Credit Card Annual Fee : మీకు క్రెడిట్ కార్డ్ ఉందా? వార్షిక రుసుమును మాఫీ చేసుకోవచ్చు.. ఇలా చెక్ చేయండి!
Credit Card Annual Fee : క్రెడిట్ కార్డుల యానివల్ ఛార్జీలను మాఫీ చేసుకోవడం చాలా మందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Credit Card Annual Fee
Credit Card Annual Fee : క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అయితే, ఇది మీకోసమే.. మీ క్రెడిట్ కార్డు లిమిట్ ఆధారంగా సంవత్సరానికి ఎంత ఖర్చు చేయాలో తెలుసా? ఒకవేళ లిమిట్ కన్నా తక్కువగా ఖర్చు చేస్తే ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు. ప్రతి క్రెడిట్ కార్డుకు యానివల్ ఛార్జీలు వర్తిస్తాయి.
Read Also : OnePlus 13R Sale : వన్‌ప్లస్13ఆర్ సేల్ మొదలైంది.. ధర, లాంచ్ ఆఫర్‌లు, స్పెసిఫికేషన్‌లివే..!
కానీ, కొన్ని బ్యాంకులు యానివల్ ఫీ లేకుండానే లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తున్నాయి. కొన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డుల్లో మాత్రం యానివల్ ఛార్జీలను విధిస్తుంటాయి. ఈ యానివల్ ఛార్జీలను మాఫీ చేసుకోవడం చాలా మందికి తెలియకపోవచ్చు. అదేలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
వార్షిక రుసుము మాఫీ ఆఫర్ ఉందా? :
సాధారణంగా కొన్ని క్రెడిట్ కార్డ్ జారీ చేసే కంపెనీలు ముందుగా నిర్దేశించిన థ్రెషోల్డ్‌కు మించి ఖర్చు చేస్తే వార్షిక రుసుమును మాఫీ చేసే అవకాశాన్ని కార్డ్ హోల్డర్‌లకు అందిస్తారు. మీరు అధిక వార్షిక రుసుమును కలిగి ఉన్న క్రెడిట్ కార్డ్‌ని కలిగి ఉంటే.. ఈ ఛార్జీలను మాఫీ చేసేందుకు ఒక మార్గం ఉంది.
వింతగా అనిపించినా ఇది నిజం. కొన్ని సందర్భాల్లో కార్డ్ హోల్డర్ థ్రెషోల్డ్‌కు మించి డబ్బు ఖర్చు చేసినంత వరకు వార్షిక రుసుమును మాఫీ చేసేందుకు పలు బ్యాంకులు ఆఫర్ ఇస్తుంటాయి.
ఇదేలా వర్క్ అవుతుందంటే? :
మీకు వార్షిక రుసుము రూ. 3,500 ఉన్న క్రెడిట్ కార్డ్ ఉందని అనుకుందాం. ఇప్పుడు, రెండో సంవత్సరంలో రుసుమును తిరిగి పొందేందుకు బ్యాంక్ ఆప్షన్ ఇస్తే.. క్రెడిట్ కార్డ్ హోల్డర్ మొదటి సంవత్సరంలో కార్డును ఉపయోగించి కొంత మొత్తాన్ని ( రూ. 2 లక్షలు) ఖర్చు చేయడం చాలా ముఖ్యం. దీనిని వార్షికోత్సవ సంవత్సరం అని కూడా అంటారు.
అంటే మీరు ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా రూ. 2 లక్షలు ఖర్చు చేసినట్లయితే.. ఆ తర్వాత సంవత్సరంలో మీరు రూ. 3,500 వార్షిక రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. యాక్సస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లలో కొన్నింటిని ఉదాహరణగా అందిస్తున్నాం. మీ కనీస ఖర్చు థ్రెషోల్డ్ లోబడి వార్షిక రుసుమును మాఫీ చేసే ఆప్షన్లను అందిస్తాయి.
యాక్సిస్ బ్యాంక్ రివార్డ్స్ క్రెడిట్ కార్డ్ : వార్షిక రుసుము రూ. 1,000 ఉంటే.. మీరు రూ. 2లక్షల కన్నా ఎక్కువ ఖర్చు చేస్తే ఈ వార్షిక రుసుము మాఫీ అవుతుంది.
యాక్సిస్ బ్యాంక్ ఫ్రీఛార్జ్ ప్లస్ క్రెడిట్ కార్డ్ : వార్షికోత్సవ సంవత్సరంలో రూ. 50వేల ఖర్చులపై మినహాయింపు అందిస్తుంది.
యాక్సిస్ బ్యాంక్ క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డ్ : రూ. 1,000 జాయినింగ్ ఫీజు ఉంది. వార్షికోత్సవ సంవత్సరంలో రూ. 4లక్షల ఖర్చులపై మినహాయింపు పొందవచ్చు.
అయినప్పటికీ, వార్షిక రుసుము ఆందోళన కలిగిస్తే.. ఐసీఐసీఐ బ్యాంక్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే.. ఈ బ్యాంకు ప్లాటినం క్రెడిట్ కార్డ్ వంటి వార్షిక రుసుము లేని కార్డ్‌ని అందిస్తుంది. అదనంగా, క్రెడిట్ కార్డ్ మెంబర్‌షిప్‌తో రివార్డ్ పాయింట్లు, ఇతర ప్రయోజనాలు అందిస్తున్నాయో లేదో కూడా చెక్ చేయాలి.
ఒకవేళ అన్ని బెనిఫిట్స్ ఉన్నట్లయితే, వార్షిక రుసుము మాఫీ వర్తిస్తుంది. లేదంటే, యానివల్ ఛార్జీలను మాఫీ చేసేందుకు కార్డ్ ద్వారా డబ్బులు ఖర్చు చేసినా ఫలితం ఉండదని గమనించాలి.