Cyberattack Alert
Cyberattack Alert : భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న కొద్దీ, సైబర్ దాడులు, తప్పుడు సమాచారం వ్యాప్తి కూడా తీవ్రమైంది. ప్రభుత్వ అధికారులు మాత్రమే కాకుండా వ్యాపారులు, వ్యక్తులు కూడా ప్రమాదంలో ఉన్నారు.
అత్యవసర హెచ్చరికలు లేదా ప్రభుత్వ సలహాలు ఫిషింగ్ క్యాంపెయిన్, మాల్వేర్ అటాక్స్ వంటివి మరింత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ప్రభుత్వ అధికారిక రియల్ చెకింగ్ సెక్షన్ అయిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్, CERT-In ఆన్‌లైన్‌లో సమాచారాన్ని వినియోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండటంపై హెచ్చరిస్తున్నాయి. అప్రమత్తంగా ఉండటమే కాదు.. సైబర్ దాడులు, ఫిషింగ్ స్కామ్‌ల నుంచి మీ డేటాను ప్రొటెక్ట్ చేసేందుకు ఈ సెక్యూరిటీ టిప్స్ ఓసారి తెలుసుకోండి.
గుర్తుతెలియని ఫైళ్లను డౌన్‌లోడ్ చేయొద్దు : హిల్లరీ వైరస్ స్కామ్ వార్నింగ్ :
ఇండో-పాక్ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో హిల్లరీ వైరస్ గురించి అనేక రిపోర్టులు వ్యాపించాయి. గుర్తుతెలియని ఫైల్స్, డాక్యుమెంట్లు, వీడియోలు లేదా ఫేక్ జాబ్ ఆఫర్‌లను డౌన్‌లోడ్ చేసుకోవద్దు. భారత సైబర్ భద్రతా సంస్థలు వినియోగదారులను హెచ్చరించాయి.
సైబర్ దాడి చేసేవారు మాల్వేర్‌ను వ్యాప్తి చేసేందుకు వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి ప్లాట్ ఫారాలను ఉపయోగిస్తున్నారు.
మీడియా లేదా PDF ఫైల్‌లను కలిగి ఉన్న ఏవైనా మెసేజ్‌లను క్లిక్ చేయడం లేదా డౌన్‌లోడ్ చేయడం మానుకోవాలని సూచించింది. డౌన్‌లోడ్ చేస్తే.. మాల్వేర్ డేటాను పాడు చేస్తుంది. మీ సమాచారాన్ని దొంగిలిస్తుంది. మీ సేవింగ్ మొత్తాన్ని కోల్పోవచ్చు.
అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దు :
ఫిషింగ్ అనేది ప్రమాదకరమైనది. సైబర్ నేరస్థులు భద్రతా ఉల్లంఘన లేదా అత్యవసర జాతీయ సమస్య, ప్రభుత్వ సంస్థ లేదా వార్తా సంస్థ నుంచి వచ్చినట్లు నమ్మించే మోసపూరిత మెసేజ్‌లు పంపుతుంటారు.
ఒకసారి క్లిక్ చేసిన తర్వాత లింక్ ఫిషింగ్ వెబ్‌సైట్‌కు దారితీయవచ్చు లేదా బ్యాంక్ వివరాలు వంటి మీ ముఖ్యమైన వివరాలను దొంగిలించే మాల్వేర్‌ను ఇన్‌స్టాల్ చేయవచ్చు.
అనుమానాస్పదంగా వచ్చే కాల్స్ స్వీకరించొద్దు :
సైబర్ నేరస్థులు ఉపయోగించే మరో సాధారణ టెక్నిక్ ఏమిటంటే.. వ్యక్తులను మోసగించే తెలియని కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి.
గుర్తు తెలియని నంబర్ లేదా తెలియని మూలం నుంచి కాల్ లేదా మెసేజ్ స్వీకరించవద్దు. మీ వ్యక్తిగత డేటాను ఎప్పుడూ ఇవ్వకండి. మీకు అలాంటి కాల్స్ వస్తే.. ఫోన్ కట్ చేసి సంబంధిత అధికారులకు వెంటనే రిపోర్టు చేయండి.
తప్పుడు సమాచారంతో తప్పుదారి పట్టకండి :
సంక్షోభాలు లేదా సంఘర్షణలు వంటి పరిస్థితులలో తప్పుడు సమాచారం ఎక్కువగా ఉండొచ్చు. ఫేక్ న్యూస్, పుకార్లు వ్యాపిస్తాయి, తరచుగా భయాందోళనలు, గందరగోళం, హింసను సృష్టిస్తాయి.
సైబర్ దాడి చేసేవారు సాధారణంగా ఫేక్ సోషల్ మీడియా ప్రొఫైల్స్ లేదా వెబ్‌సైట్‌లను క్రియేట్ చేయడం ద్వారా ఉపయోగించుకుంటారు.
చట్టబద్ధమైన సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించింది. ఇతర మూలాలతో వార్తా నివేదికలను క్రాస్-చెక్ చేయండి.
సైబర్ నేరస్థులు సమాచారాన్ని డీప్‌ఫేక్‌లు, మోసపూరిత ఫొటోలు లేదా ఫేక్ ఆడియో రికార్డింగ్‌లు వంటి ఇతర వ్యూహాలను కూడా ఉపయోగిస్తారు. ఇలాంటి సందర్భాలలో ఎల్లప్పుడూ విశ్వసనీయతకు సంబంధించి క్రాస్-చెక్ చేయండి.
సోషల్ మీడియాలో వ్యక్తిగత డేటాను షేర్ చేయొద్దు :
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో సాధారణ పోస్ట్ కూడా ఆయుధంగా మారవచ్చు లేదా అవకతవకలకు దారితీయవచ్చు. మీ వ్యక్తిగత డేటాను ఎట్టి పరిస్థితుల్లో ఆన్‌లైన్‌లో షేర్ చేయకుండా ఉండండి.