారు.
అయితే, చాలామందిలో క్రెడిట్ కార్డులు ఎక్కువగా వాడితే భారీగా ఛార్జీలు పడతాయనే అపోహ ఉంటుంది. అందుకే కొంతమంది తమ కార్డుపై ఎంతమేర ఖర్చు చేసే పరిమితి ఉందో తెలియదు. ఎంత మొత్తంలో ఖర్చు చేస్తే వార్షిక రుసుము మాఫీ అవుతుందో కూడా తెలియకపోవచ్చు.
Read Also : Restaurant industry : దేవుడా.. జొమాటో, స్విగ్గీ ఇంత పనిచేస్తుందా? నేషనల్ వైడ్ భారీ దెబ్బ పడనుందా?
మరికొందరు అయితే, తెలిసినవారి దగ్గర నుంచి డబ్బులు అప్పుగా తీసుకోవడం కంటే క్రెడిట్ కార్డుని ఉపయోగించడమే బెస్ట్ అని వాదిస్తుంటారు. ఎందుకంటే.. ఇది పేమెంట్ల చేయడంపై ఒత్తిడిని తగ్గిస్తుంది.
అదే, క్రెడిట్ కార్డ్‌లపై చేసిన ఖర్చులను తిరిగి చెల్లించడానికి 45 రోజుల వరకు సమయం ఉంటుంది. ఈ సమయంలో తీసుకున్న సొమ్ముపై ఎలాంటి వడ్డీ పడదు. వడ్డీ రహిత వ్యవధితో సహా వివిధ ప్రయోజనాలను పొందవచ్చు. ఈ వ్యవధిలోపు మిగిలిన మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైతే మాత్రం భారీగా వడ్డీ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది.
కార్డు వాడకం బట్టే బెనిఫిట్స్ :
గడువు తేదీకి ముందే బ్యాలెన్స్ పూర్తిగా చెల్లించారు అనుకోండి.. ఆయా కార్డులపై ఎలాంటి వడ్డీ వసూలు చేయబడదు. అదనంగా, అనేక క్రెడిట్ కార్డ్‌లు వివిధ బెనిఫిట్స్, డిస్కౌంట్‌లను కూడా అందిస్తాయి. సాధారణంగా క్రెడిట్ కార్డ్ అనేది పాపులారిటీపై ఆధారపడి ఉంటాయి. అన్ని బ్యాంకులు తమ ప్రొడక్టుల ఆఫర్లలో నిర్దిష్ట క్రెడిట్ కార్డ్‌ల కోసం వార్షిక రుసుమును విధిస్తాయి. ఇందుకు విరుద్ధంగా, కొన్ని క్రెడిట్ కార్డ్‌లు వార్షిక రుసుము లేకుండా జారీ అవుతాయి.
వీటిని సాధారణంగా “లైఫ్ టైమ్ ఫ్రీ” కార్డ్‌లుగా సూచిస్తారు. అంతేకాకుండా, కస్టమర్‌లు ముందుగా నిర్ణయించిన ఖర్చు థ్రెషోల్డ్‌లకు అనుగుణంగా ఉంటే నిర్దిష్ట కార్డ్‌లపై వార్షిక రుసుము నుంచి మినహాయింపు పొందవచ్చు. యాన్యువల్ ఫీజు లేని క్రెడిట్ కార్డ్‌ని ఎంచుకోవడం లేదా క్రెడిట్ కార్డ్‌తో మరింత ఖర్చు చేసి రుసుము మాఫీ చేసేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటో ఓసారి పరిశీలిద్దాం..
సరైన క్రెడిట్ కార్డ్ ఎంపిక : అన్ని క్రెడిట్ కార్డ్‌లకు వార్షిక రుసుము ఉండదు. అంతేకాకుండా, అనేక బ్యాంకులు, రుణదాతలు లైఫ్ టైమ్ ఫ్రీ కార్డులను అందిస్తున్నారు. అదే సమయంలో, మీరు సంవత్సరానికి కొంత మొత్తాన్ని ఖర్చు చేస్తే.. కొన్ని కార్డ్‌లపై యాన్యువల్ ఫీజు తగ్గింపులను అందిస్తాయి.
రివార్డ్ పాయింట్లను వాడటం : కొన్నిసార్లు బ్యాంకులు గుడ్‌విల్ ప్రాతిపదికన మీ వార్షిక రుసుమును మాఫీ చేయవచ్చు. ఉదాహరణకు.. మీరు మీ బ్యాలెన్స్‌ను నిర్దిష్ట వ్యవధిలోపు చెల్లించినట్లయితే లేదా గుడ్ క్రెడిట్ హిస్టరీని కలిగి ఉంటే.. ఈ వార్షిక రుసుమును మాఫీ చేసేందుకు మీ బ్యాంక్‌ను కూడా సంప్రదించవచ్చు.
ఖర్చు పరిమితి (Spend Limit) : క్రెడిట్ కార్డులో కస్టమర్ కొంత మొత్తాన్ని ఖర్చు చేస్తే.. చాలా క్రెడిట్ కార్డ్ జారీ చేసేవారు వార్షిక రుసుమును మాఫీ చేస్తారు. అందువల్ల, మీ ప్రస్తుత క్రెడిట్ కార్డ్ మీ అవసరాలకు అనుగుణంగా లేకుంటే.. ఎక్కువ బెనిఫిట్స్ లేదా రివార్డ్ పాయింట్‌లను అందించే తక్కువ వార్షిక రుసుమును కలిగిన క్రెడిట్ కార్డును తీసుకోండి. ప్రత్యేకించి మీ ఖర్చుల ద్వారా వార్షిక రుసుమును మాఫీ చేయవచ్చు.
Read Also : ఈ శాంసంగ్ ఫోన్‌పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. ఇదే బెస్ట్ టైమ్.. కొంటే ఇప్పుడే కొనేసుకోండి..!