Restaurant industry : దేవుడా.. జొమాటో, స్విగ్గీ ఇంత పనిచేస్తుందా? నేషనల్ వైడ్ భారీ దెబ్బ పడనుందా?
Restaurant industry : కస్టమర్లు ఆర్డర్ చేసే ఫుడ్ రెస్టార్టెంట్ల నుంచి పిక్ అండ్ డెలివరీ చేస్తున్నప్పటికీ స్విగ్గీ, జొమాటో తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Restaurant industry flags Zomato, Swiggy
Restaurant industry : దేశంలో ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్లు జొమాటో, స్విగ్గీ ఆన్‌లైన్ ఆర్డర్లతో దూసుకుపోతున్నాయి. కస్టమర్లను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ రెండు ఫుడ్ డెలివరీ సంస్థలు పనిచేస్తున్నాయి. కస్టమర్లు ఆర్డర్ చేసే ఫుడ్ రెస్టార్టెంట్ల నుంచి పిక్ అండ్ డెలివరీ చేస్తు్న్నప్పటికీ తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యంగా ప్రైవేట్ లేబులింగ్, డైనింగ్ ఇన్ బిజినెస్‌లోకి కూడా స్విగ్గీ, జొమాటో ఎంట్రీ ఇచ్చేశాయి. అసలు సమస్య ఇక్కడే మొదలైంది.. టాప్ రెస్టారెంట్లలో నుంచి తమ కస్టమర్‌లను అగ్రిగేటర్లు ఆకర్షిస్తున్నారని రెస్టారెంట్ ఇండస్ట్రీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) ఆందోళన వ్యక్తం చేసింది.
Read Also : Maoist Chalapati : మావోయిస్టు అగ్రనేత చలపతి హతం.. భార్యతో తీసుకున్న సెల్ఫీ వల్ల ప్రాణం పోయిందట..!
నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) బుధవారం నిర్వహించిన టౌన్ హాల్‌లో జొమాటో, బిస్ట్రో, స్విగ్గీకి చెందిన స్నాక్ వంటి వెంచర్‌లు తమ బ్రాండ్‌తో థర్డ్-పార్టీ కమర్షియల్ కిచెన్లలో తయారు చేసిన ఫుడ్ అందించడం ద్వారా వినియోగదారులను తమ సంస్థలకు దూరం చేస్తున్నాయని ఆరోపించింది.
ప్రైవేట్ లేబుల్స్‌తో ఫుడ్ డెలివరీలు అన్యాయం :
స్విగ్గీ, జొమాటో అగ్రిగేటర్లు సృష్టించిన అన్యాయమైన పోటీ గురించి ఎన్ఆర్ఏఐ (NRAI) అధ్యక్షుడు, (WOW) మోమోస్ సీఈఓ సాగర్ దర్యానీ ఆందోళన వ్యక్తం చేశారు. బిస్ట్రో, స్నాక్ వంటి యాప్‌లు కస్టమర్‌లను వారి ప్రైవేట్ లేబుల్‌లతో రెస్టారెంట్ డేటాకు తమ యాక్సెస్‌ను ఉపయోగించుకుంటున్నాయని అన్నారు. “థర్డ్-పార్టీ కమర్షియల్ కిచెన్‌ల నుంచి తయారైన ఉత్పత్తులను పొందుతున్నారు. పైగా వాటిని తమ సొంత ప్రైవేట్ లేబుల్ కింద విక్రయిస్తున్నారు. మా డేటాతో యాక్సస్ చేసి వారు అధిక కమీషన్లు లేకుండా మెరుగైన ధరలకు ఇలాంటి ఆహార పదార్థాలను అందించగలరు”అని దర్యానీ పేర్కొన్నారు.
ఎందుకు కమిషన్ వసూలు చేయాలి : దర్యానీ ప్రశ్న :
డైనింగ్-ఇన్ సెగ్మెంట్‌లోకి అగ్రిగేటర్ల ఎంట్రీని కూడా దర్యానీ ప్రస్తావించారు. తమ కస్టమర్‌లను ఆకర్షించడానికి భారీ డిస్కౌంట్లను అందిస్తూ టేబుల్ రిజర్వేషన్‌ల కోసం కమీషన్‌లను వసూలు చేస్తారు. “డెలివరీలో వారు సర్వీసును మాత్రమే అందిస్తారు. కానీ, డైనింగ్-ఇన్‌లో ఎక్స్‌పీరియన్స్‌కు ఎలాంటి వాల్యూ ఇవ్వరు. అలాగే కస్టమర్లను మా వద్దకు తీసుకువస్తారు. కస్టమర్ మొత్తం అనుభవంలో వారి రోల్ జీరో మాత్రమే. అలాంటిప్పుడు ఎందుకు కమిషన్ వసూలు చేయాలి’’ అంటూ దర్యానీ ప్రశ్నించారు.
ప్రస్తుతానికి “ఈ రోజు.. వారు 3-5శాతం వసూలు చేస్తున్నారు.. రేపు వారు 7శాతం, 10శాతం, 15శాతం వసూలు చేస్తారు. ఇది కాలక్రమేణా పెరుగుతుంది”అని దర్యానీ హెచ్చరించారు. జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ మాట్లాడుతూ.. బిస్ట్రో రెస్టారెంట్ పరిశ్రమకు ముప్పు కాదన్నారు. నివేదిక ప్రకారం.. ‘ప్రైవేట్ లేబుల్’ లేదా ‘జోమాటో కిచెన్’ కూడా కాదని అన్నారు. జొమాటో మరియు స్విగ్గి రెండూ తమ ఆధిపత్య మార్కెట్ స్థానాలను దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపిస్తూ 2021లో ఎన్‌ఆర్‌ఎఐ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ)కి పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఇదంతా జరిగింది.
నివేదిక ప్రకారం.. ఎన్ఆర్ఏఐ తమ పిటిషన్‌ను ఇటీవలి ఫిర్యాదులతో అప్‌డేట్ చేయాలని యోచిస్తోంది. ఈ క్రమంలోనే పరిశ్రమల ప్రమోషన్ కోసం డిపార్ట్‌మెంట్, డిజిటల్ కామర్స్ కోసం ఇంటర్నల్ ట్రేడ్ ఓపెన్ నెట్‌వర్క్ (ONDC) వంటి ప్రత్యామ్నాయ ప్లాట్‌ఫారమ్‌లను ప్రాచుర్యంలోకి తీసుకురావాలని దర్యానీ ప్రయత్నిస్తున్నారు.
Read Also : Hezbollah Leader : ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ షేక్ ముహమ్మద్ అలీ హమాది హతం.. ఇంట్లో ఉండగా కాల్చివేత!